సంయుక్త దృష్టిలో గేమ్ ఛేంజర్

పరిశ్రమలతో సంబంధం లేకుండా నటీనటులంతా హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సంయుక్త మీనన్ కూడా చేరింది. బేసిగ్గా మలయాళీ అయిన ఈ ముద్దుగుమ్మ, ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటిస్తోంది.…

పరిశ్రమలతో సంబంధం లేకుండా నటీనటులంతా హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సంయుక్త మీనన్ కూడా చేరింది. బేసిగ్గా మలయాళీ అయిన ఈ ముద్దుగుమ్మ, ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటిస్తోంది.

తొలిసారి హేమ కమిటీపై, కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది సంయుక్త మీనన్. హేమ కమిటీని మల్లూవుడ్ లో గేమ్ ఛేంజర్ గా అభివర్ణించింది.

“చాలా రంగాల్లానే మలయాళ చిత్రసీమ కూడా ఓ అసంఘటిత రంగం. అడవిలో చిక్కుకొని దారి కోసం వెదుకుతున్న స్థితిలో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కొన్ని రకాల దోపిడీలకు పాల్పడే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హేమ కమిటీ, చిత్రసీమకు ఓ దిశానిర్దేశం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపై మహిళలకు అక్కడ మరింత భద్రత దక్కుతుంది. హేమ కమిటీ మలయాళ చిత్రసీమకు గేమ్ ఛేంజర్ గా మారుతుంది.”

పరిశ్రమలో రక్షణ, శుభ్రత, సౌకర్యాలు మహిళలందరికీ సమానంగా అందాలని డిమాండ్ చేస్తోంది సంయుక్త మీనన్. ఈ విషయంలో స్టార్ డమ్ ను లెక్కలోకి తీసుకోకూడదని, మహిళలందరికీ ఈ 3 అంశాలు సమానంగా అందినప్పుడు మాత్రమే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది.

సినీ పరిశ్రమలోనే కాకుండా, చాలా రంగాల్లో స్త్రీలు దోపిడీకి గురవుతున్నారని.. అందుకే హేమ కమిటీ నివేదిక చూసిన తర్వాత తనకు ఆశ్చర్యం కలగలేదని తెలిపింది సంయుక్త.

2 Replies to “సంయుక్త దృష్టిలో గేమ్ ఛేంజర్”

Comments are closed.