చూడబోతే రాజ్యాంగము మరియు నైతిక హక్కులు, నైతిక విలువలు, రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు మాట్లాడే అర్హత సమకాలీన రాజకీయాలలో భారత రాష్ట్ర సమితి నాయకుడు హరీష్ రావుకు మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తుంది.
ఎందుకంటే రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు, ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని నీతులు చెప్పే రాహుల్ గాంధీకి లేనే లేదని హరీష్ రావు తీర్మానం చేశారు. ఇదంతా కేవలం తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు మాత్రమే కాదు. ఆయనకు సరికొత్త అంశం మీద ఆవేశం పుట్టుకొచ్చింది.
రేవంత్ రెడ్డి సర్కారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఆరికపూడి గాంధీని నియమించింది. ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే. తర్వాత, అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోకపోయినప్పటికీ ప్రస్తుతానికి వారి పంచనే ఉన్నారు. అలాంటి గాంధీ చేతిలో పిఎసి చైర్మన్ పదవిని పెట్టడం హరీష్ రావు సహించలేకపోతున్నారు. ఈ పదవిని కట్టబెట్టే విషయంలో సభా సాంప్రదాయాల గురించి, రాజ్యాంగ విలువల గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్ష బాధ్యతలను ప్రతిపక్షానికి చెందిన సభ్యుడికి అప్పగించడం అనేది సభా సంప్రదాయమని రాజ్యాంగాన్ని గౌరవించడం అవుతుందని అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి తమ పార్టీలో చేర్చుకున్న భారాస ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ చేతికి ఆ బాధ్యత ఇచ్చారనేది హరీష్ రావు ఆవేదన.
ప్రతిపక్ష సభ్యులలో ఆ పదవి తననే వరిస్తుందని ఆయన ఇన్నాళ్లు కలగంటూ ఉన్నారేమో తెలియదు. ఆ కలలు భంగపడేసరికి ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. అయినా పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వనందుకు అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కి కట్టబెట్టినందుకు ఇంతగా గోల చేస్తున్న హరీష్ రావు తెలుగుదేశం నుంచి ఫిరాయించిన తలసాని శ్రీనివాస యాదవ్ కు ప్రభుత్వంలో మంత్రి పదవిని కల్పించినప్పుడు తమ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ రాజ్యాంగాన్ని పాటించి చేశారో కూడా ప్రజలకు విడమర్చి చెబితే బాగుంటుంది.
BRS ని బీజేపీ లో కలిపితే , ఈయన టీడీపీ లోకి జంప్ అవుతాడని పుకార్లు. 2028 లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయి. KTR , కవిత కి బీజేపీ లో టిక్కెట్లు వస్తే , హరీష్ టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుంటాడు.
Call boy works 9989793850
vc available 9380537747