అది భారీ కట్టడం కాదు.. రేకుల షెడ్డు

హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఓ రేంజ్ లో ఉంది. మొన్నటికిమొన్న నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ ను కూల్చేసింది హైడ్రా. ఇప్పుడీ సంస్థ సీనియర్ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి కనస్ట్రక్షన్స్ పై…

హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఓ రేంజ్ లో ఉంది. మొన్నటికిమొన్న నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ ను కూల్చేసింది హైడ్రా. ఇప్పుడీ సంస్థ సీనియర్ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి కనస్ట్రక్షన్స్ పై కన్నేసింది.

ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించి మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న నిర్మాణం ఇది.

స్థానికంగా ఉన్న రంగలాల్ కుంట చెరువులో ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిథిలో ఈ నిర్మాణాన్ని చేపట్టారని చెబుతోంది హైడ్రా. 15 రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలిగించాలని, లేదంటే హైడ్రానే రంగంలోకి దిగుతుందని నోటీసులో పేర్కొంది.

తన సంస్థకు నోటీసులొచ్చిన విషయాన్ని మురళీమోహన్ ధృవీకరించారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, తను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అంటున్నారు. తన కంపెనీకి చెందిన భారీ భవంతులు కూల్చివేయబోతున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి తన వెంచర్ కు ఆనుకొని ఉన్న బఫర్ జోన్ లో.. 3 అడుగుల మేర ఓ రేకుల షెడ్డు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.

హైడ్రా ఇచ్చిన నోటీసులో కూడా ఆ రేకుల షెడ్డు ప్రస్తావన మాత్రమే ఉందని.. దాన్ని కూల్చేయడానికి హైడ్రా రావాల్సిన అవసరం లేదని, మరో 2 రోజుల్లో తనే దాన్ని కూల్చేస్తానని మురళీమోహన్ స్పష్టం చేశారు.

మరోవైపు ఆదివారం అయినప్పటికీ హైడ్రా గ్యాప్ ఇవ్వలేదు. సిటీలోని అమీన్ పూర్, మల్లంపేట్, మాదాపూర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసే పనులు కొనసాగిస్తోంది.

10 Replies to “అది భారీ కట్టడం కాదు.. రేకుల షెడ్డు”

Comments are closed.