తమిళ చిత్రసీమలో మరో చిన్న సంచలనం. మొన్నటికిమొన్న ధనుష్ తన భార్యకు విడాకులిచ్చాడు. వాళ్లిద్దరూ అధికారికంగా విడిపోయారు. ఇప్పుడు జయం రవి వంతు. తన భార్యతో విడిపోతున్నట్టు హీరో జయం రవి స్వయంగా ప్రకటించాడు.
“ఎన్నో తర్జనభర్జనలు పడ్డాను. ఇంకెన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి ఆర్తితో నా వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. త్వరలో నేను ఒంటరి కాబోతున్నాను.”
ఇలా తన భార్యకు విడాకులిచ్చిన విషయాన్ని వెల్లడించాడు జయం రవి. తన అభిమానులు, మీడియాతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని.. అందుకే ఈ విషయంలో కూడా అంతే నిజాయితీగా ఉండడం కోసం ఈ ప్రకటన చేశానని, దయచేసి ఎవ్వరూ పుకార్లు సృష్టించొద్దని కోరాడు రవి.
ఆర్తి, తను కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించిన జయం రవి.. తన ప్రైవసీని గౌరవించాలని, ఇంతకుమించి ఈ అంశంపై తను స్పందించనని, మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని రంజింపజేస్తానని వెల్లడించాడు.
2009లో జయం రవి, ఆర్తి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు. కోలీవుడ్ లో ప్రస్తుతం లీడింగ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు జయం రవి.
Vidipondi malli iddaru vidividiga inkko marriage
Call boy works 9989793850
Call boy jobs available 9989793850