చిన్న కథ.. పెద్ద హిట్

నచ్చకుంటే ఎన్ని వందల కోట్ల పెద్ద సినిమా అయినా పక్కన పెడతారు. నచ్చితే ఎంత చిన్న సినిమా అయినా నెత్తిన పెట్టుకుంటారు. తెలుగు ప్రేక్షకుడి గొప్పదనం అది. గోట్ అనే పెద్ద సినిమా విడుదలైంది.…

నచ్చకుంటే ఎన్ని వందల కోట్ల పెద్ద సినిమా అయినా పక్కన పెడతారు. నచ్చితే ఎంత చిన్న సినిమా అయినా నెత్తిన పెట్టుకుంటారు. తెలుగు ప్రేక్షకుడి గొప్పదనం అది. గోట్ అనే పెద్ద సినిమా విడుదలైంది. హీరో రెమ్యూనిరేషన్ నే 150 కోట్లు అని టాక్. సినిమా మొదటి రోజునే ఢమాల్ అనేసింది. చిన్న కథ కాదు అనే ట్యాగ్ లైన్ తో చిన్న సినిమా 35 విడుదలయింది. జ‌నం సూపర్ అంటున్నారు.

జ‌స్ట్ అయిదారు కోట్లతో తీసిన సినిమా ఇది. నాన్ థియేటర్ మీదనే ఎనిమిదిన్నర కోట్ల వరకు వచ్చింది. కమిషన్లు, ఇతరత్రా వ్యవహారాలు పోయినా విడుదల నాటికే బ్రేక్ ఈవెన్ అయిపోయారు. మొత్తం స్వంత విడుదలే. ఓవర్ సీస్ లో 100 కె చేసింది. తెలుగు రాష్ఠ్రాల్లో రెండు కోట్ల గ్రాస్ చేసింది. ఇదంతా నిర్మాతలకు లాభమే.

చిన్న సినిమా హిట్ కావడం సంగతి అలా వుంచితే ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ నిర్మాణ సంస్థను, దర్శకుడిని పరిచయం చేసింది. దర్శకుడి గురించి అప్పుడే ఎంక్వయిరీలు, అడ్వాన్స్ లు మొదలయ్యాయి. నిర్మాత ఎలాగూ మరో మంచి సినిమా తీసే ప్రయత్నం చేస్తారు.

నివేదా మంచి నటి అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. నివేదా లేకుంటే ఈ సినిమా ఇలా వుండేది కాదు. ఓవర్ సీస్ ట్రెండ్, డొమస్టిక్ ట్రెండ్ ఇలా కొనసాగితే నిర్మాతలకు అంతకు అంత లాభాలు వచ్చే అవకాశం వుంది.

10 Replies to “చిన్న కథ.. పెద్ద హిట్”

  1. ఐదారు కొట్లు అయినా ఎందుకు ఖర్చు అవుతాయి? రెండు కోట్ల లోపు మాత్రమే అవుతుందేమో!

  2. 90 వ దశకంలో ఎవడో ఈగలు తోలుకునే photo studio వాడు sudden గా lottery తగలగానే cinematographer గా తయారయ్యి పిల్లల తలల్ని ఒక ప్రక్కకి వాల్చి stills తీసినట్లున్నాడు.

  3. 90 వ దశకంలో ఎవడో ఈగలు తోలుకునే photto studio వాడు suddenn గా lotteryy తగలగానే cinematographerr గా తయారయ్యి పిల్లల తలల్ని ఒక ప్రక్కకి వాల్చి sstills తీసినట్లున్నాడు.

  4. విజయ్ ది గోట్ ప్లాప్ అన్న కూడా 1st day 105cr కలెక్ట్ చేసింది చిన్న సినిమా ఎంత బాగున్నా 1day 100cr చేస్తుందా star హీరో కి కొత్త హీరోకి వున్న తేడా అదే

  5. 35 అనే చాలా మంచి సినిమా. చిన్న పిల్లల మనస్తత్వాలు, పాఠశాలల్లో ఏవిధంగా ఉంటాయో చాలా బాగా చూపించారు. ఇది సినిమా కాదు, మీ యింట్లో మా యింట్లోని కథ. దర్శక హీరోకి అభినందనలు.

Comments are closed.