బాబు మాజీ పీఎస్‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీ‌నివాస్‌పై సస్పెన్ష‌న్‌ను ఏపీ ప్ర‌భుత్వం ఎత్తివేసింది. త‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని పెండ్యాల కూట‌మి ప్ర‌భుత్వానికి ద‌రఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించడం…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీ‌నివాస్‌పై సస్పెన్ష‌న్‌ను ఏపీ ప్ర‌భుత్వం ఎత్తివేసింది. త‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని పెండ్యాల కూట‌మి ప్ర‌భుత్వానికి ద‌రఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించడం గ‌మ‌నార్హం.

స్కిల్ స్కామ్ కేసులో చంద్ర‌బాబుతో పాటు పెండ్యాల‌పై కూడా సీఐడీ కేసు న‌మోదు చేసింది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో పెండ్యాల‌కు సీఐడీ నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అమెరికాలో గ‌డుపుతూ వ‌చ్చారు. విధుల‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చి, అనంత‌రం నాటి జ‌గ‌న్ స‌ర్కార్ ఆయ‌న‌పై సెప్టెంబ‌ర్ 30న స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

2020, ఫిబ్ర‌వ‌రి 6న పెండ్యాల ఇంట్లోతో పాటు ప‌లు కంపెనీల్లో ఐటీ సోదాలు జ‌రిగాయి. ఆ సోదాల్లో రూ.2 వేల కోట్ల లావాదేవీలు గుర్తించిన‌ట్టు ఐటీ అధికారులు అప్ప‌ట్లో చెప్పారు. అయితే ఏపీలో వైసీపీ స‌ర్కార్ దిగిపోవ‌డం, కూట‌మి అధికారంలోకి రావ‌డంతో పెండ్యాల అమెరికా నుంచి తిరిగి ఏపీకి చేరుకున్నారు.

ఉద్యోగ విధుల్లో చేరాల‌ని ఆయ‌న కోరుకోవ‌డం, అందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ స‌మ్మ‌తించి, స‌స్పెన్ష‌న్ ఎత్తివేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడైన పెండ్యాల రానున్న రోజుల్లో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

10 Replies to “బాబు మాజీ పీఎస్‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌!”

  1. This is absolute misuse of power. Pendyala should have proved his innocence in the 380 crore skill scam and have courts lift his suspension but instead power is being misused and case is being sabotaged by using political power. This is utter disgrace to democracy and TDP proved to be no different than Jagan in this regard.

  2. Misuse of power and this government is no different than previous in terms of misusing their power. What are courts doing when actions are being taken to sabotage the case when it is still active in the courts?

  3. “2020, ఫిబ్ర‌వ‌రి 6న పెండ్యాల ఇంట్లోతో పాటు ప‌లు కంపెనీల్లో ఐటీ సోదాలు జ‌రిగాయి. ఆ సోదాల్లో రూ.2 వేల కోట్ల లావాదేవీలు గుర్తించిన‌ట్టు ఐటీ అధికారులు అప్ప‌ట్లో చెప్పారు.”

    did they really say that or it is one psyko fakoo batch creation. are you part of that batch?

Comments are closed.