ఫ్లాప్ సినిమాపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్

వంద కోట్ల రూపాయల వసూళ్లు వస్తే సినిమా హిట్టయినట్టు కాదు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించింది ‘గోట్’ సినిమా. విజయ్ ఫ్యాన్స్ ను మినహా, భాషతో సంబంధం లేకుండా మిగతా ప్రేక్షకులందర్నీ గోట్స్ (గొర్రెల్ని)…

వంద కోట్ల రూపాయల వసూళ్లు వస్తే సినిమా హిట్టయినట్టు కాదు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించింది ‘గోట్’ సినిమా. విజయ్ ఫ్యాన్స్ ను మినహా, భాషతో సంబంధం లేకుండా మిగతా ప్రేక్షకులందర్నీ గోట్స్ (గొర్రెల్ని) చేసింది ఈ మూవీ.

విజయ్ సినిమాలు కొన్ని దారుణంగా ఫెయిలైనవి ఉన్నాయి. కానీ ‘గోట్’పై వస్తున్న విమర్శలు నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. హీరో విజయ్ నేరుగా రాజకీయాల్లోకి దూకుతున్న తరుణంలో ఇలాంటి సినిమా రావడం కరెక్ట్ కాదని, స్వయంగా అతడి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

భాషలతో సంబంధం లేకుండా వస్తున్న విమర్శలపై ‘గోట్’ దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించాడు. సినిమా క్లయిమాక్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను టచ్ చేశాడు దర్శకుడు. అలా చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులు ‘గోట్’ కు కనెక్ట్ అవ్వలేదంటున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ అభిమానులు ఈ చిత్రాన్ని విమర్శిస్తున్నారని, సినిమా ఫెయిల్యూర్ కు అదే కారణం అంటున్నాడు. నిజంగా ఇది పసలేని వాదన.

ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాల్ని సినిమాలో దట్టించానని, పూర్తిగా ఆడియన్స్ కోసం ఈ సినిమాను తీశాను తప్ప, సమీక్షకుల కోసం కాదని వాదిస్తున్నాడు వెంకట్ ప్రభు. అందర్నీ మెప్పించే సినిమా తీయాలంటే చాలా టైమ్ కావాలని, తమకు చాలా తక్కువ సమయం మాత్రమే దొరికిందని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది కూడా సరైన వాదన కాదు.

ఇలా లాజిక్కుల్లేని వాదనలు వినిపిస్తూ, ప్రేక్షకుల దృష్టిలో మరింత చులకనవుతున్నాడు దర్శకుడు. అలా వాదించే బదులు, నిశ్శబ్దంగా ఉన్నా సరిపోయేది. తెలుగు, మలయాళంలో ఈ సినిమా డిజాస్టర్ అయింది.

7 Replies to “ఫ్లాప్ సినిమాపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్”

  1. ఎవడ్రా బాబూ నీకు సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పింది… ఇరగదీస్తుంది 4 రోజుల కి 286 కోట్లు

    1. ఏంటి ఆకులు ఆ ఇరగదీసేది అరవనాడు లోనే ఎవరూ చూడట్లేదు ఆ సినిమాని ఇక వేరే భాషలలో అయితే ఈగలు తోలుకుంటున్నారు సినిమా హాల్స్ లో

  2. //భాషతో సంబంధం లేకుండా మిగతా ప్రేక్షకులందర్నీ గోట్స్ (గొర్రెల్ని) చేసింది ఈ మూవీ.//

    ఇదీ నీ నాలెడ్జ్. కనీసం స్కూల్ కూడా వెళ్లినట్లు లేవు.

Comments are closed.