ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించొచ్చు

ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించొచ్చ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తుపాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు అధికారుల‌తో స‌మీక్షిస్తున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో సీఎం…

ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించొచ్చ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తుపాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు అధికారుల‌తో స‌మీక్షిస్తున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో సీఎం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల్లో తుపాను ప్ర‌భావంతో వ‌ర్షాలు ప‌డుతుండ‌డంతో అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

చంద్ర‌బాబు మాట్లాడుతూ భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. వాహ‌నాలు, వ్య‌క్తులు వెళ్ల‌లేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాల‌ని కోరారు. రిజ‌ర్వాయ‌ర్ల‌కు వ‌స్తున్న వ‌ర‌ద‌, అలాగే కిందికి వ‌దులుతున్న నీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ వుండాల‌న్నారు. డ్రోన్ల ద్వారా కాలువ‌ల్లో నీటి ప్ర‌వాహం, అలాగే ఎక్క‌డైనా గ‌ట్లు తెగే ప్ర‌మాదం ఉందేమో క‌నిపెట్టాల‌న్నారు.

విజ‌య‌వాడ‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంత‌మ‌య్యాయ‌న్నారు. బుడ‌మేరుకు వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్టింద‌న్నారు. ఇక భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు. విజ‌య‌వాడ‌లో విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింద‌న్నారు. విజ‌య‌వాడ‌లో వైద్య‌శిబిరాల‌ను కొన‌సాగించాల‌ని సంబంధిత అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

ఇళ్ల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డానికి ఫైర్ ఇంజ‌న్ల‌ను పెద్ద ఎత్తున న‌గ‌రానికి తెప్పించిన‌ట్టు సీఎం చెప్పారు. అలాగే ఏలేరు రిజ‌ర్వాయ‌ర్‌కు వ‌చ్చే నీటిని, వ‌దిలే నీటిని బ్యాలెన్స్ చేయాల‌ని అధికారుల‌కు బాబు సూచించారు.

5 Replies to “ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించొచ్చు”

  1. Ekkkada chesav thatha? Irrigation dept gave information on Saturday but not alerted people. Not even sent them to rehabilitation centers. Eppudu emi cheppina waste. You already did big mistake and failed utterly

Comments are closed.