రామ్ చరణ్ బీస్ట్ మోడ్

రామ్ చరణ్ కు మేకోవర్స్ కొత్త కాదు. ఈమధ్య తన ప్రతి సినిమాలో కొత్త గా కనిపిస్తున్నాడు చరణ్. ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా మేకోవర్ షురూ చేశాడు ఈ మెగా హీరో.…

రామ్ చరణ్ కు మేకోవర్స్ కొత్త కాదు. ఈమధ్య తన ప్రతి సినిమాలో కొత్త గా కనిపిస్తున్నాడు చరణ్. ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా మేకోవర్ షురూ చేశాడు ఈ మెగా హీరో.

కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాననే అర్థం వచ్చేలా “బీస్ట్ మోడ్ ఆన్” అనే క్యాప్షన్ తో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో చరణ్ వెనక వైపు నుంచి కనిపిస్తుండగా, అతడి ట్రయినర్ ఫొటోలో ఉన్నాడు.

బుచ్చిబాబు దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు చరణ్. ఈ సినిమా కోసమే కొత్త లుక్ లోకి మారబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది.

రంగస్థలం సినిమాలో రూరల్ లుక్ లో కనిపించాడు చరణ్. అయితే ఆ లుక్ కు, బుచ్చిబాబు సినిమాలో పాత్రకు చాలా తేడా ఉండబోతోంది. ఈసారి చరణ్ ఎలాంటి మేకోవర్ చూపిస్తాడనే ఆసక్తి అందర్లో ఉంది.

ధృవ, వినయవిధేయరామ సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించాడు చరణ్. ఇక ఆర్ఆర్ఆర్ లో చరణ్ ఫిజిక్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు బుచ్చిబాబు మూవీ కోసం మరింత కొత్తగా కనిపించడానికి హోం వర్క్ మొదలుపెట్టాడు.

8 Replies to “రామ్ చరణ్ బీస్ట్ మోడ్”

Comments are closed.