బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తండ్లాట పెట్టి, పోలీసులు తమాషా చూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్‌గా శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ప్రభుత్వం ఇచ్చింది. సాంకేతికంగా చూస్తే ఇదేమీ తప్పు కాదు.
అయితే అరికెపూడి గాంధీ నియామకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌లో చేరాలని గాంధీ నిర్ణయించకున్నారని, అలాంటి నాయకుడికి తామెందుకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రతిపాదిస్తామని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇందులో భాగంగా కౌశిక్‌రెడ్డి స్పందిస్తూ, గాంధీ ఇంటికెళ్లి గులాబీ కండువా కప్పుతానని, ఆయన ఇంటిపై జెండా ఎగురేస్తానని అన్నారు. తన ఇంటికి కౌశిక్ వస్తాననడాన్ని గాంధీ తీవ్రంగా తప్పు పట్టారు.
తానే కౌశిక్‌రెడ్డి ఇంటికెళ్తానని గాంధీ ప్రకటించారు. గాంధీ అన్నట్టుగానే హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి ఇంటికి మందీమార్బలంలో వెళ్లారు. కౌశిక్‌రెడ్డి ఇంటికెళ్లే వరకూ పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత, వెలుపల అడ్డుకున్నట్టు పోలీసులు డ్రామాను రక్తి కట్టించినట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. కౌశిక్ ఇంటి వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
ఆ తర్వాత ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. కౌశిక్‌రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తనను హత్య చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. ఏ ఒక్కర్నీ విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.
కౌశిక్ రెడ్డి ఇంతక ముందు జగన్అ రెడ్డి పార్టీ లో మానుకోట లో రాళ్లతో కొట్టించుకున్నాడు , జగన్ రెడ్డి అనుచరులు ఆంధ్ర లో ఉన్న తెలంగాణ లో ఉన్న నీచులే
మళ్ళీ సెంటిమెంట్ రాజేస్తున్నారు. అది లేకపోతే కానీ brs బతికి బట్టకట్టదనేమో. హైదరాబాద్ లో నాన్ తెలంగాణ వాళ్ళ వల్లే వీళ్లకి అన్నీ సీట్లు వచ్చాయి. అవి కూడా రావు ఈసారి.
Call boy jobs available 9989793850
రేయ్ కౌశిక్, మాటలు జాగ్రత్తగా వాడు..ఫామ్ హౌస్ లో పడుకున్నాడు ఒకడు పేర్మనెంట్ గా.
రేయ్ కౌశిక్, విషయం మీద కొట్లాడు కోండి.. ఆంధ్రోడు ఏంట్రా?అట్లా వాగే ఒకడు పేర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో పన్నాడు.
vc available 9380537747