ఆసియన్ సినిమాస్ సంస్థ నిర్మించిన లేటెస్ట్ మల్టీ ఫ్లెక్స్ ఎఎఎ. అంతకు ముందు నిర్మించినది ఎఎంబి. ఈ ఎఎంబి వచ్చే వరకు హైదరాబాద్‌లో సినిమా థియేటర్ అంటే ప్రసాద్ ఐమాక్స్ నే. కానీ ఎఎంబి అన్నది ఓ ఐకానిక్ స్పాట్ అయిపోయింది. హైదరాబాద్‌ల్లోని టూరిజం స్పాట్‌ల్లో ఎంఎంబి కూడా ఒకటిగా మారిపోయింది. లగ్జరీ థియేటర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
అలాంటి సంస్థ మళ్లీ ఎఎఎ సినిమాస్ నిర్మిస్తోంది, పైగా అల్లు అర్జున్ భాగస్వామి అంటే చాలా బజ్, క్రేజ్ వచ్చింది. అదీ కాక సిటీకి చాలా వరకు సెంటర్ ప్లేస్. కుర్రకారు అమితంగా వుండే అమీర్ పేట సెంటర్. ఇలా అన్నీ కలిసి ఎఎఎ థియేటర్లు ఎఎంబి ని తొసిరాజంటాయేమో అని అంతా అనుకున్నారు. కానీ పలు విషయాల్లో చూసుకుంటే ఎఎంబి ముందు ఎఎఎ అస్సలు ఆనడం లేదు. సరిపోలడమే లేదు.
ఎఎఎ ఎక్కడ ప్లస్ అయింది అంటే జియోగ్రాఫికల్ గా అన్ని విధాలా అనుకూలమైన ప్లేస్ లో వుంది. పైగా పక్కా విపరీతంగా పబ్లిక్ వుండే కాలనీలకు ప్లేస్ లకు దగ్గరగావుంది. వెంగళరావు నగర్, ఎస్ ఆర్ నగర్, మోతీ నగర్ ప్రాంతాల నుంచి అటు యూసఫ్ గుడా, కృష్ణానగర్ వరకు సరైన మల్టీఫ్లెక్స్ గా అందుబాటులోకి వచ్చింది. పైగా ఎఎఎ చుట్టూ స్టూడెంట్ హాస్టళ్లే. విపరీతమైన పబ్లిక్ వుంటారు. అందువల్ల ఏ సినిమా అయినా కాస్త బాగుంది అనుకుంటే చాలు ఇక్కడ రన్ ఎక్కువ వుండడానికి అవకాశం వుంది. ఎఎంబి తో పోల్చుకుంటే ఇది చాలా అడ్వాంటేజ్.
ఈ ఒక్కటి తప్పిస్తే ఎఎఎ మరే విధమైన అడ్వాంటేజ్ లేదు. అసలైన సమస్య విపరీతమైన ట్రాఫిక్ ఏరియాలో వుంది. సినిమా వదిలిన తరవాత బయటకు వచ్చేదారి ఒకే ఒక్కటి. అది కూడా డైరక్ట్ మూడు రోడ్ల కూడలిలోకి రావాలి. ఇది చాలా ఇబ్బందికరం. థియేటర్ ముందు వున్న ట్రాఫిక్ అవరోధాలు, అడ్డంకులు ఇన్నీ అన్నీ కావు. పైగా ఇక్కడ అటు ఇటు రాంగ్ రూట్ లో వచ్చేస్తూనే వుంటారు.
ఇక థియేటర్ విషయానికి వస్తే ఎఎంబి కి డెడికేటెడ్ లిఫ్ట్ లు వున్నాయి. ఎఎఎ కి అలా లేవు. కేవలం మాల్ లిఫ్ట్ లు మాత్రమే. దాంతో పావుగంటకు పైగా వేచి వుండాల్సిన పరిస్థితి.
ఎఎంబి కి విశాలమైన స్థలం వుంది. అందువల్ల ఎం లాంజ్ అయినా, బయట వేచి వుండే ఏరియా అయినా చాలా విశాలంగా, సౌకర్యవంతంగా వుంటాయి. కానీ ఎఎఎ కు స్థలం చాలా తక్కువ. అందులోనే ఎఎ లాంజ్ ఇరికించారు. అందులోనే పాసేజ్, అక్కడే కాఫెటీరియా వుండడం వల్ల అన్ని స్క్రీన్ లు కనుక ఒకేసారి వదిలితే చాలా ఇబ్బందిగా వుంటుంది.
ఎఎంబి ఇంటీరియర్స్ చాలా బాగుంటాయి.. కళ్లకు ఇంపుగా. ఎఎఎ ను పూర్తిగా డార్క్ థీమ్ తో ఇంటీరియర్ చేసారు. బన్నీ టేస్ట్ ఇది. బన్నీ కేరవాన్ కూడా డార్క్ థీమ్ నే కదా. ఎఎఎ ను ఇలా డార్క్ థీమ్ చేయడం వల్ల విపరీతంగా, వేలాదిగా ఎల్ఇడి లు వాడేసారు. దాంతో కళ్లకు విపరీతమైన మిరుమిట్లు గొలిపి, కాస్త ఇబ్బంది పెడతాయి.
ఇక స్క్రీన్ ల విషయానికి వస్తే స్క్రీన్ వన్ కు ఫస్ట్ మార్క్ లు పడతాయి. స్క్రీన్ 4 కు లాస్ట్ మార్క్ లు పడతాయి. కొన్ని స్క్రీన్ లలో సీట్ల మధ్య లెగ్ స్పేస్ కాస్త తక్కువే అనిపిస్తుంది.
మొత్తం మీద అన్ని విధాలా చూసుకుంటే ఎఎంబి కి వున్న అట్రాక్షన్, టూరిజం ఇమేజ్ మాత్రం ఎఎఎ కు రావడం కష్టమే.