వైసీపీ ఎమ్మెల్యేతో కూటమి బేరసారాలు

వైసీపీకి దక్కిందే పదకొండు మంది ఎమ్మెల్యేలు. వారిని కూడా జగన్ కి దక్కనీయకూడదు అని కుటిల రాజకీయం నడచిందా అంటే అవును అంటున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్య రాస…

వైసీపీకి దక్కిందే పదకొండు మంది ఎమ్మెల్యేలు. వారిని కూడా జగన్ కి దక్కనీయకూడదు అని కుటిల రాజకీయం నడచిందా అంటే అవును అంటున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వరరాజు.

పాడేరు వైసీపీ నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన తనను కూటమి వైపు తీసుకుని వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నాలు చేశారు అని అతి పెద్ద వార్తనే రివీల్ చేశారు. ఈ విషయంలో రాయబేరాలు చాలా చేశారు అని అన్నారు. కూటమికి అనుకూలంగా ఉండాలని కోరారని అన్నారు.

అయితే తాను వైసీపీలోనే పుట్టానని తన రాజకీయ జీవితం ఆ పార్టీతోనే అని తేల్చి చెప్పాను అని ఆయన అన్నారు. తన కట్టె కాల్చేంతవరకూ వైసీపీలోనే ఉంటాను అని అన్నారు. వైసీపీని పాడేరులో కంచుకోటగా మారుస్తాను అని అన్నారు.

వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ పాడేరులో విజయ ఢంకా మోగించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని సీట్లను వైసీపీ గెలుపొందాలని ఆయన కోరారు. తాను ఎమ్మెల్యే కాదు వైసీపీలో ఉన్న ప్రతీ కార్యకర్త ఎమ్మెల్యేగానే ఉంటారని, ఆ గౌరవం అందరిదీ అని ఆయన అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే మాటలు వింటే ఆయనకు టచ్ లోకి వచ్చిన కూటమి నేతలు ఎవరు ఆయనను వైసీపీ నుంచి ఎందుకు తమ వైపు తీసుకుని వెళ్ళాలని చూశారు అన్నది వైసీపీలో తర్కించుకుంటున్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఏజెన్సీలో గెలిచారు.

ఈ మూడు సీట్లు తప్ప మొత్తం అన్నీ కూటమి ఖాతాలో పడిపోయాయి. ఈ కొరత కూడా లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే ఉత్తరాంధ్రలో సంపూర్ణ విజయం దక్కుతుందని భావించారని అంటున్నారు. అయితే వైసీపీ పుట్టాక ఏజెన్సీలో ఆ పార్టీకే జనాలు పట్టం కడుతూ వచ్చారు. వైసీపీని కాదని ఫిరాయించిన వారి రాజకీయ జీవితం అక్కడితోనే ఆగిపోయింది.

20 Replies to “వైసీపీ ఎమ్మెల్యేతో కూటమి బేరసారాలు”

  1. అక్కడె MLA లు ఎక్కువ మంది అయిపొయారు. మీరు వస్తాను అన్నా అక్కడ తీసుకొరు రా అయ్యా! ఎందుకు ఈ డ్రామాలు!

  2. పీఎస్ఆర్‌, కాంతిరాణా, విశాల్‌ గున్నీ సస్పెన్షన్‌ — ఈ వార్త రాయవా గురువిందా? ఎమి జరగనట్టె డ్రమాలు వెస్తావా?

  3. గోడ దూకడానికి “సిద్ధం” గా ఉన్నాడని కూటమి ప్రభుత్వానికి హింట్లు ఇస్తున్నాడు కాబోలు..

    మేము “సిద్ధం” గా ఉన్నా.. ఎవ్వడూ పిలవడం లేదని.. పాపం.. ఫీల్ అయినట్టున్నాడు.. కట్టు కథ అల్లేసుకుని మురిసిపోతున్నాడు..

  4. ఎక్కడ ఐతే ప్రజలు అమాయకులు గా ఉండి చదువు లేని వారు ఎక్కువగా ఉంటారో అక్కడ వైసీపీ నే గెలుస్తుంది ఒప్పుకోవాల్సిన నిజం

  5. బుద్దున్నోడు వైసిపిని వీడరు. 2019 గెలిచి టీడీపీలో చేరినోళ్లు ఎక్కడున్నారో తెలిసిందే. భవిష్యత్ వైసీపీదే అని జగన్ కోసo తరలివస్తున్న జనాలే నిదర్శనం

Comments are closed.