జ‌గ‌న్‌తో సెల్ఫీ … కానిస్టేబుల్‌పై వేటుకు రెడీ!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషాబానుపై వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామ‌ర్శించేదుకు రెండురోజుల క్రితం వెళ్లారు. ప‌రామ‌ర్శ అనంత‌రం…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషాబానుపై వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామ‌ర్శించేదుకు రెండురోజుల క్రితం వెళ్లారు. ప‌రామ‌ర్శ అనంత‌రం మీడియాతో మాట్లాడేందుకు గుంటూరు జైలు బ‌య‌టికి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌తో కూతురితో క‌లిసి సెల్ఫీ తీసుకునేందుకు జైలు కానిస్టేబుల్ అయేషాబాను ఆస‌క్తి చూపారు. అయేషా అనంత‌పురానికి చెందిన వ్య‌క్తి. జ‌గ‌న్‌తో సెల్ఫీ తీసుకుని, ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం చేశారు. ఇదంతా టీవీ చాన‌ళ్ల లైవ్‌లోనే జ‌రిగింది. ప్ర‌భుత్వ ఉద్యోగి అయి వుండి. త‌మ‌కు ఏ మాత్రం గిట్ట‌ని జ‌గ‌న్‌తో సెల్ఫీ తీసుకోవ‌డంపై కూట‌మి ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వుంది.

దీంతో అయేషాకు గుంటూరు జైల‌ర్ ర‌విబాబు చార్జి మెమో ఇచ్చారు. ఎందుకు అలా వ్య‌వ‌హ‌రించాల్సి వచ్చిందో స‌మాధానం చెప్పాల‌ని షోకాజు నోటీసులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ వివ‌ర‌ణ త‌ర్వాత విచార‌ణకు క‌మిటీ వేస్తామ‌ని జైల‌ర్ పేర్కొన్నారు. ప‌రిణామాల్ని గ‌మ‌నిస్తే కానిస్టేబుల్‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డం ఖాయ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

28 Replies to “జ‌గ‌న్‌తో సెల్ఫీ … కానిస్టేబుల్‌పై వేటుకు రెడీ!”

  1. అయ్యొ! ప్రభుత్వ పదవిలొ ఉండి, తన స్నెహితులకి, వ్యక్తిగత whatsApp లొ ఎదొ share చెస్తెనె సుస్పెండ్ చెసారు కదా మీరు!

    .

    అయినా మరీ Dr. సుధాకర్ లా ఈ ప్రభుత్వం చెయదు లెవయ్యా!

  2. చిన్న విషయమే గాని, చట్టం కాపాడవలసిన వాళ్ళు ఒక నేరస్తుడు తో ఆన్ డ్యూటీ లో సెల్ఫీ చట్ట విరుద్ధం. తెలియక చేసిందిలే, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేయండి పాపం.

  3. This is utter nonsense. What will happen if she took a photo with ex-cm. These guys are acting petty. They are acting on small issues and ignoring issues such as flood control etc.

  4. పిల్ల కన్నా తల్లి వయసు తక్కువగా ఉన్నట్టు వుంది. ఇంకా క్రి/మి/న/ల్స్ అందరు జై/ లుకు క్యూ కడతారేమో.

    మెమో అంటే ఎదో కంటి తుడుపు చర్య, ఛార్జ్ షీట్ కాదు. ఎం కాదు.

Comments are closed.