అత్యంత ధనిక గ్రామంలో మురుగునీటి సమస్య

ధనిక నగరాలుంటాయి, ధనిక రాష్ట్రాలుంటాయి, మరి ధనిక గ్రామాలు కూడా ఉంటాయా? ఆమధ్య టమాట ధర విపరీతంగా పెరిగినప్పుడు తెలంగాణలో కొన్ని ధనిక గ్రామాలు ఏర్పడ్డాయి. అయితే అది తాత్కాలికం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది…

ధనిక నగరాలుంటాయి, ధనిక రాష్ట్రాలుంటాయి, మరి ధనిక గ్రామాలు కూడా ఉంటాయా? ఆమధ్య టమాట ధర విపరీతంగా పెరిగినప్పుడు తెలంగాణలో కొన్ని ధనిక గ్రామాలు ఏర్పడ్డాయి. అయితే అది తాత్కాలికం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది శాశ్వతమైన ధనిక గ్రామం గురించి.

ఈ గ్రామంలో లేని బ్యాంక్ లేదు. అన్ని బ్యాంకుల్లో కలిపి ఆ గ్రామస్తులు అక్షరాలా 7000 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు వేశారు. అంటే.. ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి ఓ కోటీశ్వరుడు ఉన్నాడన్నమాట. ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా పేరుపొందిన ఆ విలేజ్, గుజరాత్ లో ఉంది.

గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న ఆ ఊరు పేరు మాధాపర్. పోర్ బందర్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం. దాని జనాభా 62,000. ఎక్కువమంది పటేల్ తెగకు చెందిన వాళ్లు. ఈ ఊరికి ఎన్నారై గ్రామం అనే నిక్ నేమ్ కూడా ఉంది.

దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఒకరు విదేశాల్లో ఉన్నారు. అలా విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలంతా ఈ గ్రామానికి డబ్బు పంపిస్తుంటారు. అలా వచ్చిన డబ్బును గ్రామంలోనే వివిధ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తుంటారు. విదేశాల్లో కష్టపడి డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో మాధాపర్ వచ్చి స్థిరపడినవాళ్లే ఎక్కువ.

అలా ఈ ఊరిలో మొత్తం 17 బ్యాంకుల్లో 7వేల కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు జమ అయ్యాయి. దీంతో ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక దేశంగా అవతరించింది మాధాపర్.

బ్యాంకుల్లో డబ్బు మూలుగుతోంది కానీ గ్రామాభివృద్ధి కోసం మాత్రం ఎవ్వరూ ముందుకురాకపోవడం విచిత్రం. ఈ గ్రామానికి మంచినీటి ఎద్దడి ఉంది. నర్మదా నది నీరు ఈ గ్రామానికి తక్కువగా వస్తోంది. ఊరిలో వేసిన బోర్లలో కూడా 3 పాడయ్యాయి. దీనికితోడు మురుగు నీటి సమస్య కూడా ఉంది.

5 Replies to “అత్యంత ధనిక గ్రామంలో మురుగునీటి సమస్య”

  1. కచ్ జిల్లా వెళ్ళడానికి మన వైపు నుంచి వెళ్తే పోర్బందర్ తగలదు, అహ్మదాబాద్ మీదుగా వెళ్ళాలి. అందుకని పోర్బందరు నుంచి దూరం చెప్పడం అనవసరం.

    1. ఆర్టికల్ లో చెప్పిన ఊరు కచ్ జిల్లా లో ఉంది కనుక కచ్ పాక్ సరిహద్దు కనుక అక్కడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలు అయింది.

Comments are closed.