దేవర – యావరేజ్‌ టాక్ వచ్చినా చాలు

మనిషికి బతికేంత ధైర్యం వుంటే చాలు.. చంపేంత కాదు. అంత ధైర్యం పెంచుకుంటే అలాంటి ధైర్యాన్ని చంపేసే భయాన్ని పరిచయం చేస్తా… ఇదీ కాన్సెప్ట్.

అరవింద సమేత తరువాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ డ్యూయట్లు, డ్యాన్స్ లు చూడలేదు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ నటన స్టామినాను చాటి చెప్పింది. అందులో సందేహం లేదు. కానీ మాస్ ప్రేక్షకుల ఆకలి మిగిలే వుంది. ఇప్పుడు అటు ఎమోషనల్ యాక్షన్ ఎలాగూ దేవర లో కీలకంగా వుంటుంది. దాంతో పాటు లవర్ బాయ్ గా కూడా కొంత వరకు కనిపిస్తాడని ఇప్పటి వరకు వచ్చిన పాటల కంటెంట్ చెబుతోంది. జాన్వికపూర్ తో రొమాంటిక్ డ్యూయట్ వైరల్ అయింది.

ఇప్పుడు దేవర ట్రయిలర్ వచ్చింది. జ‌నాల్ని బాధపట్టే టీమ్.. వాళ్లని కట్టడి చేసే నాయకుడు.. మనిషికి బతికేంత ధైర్యం వుంటే చాలు.. చంపేంత కాదు. అంత ధైర్యం పెంచుకుంటే అలాంటి ధైర్యాన్ని చంపేసే భయాన్ని పరిచయం చేస్తా… ఇదీ కాన్సెప్ట్. దీనికి చిన్న అదనపు ట్రాక్ ఏమిటంటే అలాంటి నాయకుడికి భయస్ధుడైన కొడుకు. అతగాడికి ఓ లవ్ ట్రాక్. ట్రయిలర్ చూసిన తరవాత అర్ధం అయ్యేది ఇదే.

అయితే కథలో బోలెడు ట్విస్ట్ లు, టర్న్ లు వుండేలా వున్నాయి. ఎందుకంటే హీరో పిరికివాడు ఎందుకు అవుతాడు. పిరికివాడు నానమ్మతో బలంగా ఎలా మాట్లాడతాడు. అందరూ అనుకున్నట్లు పిరికివాడిగానే వుండిపోతే కథేం వుంది. అందుకే ట్రయిలర్ లో చెప్పని సంగతులు, టర్న్ లు, ట్విస్ట్ లు చాలానే వుండి వుండాలి.

ట్రయిలర్ మరీ అద్భుతంగా ఏమీ లేదు. ఓకె ట్రయిలర్. మరీ సదా సముద్రం చుట్టూ సీన్లు, సదా ధైర్యం, భయం చుట్టూ డైలాగులు తిరగడం వల్ల కావచ్చు. సినిమాలో వేరుగా వుంటుంది కనుక అబౌవ్ యావరేఙ్ టాక్ వచ్చినా చాలు.

32 Replies to “దేవర – యావరేజ్‌ టాక్ వచ్చినా చాలు”

      1. అవును ఓన్లీ రాంచరణ్ తేజ్ చిరంజీవి మూవీస్ మాత్రమే రికార్డు సృష్టిస్తాయి 😂😂😂😂

    1. శక్తి వోచి 15 years అవుతుంది

      ఆంధ్రవలా వోచి 22 ఇయస్ అవుతుంది

      జై లవకుశ ఒచ్చి 8 years అవుతుంది

      ఇంకా నువ్వు నిద్దర లేవు

  1. సినిమా లో వేరుగా ఉంటుంది కనుక నా… సినిమా అంతా అదే ఉంటే…మరో పాదఘట్టమే గా.. బాబోయ్

  2. కావాలనే ఒక systematic గా negitivity spread చేస్తున్నారు తారక్ screen presence మీద….సొంత వాళ్ళు కూడా….కానీ సొంత కష్టాన్ని నమ్ముకున్న వాడికి ఒక చిన్న నిప్పురవ్వ చాలు … తగలెట్టేయ్యడానికి….👍👍

  3. same old story,father leader son bayapadevadu,interverl lo father gurinchi flashback,next part lo son velli vala janalani kapadatam..first half son love track, villan himsa

  4. ప్యాలస్ పులకేశి కి ( బినామీ బూతు*ల గడ్డం నాని ద్వారా) పావలా వాటా వుంది అంటున్నారు, పెట్టుబడి లో.

    అందుకే రివ్యూ కూడా 2.5 కంటే ఎక్కువ ఇప్పటికే రెడీ గా డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నారు, గ్రేట్ ఆంధ్ర అంటున్నారు. నిజమేనా.

    విజయం అవ్వాలని కోరుకుందాం.

  5. పవన్ కి అంత రెమ్యునరేషన్ యెందుకు అని నీలిగిన జగన్, ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అంత రెమ్యునరేషన్ యెందుకు అని ముక్కుతారా మూలుగుతార లేదా చూడాలి?

  6. ట్రైలర్ చూశాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియలేదు ఎన్టీఆర్ డబుల్ రోల్ అని

  7. ఈ రోజుల్లో ఏవరేజ్ వర్కవుట్ అవ్వదు GA గారూ. థియేటర్ లో ఖచ్చితంగా చూడాలి అనిపించే కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్ లో చూస్తారు. లేదంటే ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత సూపర్ కాంబో అయినా ఎవడూ దేఖట్లేదు. Ott లో దేఖుతారు

  8. ఏ సీన్ తీసుకున్న…అనవసరపు ఎలేవేషన్లు అనవసరపు… అతి (కళ్ళు పెద్ద వి చేసేసి.. వాడు అది వీడు ఇది అని హీరో గురించి గప్పాలు కొట్టటం ఏంటో!) ఏక్టింగ్ చెయ్యండి ర.. అంటే.. ఓవర్ ఆక్షన్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో వీడి సినిమాలు వీడు. వీడి పక్కవాళ్ళు వీడిగురించి ఆకాశానికి తగ్గకుండా ఎలేవేషన్ లు.. అయిదున్నర అడుగుల వాడు పడవ మీద కు దూకితే.. అప్పటికే.. 5 మంది ఉన్న పడవ తెగ ఉఊగిపోవటం… కాస్త రియాలిటీ లో చూపించండి ర.. సినిమాలను! మలయాళం హీరోలను చూసి నేర్చుకోండి.. స్టోరీ నే హీరో ఎలేవేషన్ లు కాదు కావాల్సింది జనాలకు.

  9. గ్రేట్ ఆంద్ర గాడు ఎన్టీఆర్ ని లేపుతున్నాడు అంటే ఏడో ఉంది 🤣 NTR TDP కి దూరం గా ఉన్నాడు కాబట్టి ఈ Ycp చెంచ గాడు కి నచ్చాడు . నాని సినిమా హిట్ ఐనా ఫ్లాప్ అని రాస్తున్నాడు వీడు . కరణం పవన్

  10. ఇ గ్రేట్ ఆంద్ర గాడు న్యూస్ పాజిటివ్ గా ఉండాలి అంటే వాళ్ళు వీడికి ycp కి నచ్చాలి . అపుడే పైకి లేపుతాడు 🤣

  11. మహేంద్ర బాహుబలి కి వాళ్ళ నాన్న అమరేంద్ర బాహుబలి గురించి ప్రకాష్ రాజ్ అచ్చం కెజిఫ్ లాగా నరేట్ చేస్తున్నాడు

    ప్రభాస్ బదులు తారక్

    తమన్నా ప్లేస్ లో జాన్వీ

    పులి ప్లేస్ లో తిమింగళం

    పాద ఘట్టమ్ ప్లేస్ లో బీచ్

    అదే పిచ్చి చూపులు చూసే జూనియర్ ఆర్టిస్ట్ లు

    భగవంతుడా

  12. మంచి హిట్ అవాలని కోరుకుంటూన్నాము. కానీ కొత్తగా ఎం అనిపించలేదు. ఆచార్య సెట్టింగ్ లే కనపడుతున్నాయి దీని కోసం 3 ఇయర్స్ వెయిటింగ్ అంటే డిస్సపాయింట్. అయినా ఎక్కడో సినిమాలో హైప్ ఉంటుంది అనుకుంటున్నాం అల్ ది బెస్ట్

Comments are closed.