అమెరికా అంటే మనవాళ్లకి మోజే. ఇంచుమించు ఇంటికొకళ్లు చొప్పున అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లో, చదువుకుంటున్నవాళ్లో ఉంటున్నారు. తెలుగువాళ్లు, దక్షిణాది రాష్ట్రాల వాళ్లు సాఫ్ట్ వేర్, బ్యాంకింగ్, మెడికల్ లైన్స్ లో ఉద్యోగాలకి రాజమార్గంలో వెళ్తుంటారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూడా ఇలా వెళ్లే వాళ్ల సంఖ్య ఎక్కువే.
అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మన దృష్టిలో ఎక్కువగా మెక్సికో వాళ్లే. కానీ మన దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా వరకు వెళ్తున్నారు. వాళ్ల గురించి చెప్పుకునే ముందు, ఒక్కసారి అమెరికాలో ఉద్యోగాలకి సంబంధించిన కొన్ని తాజా గణాంకాల గురించి చెప్పుకుందాం.
2020- 2023 మధ్య అమెరికాకి వచ్చిన వారిలో 26 లక్షల మంది “లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్” ఉన్నారు. ఇక ఇల్లీగల్ గా ఉన్న వలసదారులు అయితే 65 లక్షలమంది ఉన్నారట. ఆ సంఖ్య 2026 నాటికి 87 లక్షలవుతుందని అంచనా.
మరి చూస్తూ చూస్తూ ఈ ఇల్లీగల్ బ్యాచ్ ని ఎందుకు దేశంలోకి రానిస్తోంది అమెరికా అంటే దానికొక కారణం ఉంది. వీళ్లకి వీసా, గ్రీన్ కార్డ్ లాంటి తాడూ బొంగరాలేవీ ఉండవు కాబట్టి అమెరికా రాజ్యంపై వీరిని పొషించాల్సిన భారం పడదు. అనగా, వీళ్ళ వైద్యం మీద, విద్య మీద, ఉపాధి మీద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అమెరికా ఖజానాకి.
వాళ్లే ఏదో తక్కువ వేతనాలకి కష్టం చేసుకుని బతుకుతారు. దానివల్ల దేశంలో బ్లూ కాలర్ జాబ్స్ కి పెద్ద ఇబ్బంది రాదు. అదే వాళ్లని లీగల్ గా రమ్మంటే, కనీస వేతనాల పేరుతో ఖజానాని కుమ్మరించాలి. దానికి తోడు ఇతర సదుపాయాలు కూడా ఇవ్వాలి. ఎంత ట్యాక్సులు వసూలు చేసినా బ్రేకీవెన్ కాకపోవచ్చు. ఒకవేళ బ్రేకీవెన్ అయినా బ్లూ కాలర్ సర్వీసులు చాలా ఖరీదైపోతాయి. దాని ప్రభావం దేశ పురోగతిపై పడుతుంది. కనుక ఇల్లీగల్ వలసల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.
2020 తర్వాత దేశంలోకి వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా స్పానిష్ మాట్లాడే, తక్కువ విద్యార్హతలున్న యువకులు అని తేలింది. వీరిలో 78% మంది పని చేయగల స్థితిలో ఉన్నారు. వీళ్లు ప్రధానంగా నిర్మాణాలు, హౌస్ కీపింగ్, ఆహార సరఫరాల విభాగాల్లో పని చేస్తున్నారు. ఈ తరహా జనం అధికంగా వెనెజులా, మెక్సికో, హోండురస్ దేశాల నుంచి వలసొస్తున్నారు.
ఇలా ఎంతమంది వచ్చినా అమెరికాలో నిరుద్యోగ సమస్య మాత్రం తగ్గడం లేదు. దానికి కారణం కూడా కొంతవరకు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని రానీయడమే అని చెప్పుకోవాలి. ఇలా వచ్చిన వాళ్లు తక్కువ మొత్తానికి ఏదో పని చేస్తారు. లోకల్ గా వేలిడ్ విసాతో ఉన్నవాళ్లో, గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్లో అయితే అంత తక్కువకి చేయలేరు. ఎందుకంటే వాళ్లు సంపాదనపరంగా, ట్యాక్సుల పరంగా దేశానికి ఆన్సరబుల్.
2023లో మూడు కోట్ల మంది విదేశీయులకి అమెరికా ఉద్యోగాలివ్వగలిగింది. అది మొత్తం అమెరికా వర్క్ ఫోర్స్ లో ఏకంగా 23%. వీరిలో రాజమార్గంలో సాఫ్ట్ వేర్ జాబ్స్ కోసం వచ్చిన భారతీయులు గణనీయంగా ఉంటారు.
ఇక మనం చెప్పుకునే ఇండియా నుంచి వెళ్లే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంజాబ్, హర్యానాల నుంచి ఉన్నారు. “డంకీ” సినిమాలో చూపించినట్టు వీళ్లు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తుంటారు.
అమెరికా చేరాలంటే ముందుగా ఇండియన్ పాస్ పార్ట్ కి వీసా అడగని అక్కడి దగ్గర దేశాలను ఎంచుకుంటారు. వాటిల్లో ఈక్వడార్, ఎల్ సాల్వడార్ ఉన్నాయి. ఎల్ సాల్వడార్ అయితే సగం రిస్క్ తగ్గినట్టే. ఎందుకంటే అక్కడి నుంచి గౌతమాలా మీదుగా అక్రమంగా మెక్సికోలోకి ప్రవేశించి, అక్కడి నుంచి గోడ దూకించి అమెరికాలోకి పంపే ఇల్లీగల్ వ్యవస్థలున్నాయి. ఆ ప్రయాణం మరీ అంత కష్టమైనది కాదు.
అది కుదరక, ఈక్వడార్లో దిగితే మాత్రం చాలా రిస్కీ. అడవుల మీదుగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చాలా దూరం నడవాలి. కొలంబియా, పనామా, కోస్టారికా, నికరాగువా దేశాలు దాటి ఎల్ సాల్వడార్ చేరుకుని..అక్కడి నుంచి పైన చెప్పిన విధంగా మెక్సికో మీదుగా అమెరికా వెళ్తారు. ఇంత ప్రయాణంలో కొంతమంది మార్గమధ్యంలోనే చనిపోతుంటారు. శారీరకంగా చాలా ధృఢంగా ఉండి, అదృష్టం ఉన్నవాళ్లు మాత్రమే ఈ మార్గం గుండా ప్రయాణించి మెక్సికో మీదుగా అమెరికా చేరుకుంటారు.
ఈ తప్పుడు దారిలో అమెరికా వెళ్లే జనం గురించి మన ఇండియన్స్ చాలామందికి తెలీదు.
ఇలా వెళ్లిన వాళ్లు అక్కడ బార్బర్స్ గానో, హెల్పర్స్ గానో ఉండిపోవాలి. అలా ఉండగా ఉండగా ఏ పాతికేళ్లకో వీళ్లని అమెరికా గుర్తించవచ్చు. లేదంటే లేదు. అయినా సరే, డాలర్ మోజో, ఇంట్లో అప్పులో, ఇతర అవసరాలో, ఆశలో, దూరపు కొండలు నునుపో తెలీదు కానీ ఈ తరహాలో అమెరికాకి వచ్చి వాలుతున్నవారున్నారు.
ఈ బాపతులో వెళ్లే వాళ్లు నెలకి ఎంత సంపాదించగలుగుతారు, ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు, ఎంత ఇంటికి పంపగలుగుతారు? ఆ లెక్కలేసుకోకుండా వెళ్తున్నారు చాలామంది.
ఎలా చూసుకున్నా అమెరికాలో ఖర్చులు పోను ఏ లక్షో మిగుల్చుకోవడానికైతే అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఏదైనా పెద్ద సిటీలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం పెట్టుకున్నా అంతకంటే ఎక్కువ సేవ్ చేయొచ్చు. కనీసం నెలకి 3 లక్షలు పైబడి దాయగలిగే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంటే అమెరికా గురించి ఆలోచించవచ్చు. లేకపోతే అనవసరం. పోనీ అంత శ్రమకి, త్యాగానికి, తెగింపుకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుందా అంటే అక్కడ డ్రగ్స్, గన్ లాస్ మధ్యన బతికే ప్రజల నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు.
ఇదంతా చెప్పడం దేనికంటే అమెరికా మీద మోజు ఉంటే సరిపోదు. అక్కడికి వెళ్లి ఏం చేయగలం? ఎంత సంపాదించగలం? మనలో ఉన్న ప్రతిభావిశేషాలేంటి? కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఏవిటి? ఇక్కడ లేనిది అక్కడ ఉంటుందనుకునేది ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలి. ఎవరెవరో అమెరికా వెళ్తున్నారు నేనూ వెళ్లాలి అని అనుకోకుండా ఒకటికి నాలుగు సార్లు అన్ని విధాలుగా అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
తెలుగు పిల్లల వరకూ.. ఇల్లు తాకట్టు పెట్టి దాదాపు కోటి వరకు బ్యాంక్ లోన్ తీసుకుని తల్లిదండ్రులు చదువుకోసం అమెరికా పంపుతున్నారు. ఒకప్పుడైతే అమెరికాలో అడుగు పెడితే చాలు ఉద్యోగం ఆటోమెటిగ్గా వస్తుంది అనే భరోసా ఉండేది. ఇప్పుడా రోజులు లేనే లేవు. వెళ్తున్న విద్యార్థులకి ఉద్యోగాలు రావట్లేదు. వెనక్కి వచ్చేసి ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామంటే చేసిన అప్పు తీరదు. తాకట్టు పెట్టిన ఇల్లు విడిపించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. అలా కాకుండా అక్కడే ఉండిపోవాలంటే .. అదిగో.. ఇందాక చెప్పుకున్న పంజాబ్, హర్యానా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ టైపులో ఉండిపోవాల్సి వస్తుంది. అలా ఉండిపోయినా కష్టాలు ఎప్పటికి తీరతాయో తెలీదు. కనుక అమెరికా కలలుగనే ముందు తస్మాత్ జాగ్రత్త!
చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ, ఇప్పటికే అమెరికాకి విద్య కోసం వచ్చి అక్కడ బతకడం కోసం పార్ట్ జాబులు కూడా దొరక్క, ఇండియన్స్ ఇళ్లల్లో పనిమనుషులుగా మారిన తెలుగు అమ్మాయిలుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు తెలుగు రాష్ట్రాల్లో టీచర్లో, క్లర్కులో, ఇతర మధ్యతరగతి ఉద్యోగస్థులో అయి ఉంటారు. పోనీ “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అనుకుందామనుకున్నా అంతిమంగా సాధించేదేవిటి? విద్య పూర్తయ్యాక ఉద్యోగం రాకపోతే ఇలాంటి అమ్మాయిలు వెనక్కి రావాలా? చేసిన ఎడ్యుకేషన్ లోన్ తీర్చడానికి అక్కడే ఇంకో నాలుగిళ్లు చూసుకోవాలా?
తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మరీ ఇలా తమ పిల్లల్ని పనిమనుషుల్ని చేసి సాధించేదేవిటో!
– పద్మజ అవిర్నేని
Don’t come here unless you are talented.. not worth it. I see many kids struggling to stay afloat..
AMERICA ante bhayapettesavu but U S lo bagane unnaru mana vallu
Naa Anveshana Video ni copy kotti raasinatlundhi aa article. 🙂
మంచిదే కదా.. అక్కడ కూడా హాయిగా పనిమనుషులు పాలేరులు దొరుకుతారు…
US job market is pretty bad now. In Dallas if you go to any India restaurant or Indian owned Gas stations/ shops you will see only Desi students(Most of them are telugu). Few of them are working from years. So be careful. It is getting super tough to get any job in US.
Excellent Article , very useful
“నెలకు మూడు లక్షలు దయగలిగితే..” అసలు ఇది సాధ్యమా?
ఇంకా ఎక్కువే దాచవచ్చు…
gaddi tinte enka
parledu nenu it lo ne vunna automation lo, naa exp senior level ki eche salary tho 3 l asadhyam
Not easy, single income house holds lo ee doctor or niche skill set unte tappa.
100k salary unnavallaki vacche net: 75k/yr
per month expenses:
Mortgage/housing – 2k~
food – 500~
utilities – 400~
Gas – 300~
clothing/additional expenses – 500~
indurance – 100~
clothing – 200~
car note – 300~
house maintenance/miscellaneous – 200~
Ante decentga batakadaniki 4500/month out of a possible 6500/month after taxes. Kids unte stumps lechenatte!
ante decentga batakadaniki 4300/month.
ante kaneesam oka ~3800
100k salary unna single income family ki kudaradu.
పంజాబ్, హర్యానా డ్రగ్స్ వాళ్ళ యువత బాగా పాడై పోయారు. తల్లితండ్రులు పిల్లల్ని అక్కడ ఉంచే ఉద్దేశ్యం లేక పంపేస్తున్నారు.
ఇప్పుడీ ఆంధ్ర లో కూడా స్కూల్ , కాలేజి పిల్లలు కూడా గంజాయి కి అలవాటు పడ్డారు , గత 5 ఏళ్ల లో, ప్యాలస్ పులకేశి డబ్బు ఆశ వలన.
Chala badhakaram.
What wrong with that doing part-time job. In Western countries kids start doing part-time job from age 14.. The issue is if he or she is not focus on studies.
Nothing wrong for some time. But they are doing after PG Zdue to nin availability of jobs dude
70% స్టడీస్ కోసం కాదు settlement కోసం వెళ్తారు.
ayyo petrol bunk lo , server ga india lo tenth chadivi job chesthe entha “respect estaru”
ade americaaaa, dubai lo dodullu kadigi $, diram testhe aa kick vere appa
They will learn dignity of labor hopefully they will apply that once they are back in India
ఒక ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్లి టాక్సీ కోసం McD దగ్గర వెయిట్ చేస్తుండగా మేము తెలుగులో మాట్లాడటం చూసి.. మాటలు కలిపాడు ఒక తెలుగు అబ్బాయి. ఖమ్మం అని చెప్పాడు. నేను కాస్త క్యూరియస్ గా ఎక్కడ చదువుకుంటున్నావు ఎలా గెటాన్ అవుతున్నావు.. అని మాట్లాడటం ప్రారంభించాను..
బాదేసిన విషయం ఏంటంటే.. DoorDash చేస్తూ 800 సంపాదిస్తాడట వాటిలో.. 200 ఒక లోకల్ సిటిజెన్ కి పే చేయాలట ఎందుకంటే.. F1 వీసా లో ఉంటూ బైట వర్క్ చెయ్యటానికి వీల్లేదు. అందుకని ఒక తెల్లవాడి SSN మీద వర్క్ చేతున్నాడట వాడి SSN వాడుకున్నందుకు వాడికి $200 కట్టాలట per వీక్. అంటే.. మిగిలేది $600. పాత కార్ ఉంది. దానికి Insurance మైంటెనెన్స్ ఇంటి అద్దె ఖర్చు, ఇండియానా వెస్లేలిన్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఆ కాలేజీ ఫీజు $1000/మొంత్. ఎక్కడో.. ఫ్రెండ్ తో కలిసి ఊరిబైట ఎక్కడో ఉంటున్నాడు అన్నాడు. ఇవన్నీ మాట్లాడేలోపు.. కార్ వచ్చేసింది. చాలా సార్లు అడిగాడు.. ఫ్రీ గా ఇంటివరకు వదులుతాను నన్ను నా ఫ్రెండ్ ను అని.. ఇంత కష్ట పడి బ్రతుకుతూ.. తన నుండి ఫ్రీ గా ఖర్చుపెట్టించటం అస్సలు బాగోదు అనిపించి వద్దన్నాను.. కానీ.. నెంబర్ తీసుకోలేదే అనే బాధ వెంటాడుతోంది. ఇది మన తెలుగు పిల్లల ఇబ్బందులు ఇక్కడ.
ఇటువంటి కధలు.. కనీసం నేను చుసిన వాళ్లలో.. 30% ఉన్నారు! అంతా తెలుగు వాళ్లే. అంతా మాక్సిమం తెలంగాణ పిల్లలు. ఆంధ్ర వారు కాస్త తక్కువే. ఇక.. నేను చుసిన వాళ్ళందరూ.. ఏదో ఒక యూనివర్సిటీ కి వీసా తెచ్చుకుని వచ్చి టాక్సీ డ్రైవర్లుగా లిక్కర్ స్టోర్స్ లో, పని చేసుకుంటున్న అండర్ 30 కుర్రాళ్లే! ఇక అమ్మాయిలైతే.. బేబీ సిట్టింగ్, హోటల్ ఫ్రంట్ ఆఫీస్, క్లీనింగ్ etc పనుల్లో ఉంటున్నారు.
వీళ్లను చూసినప్పుడు మనకేం కర్మ ర.. ఇండియా వెళ్ళిపోతే.. అక్కడ నిక్షేపంగా మంచి జాబ్ తో ప్రొఫెషనల్ గా బ్రతకచ్చు గా? అన్ని ఖర్చులు పోను.. దీనికంటే.. గొప్పగా బతకచ్చు ఇండియా లోఅని అనిపిస్తుంది. మరి ఎంత మంది పేరెంట్స్ కి వీళ్ల విషయాలు తెలుసో మరి?!
కెరీర్ ఫిక్స్ చేసుకోవడానికే USA . ఏం లేదిక్కడ.
Well written, Please help them if you find anyone really struggling a lot.
ఇంతా దూరం వచ్చి తెలుగు వాళ్ళు కనపడగానే ప్రాణం లేచి వస్తుంది. నా వళ్లయినంత చెయ్యగలను. కానీ.. మనసున్న వాడి దగ్గర డబ్బుండదు … డబ్బున్న వాడిదగ్గర మనసుండదు!
Thanks for the finer details, make sense.
ఎందుకు లేదు మాష్టారు అక్కడ? కుల జాడ్యం, పిచ్చి అభిమానులు, డాలర్ toh మంద మైన మైండ్. ఇంకా చాలా.
అదేలే. మీరు మాత్రం కుల..గజ్జి తో జగ్గా లాంటోడికి భజన చెయ్యండి..బాగా ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ పిల్లలకి.నీతులు చెప్పటానికి రెడి గా వుంటారు.
వెనక్కి వచ్చిన అఫ్ర్డ్ చెయ్యగలిగిన వాళ్ళు వచ్చేస్తున్నారు. పాపం అతని ఫామిలీ కష్టాలేంటో తెలీదు కదా. SSN అంటే మన ఆధార్ లాంటిది? అలాంటిది వాడుకోవచ్చా ?
అయినా మీరు అక్కడ బాగానే సెటిల్ అయ్యారేమో కదా? ఇంకా కార్ లేక పోవడమేంటి?
అవును వాడి కి ఇండియా లో ఎన్ని కష్టాలున్నాయో!
అవును… SSN అంటే.. మన PAN కార్డు Equivalent. ఇక్కడంతా Doordash Lyft, Uber ఏ జాబ్ చేసినా లీగల్ గా డైరెక్ట్ అకౌంట్ కి డబ్బు పడుతాయి .. వాడు స్టూడెంట్ వీసా మీద ఉంటె.. SSN వేరే వాళ్ళది Use చేస్తారు. ఇదో …ఓపెన్ సీక్రెట్.
IT to ఫైనాన్స్ కెరీర్ స్విచ్. సో…ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నా….Besides ఇయర్ ఎండ్ లో ఇప్పుడు కార్ తీసుకోవటం కంటే.. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే.. VFM ఉంటుందని.. తీసుకోలేదు. నేను.. రెంట్ కి తీసుకుంటాను. అవసరాన్ని పట్టి.
అయినా.. కార్ ఉంటె… కనీసం $100 Insurance/month, Fuel expenses, maintenance, EMI కనీసం 500/month … ఇన్ని ఉంటాయి. దీనికంటే..సింపుల్ గా $95 కడితే.. మంత్లీ పాస్ BUS or ట్రైన్ లో వెళ్ళచ్చు.
ఇండియా వెళ్ళిపోతే.. అక్కడ నిక్షేపంగా మంచి జాబ్ తో ప్రొఫెషనల్ గా బ్రతకచ్చు గా? అన్ని ఖర్చులు పోను.. దీనికంటే.. గొప్పగా బతకచ్చు ఇండియా లోఅని అనిపిస్తుంది. మరి ఎంత మంది పేరెంట్స్ కి వీళ్ల విషయాలు తెలుసో మరి?!
avunu volunteer jobs chesukunta happy ga vundachu . eche musti rat/nalu tho jalagalu happy ga vunte middle class ki aa bratuku batha ka leka options kosam try chesthe elane vuntundi
Call boy works 9989793850
You invest 30 laksh and do US . Then to recover and sustain it will take atleast 6 years. If you are lucky and hang on May be you get good PayPack then it will take another 15 years to earn 2 crore etc. .
At present US education is quite bad as jobs are declining please advise your friends .
ఇండియా లో ఇప్పుడిప్పుడే వస్తున్న ఉద్యోగాలు call boy jobs, video call (vc) jobs. మంచి సంపాదన. వాటిని గురించి కూడా rayandi. GA supports them.
Vc vestanu అంటే video call?
video conferencing
ఎంతో కట్న కానుకలు ఇచ్చి తన కూతురుని అల్లుడు సుఖ పెడతాడని ఆశ తో చేస్తారు పెళ్లిళ్లు. కానీ ఆ కూతురుతో విదేశాల్లో బాత్రూం క్లీనింగ్ వంటి పనులు చేయిస్తారు. అది న్యాయం కాదు, కానీ వాస్తవం.
కానీ ఆ కూతురుతో విదేశాల్లో బాత్రూం క్లీనింగ్ వంటి పనులు చేయిస్తారు. అది న్యాయం కాదు,
oho anduke vidakulu rate ekkuva ayyindi anta
మన దేశం ఏదో మహా గొప్పగా ఉంది అనుకోడానికి లేదు.. రాను రాను మన దేశం ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయం వేస్తుంది.. ఉగ్రవాదం.. మతమార్పిడి.. రిసర్వేషన్.. ఇలాంటివి తలుచుకుంటే అమెరికా లో బాత్రూంలు కడుక్కోడం మేలు అని జనాలు అనుకోవచ్చు.. ఎక్కడైనా చదువు ఉండాలి.. చలాకీ తనం ఉండాలి…
ayyo .. aithe porugu desam prema ga vundi vellandi
vc estanu 9380537747
గౌతమాలా అని బాగా దేశీ నామకరణం చేశారు గ్వాటమాలా దేశానికి.
ఒక్కసారి అయినా అమెరికా వెళ్ళాలి చూడాలి అనేవాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు ఈ మధ్యన
akkada quality of life baguntundi. India lo kotlu unna sare adugu bayataki pedithe bad roads ugly streets traffic. Ekkada chusina janalu. Oka manchi restaurant ki veldham anna que untundi. Very hot climate year lo 8 months ukkapotha. Oa 10 years back manchi food undedi ippudu anni kalthi.
ayyo enni kotlu babu ? papam ekkada vundalo teliyedu anukunta .. okasari 5 star kani 7 star ki vellu rush telustundi
Jobs appudu untai nuvvu fit kada anede samashya akkadi Ki velli casino’s adithene problems
the people who have problem with Indians coming to US for education/jobs are also Indians who are still waiting in line for Green card approval. they are afraid that if many people come it will take more time for getting green card and hence such weird articles presenting fictional problems of telugu people in US. Great Job guys(Indians in US waiting for green card)
That’s an ignorant comment. Folks who are in queue to get their GCs already have their priority dates and the ones who are coming later can’t later that!
హే పద్మ అలియాస్ GA ..అమెరికా మీద పడ్డావు ఏంటి?
వెళ్ళటమే మంచిది..సరకు ఉంటె ఉద్యోగం వస్తుంది లేదు అంటే అనుభవం వస్తుంది.
ముందు ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుంది.. ఇ ముంది ఇక్కడ రాజకీయ ముసుగులో కుట్రలు
At least they get some experience and also they will learn dignity of labor.In india they will never learn dignity of labor
useful
Creating jobs for 1.5 billion ppl is not that easy. Either cut down population to half or encourage migration. In india most of the jobs filled thru kickbacks or nepotism or recommendation.
No matter how many times one cries, fouls, whines about the USA, none of the Telugu students and parents never listen they all think coming to the USA is prestigious among friends and relatives so they take loans and come here believing their luck might be different from others and all supporters say they might get a job and luck would change its like playing cone before a deaf person
Writer Peru హరగోపాల్ అయి ఉండాలే…!! పేరు మారిందేటి చెప్మా..? ఈమె హరగోపాల్ కి అప్రెంటిస్? లేక అయ్యగారు ఎలక్షన్ల డిప్రెషన్ లోంచి ఇంకా రాలేదా???