ఇంకా రెచ్చిపోతూనే ఉన్న కౌశిక్ రెడ్డి

గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాడు. ఏమాశించి ఇలా చేస్తున్నాడో తెలియడంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు చేసినవారే గమ్మున ఉంటే కాంగ్రెస్ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన…

గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాడు. ఏమాశించి ఇలా చేస్తున్నాడో తెలియడంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు చేసినవారే గమ్మున ఉంటే కాంగ్రెస్ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన రెడ్డిగారు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాడు.

గాంధీతో గొడవ కాస్త సద్దుమణగగానే రేవంత్ రెడ్డి మీద ఆరోపణలతో రెచ్చిపోతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వగానే ఓటమి భయం పెట్టుకుందో ఏమోగానీ ఎన్నికల్లో తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను బెదిరించాడు.

ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. తాను హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నాడు. రేవంత్ రెడ్డి తనను హత్య చేయించే అవకాశం ఉందని అంటున్నాడు. తాను హత్యకు గురైతే అందుకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని చెబుతున్నాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు.

రేవంత్ రెడ్డి తనకన్నా తక్కువ అనే విధంగా, తాను గొప్పవాడినని చెప్పుకునేవిధంగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడానికి తన మద్దతు కోరుతూ, తన కాళ్ళు మొక్కాడని చెప్పాడు. రేవంత్ రెడ్డితో కాళ్ళు మొక్కించుకున్నానని చెప్పడమంటే తాను ఆయన కంటే గొప్పోడిని అని చెప్పినట్లే కదా.

రేవంత్ రెడ్డి తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆయనతో తాను కాళ్ళు మొక్కించుకున్నానని చెప్పడంలో కౌశిక్ రెడ్డి ఏం సాధించాలనుకుంటున్నడో ఆయనకే తెలియాలి. తాను పవర్ ఫుల్ లీడరును అనుకుంటున్నాడేమో. ప్రత్యర్థుల మీద ధారాళంగా బూతులు మాట్లాడే కేసీఆర్ కూడా కాలం కలిసి రాక ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇక కౌశిక్ రెడ్డి ఎంతటోడు !

4 Replies to “ఇంకా రెచ్చిపోతూనే ఉన్న కౌశిక్ రెడ్డి”

  1. అయన PCC ప్రెసిడెంట్ కావలంటె Rahul gandhi కాళ్ళు మొక్కాలి గాని నీ కాళ్ళెందుకురా

    ముక్కొడు గ్లాస్ లొ రాత్రి మిగిలింది ఎమైనా తాగినావ్ రా

Comments are closed.