రెడ్‌బుక్కా? ఎర్రిబుక్కా?

ఈ ప్ర‌శ్నను వైసీపీ సంధిస్తోంది. స‌మాధానం చెప్పాల్సింది మంత్రి నారా లోకేశ్‌. రెడ్‌బుక్ రాసింది ఆయ‌నే. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేశ్ రెడ్‌బుక్ రాసిన సంగ‌తి తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెడ్‌బుక్‌లోని ఒక్కొక్క‌రి అంతు…

ఈ ప్ర‌శ్నను వైసీపీ సంధిస్తోంది. స‌మాధానం చెప్పాల్సింది మంత్రి నారా లోకేశ్‌. రెడ్‌బుక్ రాసింది ఆయ‌నే. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేశ్ రెడ్‌బుక్ రాసిన సంగ‌తి తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెడ్‌బుక్‌లోని ఒక్కొక్క‌రి అంతు చూడాల‌ని త‌న తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడికి ఎన్నిక‌ల ముందే లోకేశ్ అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ వ‌ర‌ద టీడీపీ, వైసీపీ మ‌ధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్‌కు దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా నారా లోకేశ్‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు సంధించింది. ఆ పోస్టు క‌థేంటో చూద్దాం.

“లోకేష్‌.. నీకు సిగ్గుందా? నిన్న హైదరాబాద్ వెళ్లి.. పొద్దుట స్పెషల్‌ ఫ్లైట్‌లో వచ్చావ్‌. నీకు ప్రజల గురించి పట్టింపు ఉందా? హుందాతనం గురించి నువ్వు మాట్లాడితే … ఆ పదమే సిగ్గుపడుతుంది. రాజకీయాల్లో బజారు భాషని ప్రవేశపెట్టి, రెడ్‌బుక్‌ అంటూ ఒక ఎర్రిబుక్కు పట్టుకుని పిచ్చిపాలన చేస్తున్న నువ్వు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిగారిని నిందించడం విడ్డూరంగా ఉంది. లక్షల మంది ప్రజలను వరదలకు వదిలేసి, పదులకొద్దీ ప్రజల ప్రాణాలు తీసిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదన్న అహంకారాన్ని ముందు విడిచిపెట్టు.

1.అలర్ట్‌ వచ్చినా అంతమందిని తరలించలేక వదిలేశామని మీ రెవెన్యూ సెక్రటరీ అన్నారు? దీని అర్థం చస్తే చావనీ అని విజయవాడ ప్రజలను వదిలేశారా? లేదా?

2.వెలగలేరు గేట్లు ఎత్తేముందు 20 గంటలు ముందుగానే అలర్ట్‌ చేశామని ప్రభుత్వ ఇరిగేషన్‌ ఇంజినీరు చెప్పాడు. మరి ఎందుకు ప్రజలను శిబిరాలకు తరలించలేదు?

3.ఇంత విపత్తు ఉన్నట్టుగా మాకు అలర్ట్‌లేదని సాక్షాత్తూ జిల్లాకలెక్టర్‌ చెప్తున్నారు. ఇది మీ ప్రభుత్వ లోపం కాదా?

4.ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణానదిపై ప్రాజెక్టుల్లో ఫ్లడ్‌ కుషన్‌ ఎందుకు పెట్టుకోలేదు. మీ నిర్లక్ష్యం కాదా?

ఈ ఘోరవైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్ర‌బాబునాయుడు, నువ్వు, మీ మంత్రులు పబ్లిసిటీ స్టంట్లు మొదలుపెట్టారు. సానుభూతి స్టోరీలు సృష్టిస్తున్నారు. ఎనిమిది రోజులు గడిచినా ఇప్పటికీ కనీసం ప్రతి ఇంటికీ ఆహారం అందించగలిగామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇది కచ్చితంగా చంద్రబాబు సృష్టించిన విపత్తే” అని వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండు రోజులు వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద బాధితుల్ని ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అయితే జ‌గ‌న్ అర్థంప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు.

15 Replies to “రెడ్‌బుక్కా? ఎర్రిబుక్కా?”

  1. ఒరే మీకు దండం పెడతా, ఈ ఓదార్చడం అనే మాట వాడకండ్రా స్వామి..ఇదొక బూతు పదం ఐపోయింది అన్నియ పుణ్యమా అని..

  2. ఒరే మీకు దండం రా అయ్యా..ఈ ఓదార్చడం అనే మాట వదిలేయండిరా.. సచిపోతున్నాం ఈ పదాన్ని వినలేక

    1. ఈసారి ఓదార్పు యాత్ర కి వెళితే గజ్జి కుక్క ని తరిమినట్లు తరిమి గాడిద యాత్ర చేయిస్తారు !!

    2. ఈసారి ఓ*దా*ర్పు*యా*త్ర కి వెళితే గ*జ్జి*కు*క్క ని తరిమినట్లు తరిమి *గా*డి*ద*యా*త్ర చేయిస్తారు !!

  3. జగన్ సొంత డబ్బు తో ప్రజల సంక్షేమం కోసం బటన్ లు నొక్కమను ఇపుడు. ఎవడో సోషల్ మీడియా లో అని చెప్పి తిట్టడం ఎందుకు?

Comments are closed.