మళ్లీ సెకెండ్ హీరోయిన్ పాత్రలో..?

పెళ్లి చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చింది కాజల్. అయితే రీఎంట్రీలో ఆమె కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగడంలేదు. Advertisement ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్ వేసి సత్యభామ అనే సినిమా…

పెళ్లి చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చింది కాజల్. అయితే రీఎంట్రీలో ఆమె కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగడంలేదు.

ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్ వేసి సత్యభామ అనే సినిమా చేసింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఇక భగవంత్ కేసరి సినిమా హిట్టయినప్పటికీ అందులో కాజల్ పాత్ర ఎంత, కాజల్ కు ఆ సక్సెస్ లో క్రెడిట్ ఎంతనేది అందరికీ తెలిసిందే.

భగవంత్ కేసరిలో దాదాపు సెకెండ్ హీరోయిన్ గా కనిపించిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడో పెద్ద సినిమాలో మళ్లీ అలాంటి పాత్రకే కమిటైనట్టు కనిపిస్తోంది. అదే సల్మాన్ ఖాన్ సినిమా.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా ఇదివరకే రష్మికను తీసుకున్నారు. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ గా కాజల్ కు అవకాశమిచ్చారు.

ఇదే దర్శకుడి సినిమాలో గతంలో మెయిన్ హీరోయిన్ గా నటించిన కాజల్, ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో సెకెండ్ హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగు నుంచి ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

9 Replies to “మళ్లీ సెకెండ్ హీరోయిన్ పాత్రలో..?”

Comments are closed.