మైత్రీ ధైర్యమే ధైర్యం

సాధారణంగా సినిమాకు మాంచి బజ్ వస్తే, అమ్మేసి చేతులు దులుపుకుందాం అనుకుంటారు నిర్మాతలు. మరీ నమ్మకం ఎక్కువైతే రేటు పెంచుతారు. కానీ ఈ రెండూ కాకుండా తామే విడుదల చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు…

సాధారణంగా సినిమాకు మాంచి బజ్ వస్తే, అమ్మేసి చేతులు దులుపుకుందాం అనుకుంటారు నిర్మాతలు. మరీ నమ్మకం ఎక్కువైతే రేటు పెంచుతారు. కానీ ఈ రెండూ కాకుండా తామే విడుదల చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు అంటే ధైర్యం బాగా వుందనుకోవాలి. 

ఉప్పెన సినిమా సంగతే ఇది. కరోనాకు ముందు విడుదల కావాల్సిన సినిమా. కానీ కరోనా కారణంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. కొత్త హీరో, హీరోయిన్, డైరక్టర్ సినిమాకు బాగా ఖర్చు చేయాల్సి వచ్చింది. పైగా కరోనా కాలం వడ్డీలు. 

ఇలాంటి నేపథ్యంలో ఎన్ని సినిమాలు ఓటిటికి వెళ్లినా, తాము థియేటర్ కే అంటూ గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. విడుదల దగ్గరకు వచ్చాక, గతంలో తీసుకున్న నిర్ణయం మార్చేసుకున్నారు. 

బయ్యర్లు అందరినీ డిస్ట్రిబ్యూటర్లుగా మార్చేసారు. కొనుగోలుకు ఫిక్స్ చేసిన మొత్తాలని అడ్వాన్స్ లు గా అది రిటర్న్ బుల్ అడ్వాన్స్ లుగా మార్చేసారు. 

రెండు రాష్ట్రాల్లో సినిమాను తన బాధ్యత మీద విడుదల చేసుకుంటోంది.  ఉప్పెన సినిమా మీద మైత్రీకి వున్న బలమైన నమ్మకం క్లియర్ గా కనిపిస్తోంది.  ఆంధ్ర 9 కోట్ల రేషియోలో, నైజాం నాలుగున్నర కోట్లు అడ్వాన్స్ లు మాత్రమే తీసుకున్నారు.

కళ్యాణ్ గారితో నన్ను పోల్చొద్దు

మరో ‘రంగస్థలం’ అవుతుంది