ఒక్కసారి రాజమౌళి చేతుల్లోకి వెళ్తే, ఇక ఏదైనా ఆయన చెప్పినట్టు జరగాల్సిందే. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, బయట ఏ కార్యక్రమం చేసినా దానికి రాజమౌళి పర్మిషన్ కావాల్సిందే. ఎందుకంటే, హీరోల మేకోవర్స్ బయటపడతాయనే ఆందోళన రాజమౌళిది.
ఇప్పుడు మహేష్ బాబుది కూడా అదే పరిస్థితి. రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దర్శకుడి సూచనల మేరకు మేకోవర్ కూడా ప్రయత్నిస్తున్నాడు. దీనికి సంబంధించి రీసెంట్ గా కొన్ని ఫొటోలు కూడా బయటకొచ్చాయి.
లేటెస్ట్ లుక్ లో మహేష్ బాబు కాస్త కండపట్టాడు. గడ్డం, జుట్టు కూడా పెంచాడు. ఫైనల్ లుక్ ఇంకా లాక్ చేయలేదు. ఆ ప్రాసెస్ లోనే ఉన్నాడు.
ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు మహేష్ చీఫ్ గెస్ట్ అనే ప్రచారం సాగుతోంది. మామూలు రోజుల్లోనైతే మహేష్ కచ్చితంగా వస్తాడు. ఎందుకంటే, అది కొరటాల శివ సినిమా కాబట్టి. కానీ ఈసారి మహేష్ రావాలంటే రాజమౌళి పర్మిషన్ కావాలంటున్నారు చాలామంది.
చాలా ఏళ్ల కిందట మహేష్, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించారు. మళ్లీ ఇన్నేళ్లకు దేవర ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వీళ్లిద్దరూ కలుస్తారనే ప్రచారం సాగుతోంది. రాజమౌళికి అభ్యంతరం లేకపోతే ఎన్టీఆర్-మహేష్ మరోసారి కలవడం పక్కా.
vc estanu 9380537747
Call boy works 8341510897
దాందేముంది హెల్మెట్ పెట్టుకుని వస్తే సరిపోతుంది
mahesh ki rajamouli permission entra
ఎవరు వచ్చినా,రాకున్నా మేం థియేటర్లో చూడం