బాబు ఇంటిని కూల్చాల్సిందే అంటున్న విజ‌య‌సాయిరెడ్డి!

కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌పై చ‌ట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో వుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నివాసాన్ని కూల్చాల్సిందే అని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.…

కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌పై చ‌ట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో వుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నివాసాన్ని కూల్చాల్సిందే అని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఏముందంటే…

“ప‌ర్యావ‌ర‌ణ సున్నిత ప్రాంతంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేప‌ట్ట‌డం అక్ర‌మం. ఈ అక్ర‌మ నిర్మాణాల్ని వెంట‌నే కూల్చేయాలి. ఒక‌వేళ కూల్చ‌క‌పోతే కృష్ణా, గుంటూరు జిల్లాల‌ ప్ర‌జ‌ల ఆస్తిపాస్తుల‌కు పెను ముప్పు క‌లుగుతుంది. సీఆర్‌జెడ్ నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డంలో శాస‌న వ్య‌వ‌స్థ‌, ప్ర‌భుత్వ యంత్రాంగం పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయి. న్యాయ వ్య‌వ‌స్థ క‌ల్పించుకుని ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌ను, వారి ఆస్తుల్ని కాపాడాలి” అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఏపీలో హైడ్రాలాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తామ‌ని మున్సిప‌ల్‌శాఖ మంత్రి పి.నారాయ‌ణ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి నుంచి ఇలాంటి డిమాండ్ రావ‌డం గ‌మ‌నార్హం. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చంద్ర‌బాబు ఇంటిని మొద‌ట కూల్చివేసి, ఆ త‌ర్వాత మిగిలిన అక్ర‌మాల జోలికి వెళ్లాల‌నేది మెజార్టీ అభిప్రాయం.

వైసీపీ చాలా ఏళ్లుగా చంద్ర‌బాబు నివాసం వుంటున్న క‌ర‌క‌ట్ట నివాసం విమ‌ర్శ‌లు చేస్తోంది. కృష్ణా న‌ది ప‌రీవాహ‌కంలో అక్ర‌మంగా నిర్మించిన ఇంట్లో బాబు నివాసం వుంటున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ‌లో స‌ముద్ర తీరానికి స‌మీపంలో విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె అక్ర‌మంగా నిర్మాణం చేప‌ట్టారంటూ ఇటీవ‌ల గోడ కూల్చివేశారు. ఒక్కొక్క‌రికి ఒక్కో న్యాయం ఏంట‌నేది విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌.

22 Replies to “బాబు ఇంటిని కూల్చాల్సిందే అంటున్న విజ‌య‌సాయిరెడ్డి!”

    1. ముని మనవడు వయసున్న కొడుకుకి డైపర్లు మార్చుకుంటూ.. శేష జీవితం గడుపుతున్నాడు..

  1. మరి ఈ 5 ఎళ్ళు ఆ పని ఎందుకు చెయలెదు?

    చంద్రబాబు ఇల్లు నిబందనలకి అనుకునంగా నదికి 500 మీటర్ల దూరం లొనె ఉంది.

  2. ఎన్ని ఎన్ని ఎన్ని మంచిపనులు చేసారు గత ఐదు సంవత్సరాల లో మీరు …….ఇది ఎందుకు చెయలెకపోయారబ్బా…….వెరే ఇంకొ మంచి పనిలో బిజిగా ఉన్నారా…….?

  3. ఎప్పుడు చూసినా కూల్చేయ్ కూల్చేయ్

    అంత ఆవేశం వద్దు.. శాంతం శాంతం శాంతం

Comments are closed.