అంతా జ‌గ‌న్ వ‌ల్లే అంటున్న ష‌ర్మిల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌ర్వ విప‌త్తుల‌కు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే కార‌ణ‌మ‌ని టీడీపీ కంటే ఎక్కువ‌గా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్త‌డానికి బుడ‌మేర గండ్ల‌ను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌ర్వ విప‌త్తుల‌కు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే కార‌ణ‌మ‌ని టీడీపీ కంటే ఎక్కువ‌గా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్త‌డానికి బుడ‌మేర గండ్ల‌ను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని ష‌ర్మిల విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఇంకా త‌న అన్న జ‌గ‌న్ అధికారంలో ఉన్నట్టుగానే ష‌ర్మిల భ్ర‌మిస్తున్న‌ట్టున్నారు.

ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ మ‌రోసారి జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విజ‌య‌వాడ త‌ర్వాత ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో తుపాను ప్ర‌భావంతో వ‌ర్షం దంచికొట్టింది. దీంతో ఏలేరుకు వ‌ర‌ద వెల్లువెత్తింది. ఏలేరు వ‌ర‌ద‌తో వంద‌ల ఎక‌రాల్లో పంట న‌ష్ట‌పోయింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల ఆ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏలేరు వ‌ర‌ద‌కు కూడా జ‌గ‌నే కార‌ణ‌మ‌ని వాళ్లిద్ద‌రు ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో తానేం త‌క్కువ అన్న‌ట్టుగా ష‌ర్మిల మీడియా ముందుకొచ్చారు. ఏలేరు ఆధునీక‌ర‌ణ జ‌ర‌గ‌క‌పోవ‌డం, పూడిత తియ్య‌క‌పోవ‌డం వ‌ల్లే విప‌త్తు జ‌రిగింద‌న్నారు. త‌న తండ్రి వైఎస్సార్ హ‌యాంలో ఏలేరు ఆధునీక‌ర‌ణ‌కు నిధులు కేటాయించి, శంకుస్థాప‌న చేశార‌ని ఆమె గుర్తు చేశారు. ఆ త‌ర్వాత వచ్చిన ప్ర‌భుత్వాలు మాత్రం ఆ విష‌యాన్ని మ‌రిచాయ‌న్నారు.

జ‌గ‌న్ ఏలేరు ఆధునీక‌ర‌ణ ప‌నులు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ష‌ర్మిల ఆరోపించారు. ప్ర‌తి ఎక‌రాకు రూ.25 వేలు చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

26 Replies to “అంతా జ‌గ‌న్ వ‌ల్లే అంటున్న ష‌ర్మిల‌”

  1. Too Late, Too Little Sister, ఆ నాడు జగన్ అన్న వొదిలిన బాణం అని నీవు చెప్పకుంటే, ఈ నాడు ఆంధ్ర అభివృద్ధి బాణం కన్నా వేగంగా దూసుకుపోయేది.

  2. ఆ కమల తటాకం ఈవిడ పేరు రాసే దాక ఇంతే. ఆ తరువాత అంతా సర్దుకుంటాయి.

  3. She could not even say that the present condition is due to the bad decisions and negligence of all past governments after YSR. That would have fetched some credibility to her and her party but she choose to read CBN script which is expected. She will be soon replaced by Congress leadership.

      1. In politics, it is majority public whose opinion must be considered for retrospective and I hope zjagan will do that. Individual opinions do not matter especially when they have a personal bias for reasons best known to brother and sister.

  4. కరుడుకట్టిన ఫ్యాక్షనిస్ట్ ని, మహా మేత ని దేవుడు, మహా మనిషి అని పొగుడుతావు.

    ఆర్థిక ఉగ్రవాది, నేరస్తుడు అయిన ఆయన పుత్ర రాత్రాన్ని తోపు, సంచలనం అని పొగుడుతావు..

    షర్మిల ని తిట్టే తప్పుడు మాత్రం ఈమె కూడా ఆ తాను లోని ముక్కే అని మర్చిపోతావు..

    నీకు డబల్ స్టాండర్డ్ ఉన్నప్పుడు, రాజకీయ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న ఆమె అన్న చేసిన నీచమైన పాలనని ఎత్తి చూపితే తిడతావు.. ఇలాంటి ఆర్టికల్స్ వేసి ఆ మేత ఫాన్స్ తో తిట్టిస్తావు..ఎంకటి

  5. doubt ఏముంది అందులో, దరిద్రుడు ఏ ముహూర్తం లో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాడో అంత రివర్సే, ఆంధ్రాకి పట్టిన నిష్టదరిద్రం ఈ పరమ నీచుడు !!

Comments are closed.