బియ్యం బస్తాలు రెడీ… దించే వాళ్లేరి?

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల స‌హాయ‌క చ‌ర్య‌లు ఇవాళ్లి ఉద‌యం నుంచి ముమ్మ‌రం అయ్యాయి. అయితే ఆందోళ‌న క‌లిగించే అంశం ఏంటంటే… బాధితుల‌కు అందించ‌డానికి వేలాది బియ్యం బ‌స్తాల‌ను ప్ర‌భుత్వం విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చింది. అయితే వాటిని…

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల స‌హాయ‌క చ‌ర్య‌లు ఇవాళ్లి ఉద‌యం నుంచి ముమ్మ‌రం అయ్యాయి. అయితే ఆందోళ‌న క‌లిగించే అంశం ఏంటంటే… బాధితుల‌కు అందించ‌డానికి వేలాది బియ్యం బ‌స్తాల‌ను ప్ర‌భుత్వం విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చింది. అయితే వాటిని బాధితుల‌కు అందించే దిక్కు లేకుండా పోయింది.

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోని బీఆర్‌టీఎస్ రోడ్డులో 500 లారీల్లో, ఒక్కో వాహ‌నంలో 1000 నుంచి 1200 బ‌స్తాలు చొప్పున బియ్యం బ‌స్తాలున్నాయి. వాటిని బాధితుల వ‌ర‌కూ తీసుకెళ్ల‌డానికి ఏ ఒక్క‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బియ్యం బ‌స్తాల్ని అన్‌లోడ్ చేసి, బాధితుల ఇళ్ల‌కు చేర‌వేయ‌డానికి అధికారులు ఎదురు చూస్తున్నార‌ని స‌మాచారం.

నిజానికి ఈ బియ్యాన్ని విజ‌య‌వాడ సిటీ అంతా పంపిణీ చేయొచ్చు. అయితే ఏం లాభం? త‌గినంత మంది లేబ‌ర్ లేక‌పోవ‌డం, వాళ్ల‌ను పిలిపించుకునే వ్య‌వ‌స్థ కొర‌వ‌డ‌డంతోనే బియ్యం బ‌స్తాలు లారీల్లోనే ఉన్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌ట్టి, స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంత‌మ‌య్యాయి.

అయితే బియ్యం విష‌యంలో మాత్రం ఎందుక‌నో అందించే ప్ర‌క్రియ చేప‌ట్ట‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. బియ్యాన్ని బాధితుల‌కు అందిస్తే, వాళ్లంతా క‌డుపు నింపుకుంటారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం బియ్యాన్ని పేద‌ల‌కు అందించ‌డానికి స‌త్వ‌రం చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం వుంది.

4 Replies to “బియ్యం బస్తాలు రెడీ… దించే వాళ్లేరి?”

Comments are closed.