చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైసీపీ అధ్య‌క్షులు వీరే!

ఉమ్మ‌డి చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైసీపీ అధ్య‌క్షులుగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిల‌ను ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎంపిక చేశారు. పార్టీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో సీనియ‌ర్ నాయ‌కుల్ని…

ఉమ్మ‌డి చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైసీపీ అధ్య‌క్షులుగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిల‌ను ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎంపిక చేశారు. పార్టీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో సీనియ‌ర్ నాయ‌కుల్ని అధ్య‌క్షులుగా నియ‌మించాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇవాళ తాడేప‌ల్లిలో ఉమ్మ‌డి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. అంద‌రి అభిప్రాయాలు తీసుకున్న త‌ర్వాత పెద్దిరెడ్డి, గోవ‌ర్ధ‌న్‌రెడ్డిల‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం విశేషం.

గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడే జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాన‌ని, ఇప్పుడు వ‌య‌సు పైబ‌డిన రీత్యా ఆ బాధ్య‌త‌లు వ‌ద్ద‌ని పెద్దిరెడ్డి స‌మావేశంలో అన్న‌ట్టు తెలిసింది. అయితే వైసీపీ ఇన్‌చార్జ్‌లు, జ‌గ‌న్ ఒత్తిడి మేర‌కు ఆయ‌న ఒప్పుకోక త‌ప్ప‌లేద‌ని తెలిసింది.

రానున్న రోజుల్లో ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై పోరాటాల్ని చేయాల‌ని వైసీపీ సంక‌ల్పిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణుల్ని స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపించే నాయ‌కుల‌కు జిల్లా బాధ్య‌త‌ల్ని అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ యోచించారు. ఈ క్ర‌మంలోనే రెండు జిల్లాల అధ్య‌క్షుల నియామ‌కాలు జ‌రిగిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

13 Replies to “చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైసీపీ అధ్య‌క్షులు వీరే!”

  1. ఫొటోలో ఒక్కళ్ళ మొహంలో కూడా కించిత్ ఆసక్తి ఉన్నట్లు కనపడటం లేదు. ఏదో మొక్కుబడికి మీటింగ్ కి వచ్చినట్లు ఉంది.

  2.  ఎలక్షన్స్ లో ఓడినా ఇలాంటి పదవులప్పుడు టీడీపీ మొహాల్లో ధైర్యం, ఉషారు ఉంటాయి, ఆ పార్టీ కార్యకర్తల బలం అలాంటిది..

    వైసీపీ లో మాత్రం మోకాల్లో భయం కొట్టొస్తోంది. అధికారం లో ఉన్నప్పటి బలుపు లో అర పర్సెంటా కూడా పనిపించటం లేదు..

    సింహం సింగల్ అన్నారు, వెంట్రుక పీకలేరన్నారు, అమ్మ అయ్యా అలి అని తేడా లేకుండా తిట్టారు.. మీ గొప్పలు చూసి జీయే ఎంకటి కి, ఆ పశువుల డాక్టర్ కి వొంటి మీద గుడ్డ ఆగలేదుగా..

  3.  ఎలక్షన్స్ లో ఓడినా ఇలాంటి పదవులప్పుడు టీడీపీ మొహాల్లో ధైర్యం, ఉషారు ఉంటాయి, ఆ పార్టీ కార్యకర్తల బలం అలాంటిది..

    వైసీపీ-లో మాత్రం మోకాల్లో భయం కొట్టొస్తోంది. అధికారం లో ఉన్నప్పటి బలుపు లో అర పర్సెంటా కూడా పనిపించటం లేదు..

    సింహం సింగల్ అన్నారు, వెంట్రుక పీకలేరన్నారు, అమ్మ అయ్యా అలి అని తేడా లేకుండా తిట్టారు.. మీ గొప్పలు చూసి జీయే-ఎంకటి కి, ఆ పశువుల-డాక్టర్ కి వొంటి మీద గుడ్డ ఆగలేదుగా..

  4.  ఎలక్షన్స్ -లో -ఓడినా -ఇలాంటి-పదవులప్పుడు -టీడీపీ-మొహాల్లో-ధైర్యం,-ఉషారు -ఉంటాయి,-ఆ-పార్టీ -కార్యకర్తల-బలం-అలాంటిది..

    వైసీపీ-లో మాత్రం-మోకాల్లో-భయం-కొట్టొస్తోంది. అధికారం-లో-ఉన్నప్పటి-బలుపు-లో అర-పర్సెంటా-కూడా-పనిపించటం-లేదు..

    సింహం-సింగల్-అన్నారు, వెంట్రుక-పీకలేరన్నారు, అమ్మ-అయ్యా-అలి-అని-తేడా లేకుండా-తిట్టారు.. మీ-గొప్పలు-చూసి-జీయే-ఎంకటి కి, ఆ-పశువుల-డాక్టర్-కి-వొంటి-మీద-గుడ్డ-ఆగలేదుగా..

Comments are closed.