ఓటీటీ గుప్పిట్లో టాలీవుడ్

ఓ పెద్ద యంగ్ హీరో, పెద్ద పాన్ ఇండియా సిన్మా త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పుడు కథ చెబితేనే రేటు చెబుతామని అంటున్నారట ఓటీటీ సంస్థల ప్రతినిధులు.

టీవీ వచ్చిన కొత్తలో సినిమాకు ఎఫెక్ట్ ఏమో అనుకున్నారు. కానీ టీవీ మాత్రం సినిమాకు సపోర్ట్ గా మారింది. అదనపు అదాయం వచ్చింది. సినిమాకు మంచి ప్రచార మాధ్యమంగా మారింది. ఓటీటీ వచ్చిన తరువాత కూడా ఇలాగే మారుతుందనకున్నారంతా. అదనపు ఇన్ కమ్ వస్తుంది. సినిమాలు మరింత భారీగా తీయచ్చు అనుకున్నారు. కానీ హిందీ డబ్బింగ్ ఇన్ కమ్ ను లాగేసుకున్నట్లే, ఓటీటీ ఇన్ కమ్ చూపించి హీరోలు తమ రెమ్యూనిరేషన్లు పెంచుకుంటూ పోయారు. పది కోట్లు తీసుకునే హీరోలు ఇప్పుడు 25 నుంచి 35 కోట్లకు చేరారు. నిర్మాత మాత్రం ఎక్కడ వేసిన గొంగ‌డి అక్కడే అన్నట్లు వుండిపోయాడు.

కానీ రాను రాను ఓటీటీ వికటిస్తోంది. తన విశ్వరూపం చూపిస్తోంది. టాలీవుడ్ ను అన్ని రకాలుగా శాసిస్తోంది. గతంలో ఇచ్చినంత రేటు ఇవ్వడం లేదు. కథ కూడా వినకుండా అగ్రిమెంట్ లు చేసిన రోజులు పోయాయి. ఇప్పుడు దర్శకుడు తమ టీమ్ కు కూడా కథ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. విడుదల డేట్ ను ఓటీటీ సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. అవి చెప్పే వరకు సినిమా పూర్తి చేసి వడ్డీలు కట్టుకుంటూ కూర్చుంటున్నారు నిర్మాతలు. చూస్తుంటే సమీప భవిష్యత్ లో సినిమా చూపిస్తే తప్ప రేటు చెప్పమని అనే పరిస్థితి వచ్చేలా వుందని ఇండస్ట్రీ జ‌నాలు కామెంట్ చేస్తున్నారు.

ఓ పెద్ద యంగ్ హీరో, పెద్ద పాన్ ఇండియా సిన్మా త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పుడు కథ చెబితేనే రేటు చెబుతామని అంటున్నారట ఓటీటీ సంస్థల ప్రతినిధులు. అలాగే ఓ సీనియర్ హీరో పాన్ ఇండియా సినిమాకు 90 కోట్లు అడుగుతుంటే 40 కోట్లకు మించి ఇవ్వలేమని అంటున్నారట. ఓ సంస్థ దగ్గర రెండు మూడు సినిమాలు అల్ మోస్ట్ రెడీగా వున్నాయి. అగ్రిమెంట్లు అయిపోయాయి. కానీ ఓటీటీ సంస్ధలు స్లాట్ ఇవ్వకుండా డేట్ చెప్పలేని పరిస్థితి.

ఓటీటీ సంస్థల స్లాట్ లకు అనుగుణంగా విడుదల తేదీలు వేయాల్సిన పరిస్థితి వుండడంతో తెలుగు సినిమాల విడుదల తేదీలు వాటి చిత్తానికి అవి మారుతున్నాయి. దసరా లాంటి కీలక తేదీకి ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. దసరా డేట్ కు వారం ముందుగానే దేవర సినిమా వస్తోంది.

ఓటీటీ సంస్థలు చిన్న సినిమాలు కొనాలి అంటే బలమైన బ్యాకింగ్ వుండాల్సి వస్తోంది. ఓ పెద్ద సంస్ష ఓ మిడ్ రేంజ్‌ హీరోతో సినిమా చేస్తోంది. కానీ అలా సగంలో నిలిపేసి, మెల్లగా సాగదీస్తోంది. కారణం మరేం లేదు. త్వరలో సీనియర్ హీరోతో ఓ భారీ సినిమా స్టార్ట్ చేస్తోంది. అది స్టార్ట్ చేసాక, ఈ మీడియం సినిమా లింక్ పెట్టి అమ్మేయాలన్నది ప్లాన్. చిన్న, మిడ్ రేంజ్‌ సినిమాలు సరైన బ్యాకింగ్ లేకుండా ఓటీటీ రైట్స్ అమ్మలేకపోతున్నారు. ఓటీటీ సంస్థల్లో సరైన స్నేహ సంబంధాలు వున్నవారికి పని అవుతోంది. లేని వారికి కావడం లేదు.

ఇలా మొత్తం మీద మెల మెల్లగా ఓటీటీ సంస్థల గుప్పిట్లోకి టాలీవుడ్ వెళ్లిపోతోంది. గిల్డ్, ఛాంబర్ ఇవన్నీ ఏదో ఒకటి చేయాలి అని అంతా అంటున్నారు కానీ ఎవరూ కలిసి వస్తున్నట్లు అయితే కనిపించడం లేదు. ఎనిమిది వారాల వరకు ఓటీటీకి ఇవ్వకూడదు అనే నిబంధనను తీసుకురాలేకపోతున్నారు. సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా నాలుగు వారాల్లోపు ఓటీటీ లోకి వచ్చేస్తుంటే ఇంక పరిస్థితి ఏమిటి?

మొత్తం మీద ఓటీటీ వరకు చూసుకుంటే టాలీవుడ్ పరిస్థితి ఏమంత అశాజ‌నకంగా అయితే లేదు.

13 Replies to “ఓటీటీ గుప్పిట్లో టాలీవుడ్”

  1. దయచేసి తెలుగు సినిమా నిర్మాతలు ఓ రెండేళ్లు సినిమా నిర్మాణాన్ని ఆపేయండి. ఈరోజు సినిమా వల్ల బాగుపడేది కేవలం హీరో , దర్శకుడు , మ్యూజిషియన్, హీరోయిన్ ఇంకా టెక్నీషియన్స్ మాత్రమే. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వడ్డీలు కట్టి తీస్తే హిట్ అయితే కొంత లాభం ఫ్లాప్ అయితే నిర్మాత రోడ్డు మీదకు వస్తున్నారు. హీరోలకు బాగా బలిసింది కొడుకులకి సినిమా వల్ల ఎక్కువ బాగుపడేది వీళ్ళే. నిర్మాణంలో 75 %, వీళ్ళే తింటున్నారు. అందుకే రెండేళ్లు నిర్మాణం ఆపాలి.

  2. అన్న ఈ సారి అదికారం లొకి రాని OTT వాల్లను కూడా ఇంటికి పిలిపించి,…. టి కూడా ఇవ్వకుండా దండం పెట్టించుకుంటాడు

  3. జనాలకి ఇంకా అర్ధం కానిది…వీళ్ళ తయారు చేసే వస్తువు దానికి వాడే ముఉదాటువులు అన్ని నాసిరాకమే..జస్ట్ చాటింపేసుకుని కిద్దికాలమైన అతకాలేమా అనే ఆలోచనతోనే వీళ్ళ సరుకు బజారుకి అంటే సినిమా హాళ్ళకి పంపేది,తరువాత ఇంకా అమ్ముడు కాదుననుకుంటే ఇంటింటికి వెళ్లి అమ్ముకోడం కి కూడా సిగ్గుపడరు..

  4. ఎస్, OTT బాగా అభివృద్ధి చెందితే ఈ బడా హీరోలా దందాలు అంతరించి మంచి సినిమాలు బతుకుతాయి.

  5. Movie making oka vyasanam, betting lantidi anthe kaka black money white money chesedi. Antha anukunnatlu nirmatha ki funding chese vallu venakala chala mandi untaru. 90% cinema lu flop avutunna okka nirmatha ayina tindiki leka unnada? Teraga vcahhina sommuthone cinemalu teestunnaru.

  6. ఒక్క హీరో పేరు కూడా రాయవు ఒక్క నిర్మాత పేరు కూడా రాయవు ఒక్క దర్శకుని పేరు కూడా రాయవు ఇంకెందుకు ఈ ఆర్టికల్ మడిచి పెట్టుకోవడానికి

Comments are closed.