ప్రతి ఒక్కరికీ ఓ వర్కింగ్ స్టయిల్ వుంటుంది. చంద్రబాబుకూ వుంది. ఎందుకో మరి చంద్రబాబుకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం అంతగా సరిపడదు. చంద్రబాబు పాలనలో పదవులు తక్కువగా పంపిణీ వుంటుంది. చాలా తప్పని సరి వాళ్లకు తప్ప పదవులు అందవు. పైగా ఊ వరుసపెట్టి పదవులు పంచేయరు. అప్పుడో సారి.. ఇప్పుడో సారి జనం గమనించడానికి వీలు కాకుండా పదవులు చాలా సైలంట్ గా ఇవ్వడం కూడా చంద్రబాబు స్టయిల్.
గతంలో సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం శ్రేణులు ఈ నామినేటెడ్ పదవుల కోసం చాలా అంటే చాల ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే జగన్ తను అధికారంలో వున్నపుడు విచ్చలవిడిగా పదవులు పంచేసారు. పదవులు పంచడమే కాదు, ప్రతి ఒక్కరికీ భారీగా జీత భత్యాలు ఏర్పాటు చేసారు. పైగా గడచిన అయిదేళ్లలో తెలుగుదేశం తరపున జనాలు చాలా మంది పోరాడారు. వాళ్లంతా ఇప్పుడు చాలా ఆశగా వున్నారు.
ఇలాంటి టైమ్ లో చంద్రబాబు పవర్ లోకి వచ్చి నెలలు గడుస్తున్నాయి. కానీ నామినేటెడ్ పదవులు అన్నవే లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని ఓ మీడియా అధినేత ఆశిస్తున్నారు. కానీ అది అందని ద్రాక్ష మాదిరిగా అలాగే వుంది. జనసేన జనాలకు పదవులు వస్తాయనే ఆశ వుంది. కానీ వాళ్లకు తెలియని సంగతి ఏమిటంటే అసలు పదవులు ఇవ్వడం అన్నది పవన్ కే అంతగా ఇష్టం లేని వ్యవహారం అని. అలా ఇవ్వాలి అనుకుంటే ఈపాటికే కొణతాలకు మంత్రి పదవి దక్కేది.
తనను మించి పార్టీలో ఎవ్వరూ వుండకూడదన్నది పవన్ సైకాలజీ అని దగ్గరగా చూసిన వాళ్లు చెబుతారు. అందుకే తప్పక మనోహర్ కు పదవి వచ్చింది. మరో పదవి ఇవ్వాలి లెక్క ప్రకారం కనుక దుర్గేష్ ను ఎంచుకున్నారు తప్ప సీనియర్ అయిన కొణతాలను మాత్రం కాదు.
ఇక అలాంటిది నామినేటెడ్ పదవులు మాత్రం తీసుకుంటారా. ఈక్వేషన్ ప్రకారం తీసుకున్నా, అవి చిన్న నాయకులకే తప్ప కాస్త తలెత్తే నాయకులకు అయితే వుండవు. అలా వున్నా తెలుగుదేశం నుంచి జనసేనలోకి వచ్చిన జనాలకు, తెలుగుదేశం జనాలను జనసేనలోకి పంపిన తరువాత, ఇలా పదవులు ఇస్తారు తప్ప, నికార్సయిన జనసైనికులకు అయితే కష్టం.
ఇలాంటి నేపథ్యంలో మొత్తం ఓ పాతిక వరకు ఒకేసారి నామినేషన్ పదవులు ఇచ్చి తాను మారిన మనిషిని అని అనిపించుకోవాలనుకున్నారు చంద్రబాబు. దానికి చాలా పెద్ద కసరత్తు చేయాలి. ఎందుకంటే భాజపాకు మూడో నాలుగో ఇవ్వాలి. అలా ఇవ్వాల్సిన వారికి తెలుగుదేశం మూలాలు వుండాలి. అలాగే జనసేన కూడా. మిగిలినవి తెలుగుదేశం తీసుకోవాలి. సామాజిక ఈక్వేషన్లు చూడాలి. అన్నింటికన్నా ముందుగా క్రీమీ లేయర్ పదవులు అన్నీ తమకు, తమకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోవాలి. ఇలా చాలా లెక్కలు వుంటాయి. ఇవన్నీ చంద్రబాబు- లోకేష్ కలిసి డిస్కస్ చేసి డిసైడ్ చేయాలి.
ఇదిగో, అదిగో అనుకుంటూ వుంటే… ఇప్పుడు రాష్ట్రం అంతా వరదలు వచ్చి పడ్డాయి. ఇక ఇంతే సంగతులు. కనీసం నెల రెండు నెలలు వెనక్కు తోసేయడానికి సరిపడా రీజన్ దొరికింది. ఇక ఎవరు మాత్రం అడుగుతారు. జనసేన, భాజపా ల వైపు నుంచి ఏ వత్తిడీ వుండదు. తెలుగుదేశం జనాలు మాట్లాడరు. అందువల్ల ఈ వాయిదాల పర్వం ఇలా సాగిపోతుంది.
మంచిది ఈ మేరకు అయినా రాష్ట్రానికి బాబు మేలుఛేదినట్టే
Tondara Ami ledu