తిరుమ‌ల ప్ర‌సాదాల‌పై హైకోర్టుకు వైసీపీ!

తిరుమ‌ల ప్ర‌సాదాలపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన వివాదాస్ప‌ద కామెంట్స్‌పై వైసీపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. పిటిష‌న్‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించింది. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌సాదాల‌ను జంతువుల నూనెల‌తో త‌యారు చేసి అప‌విత్రం చేశార‌ని,…

తిరుమ‌ల ప్ర‌సాదాలపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన వివాదాస్ప‌ద కామెంట్స్‌పై వైసీపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. పిటిష‌న్‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించింది. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌సాదాల‌ను జంతువుల నూనెల‌తో త‌యారు చేసి అప‌విత్రం చేశార‌ని, తాము మాత్రం స్వ‌చ్ఛ‌మైన నెయ్యితో త‌యారు చేసి నాణ్య‌త పెంచిన‌ట్టు చంద్ర‌బాబు అన్నారు.

తిరుమ‌ల ప్ర‌సాదాల‌పై బాబు కామెంట్స్ త‌మ ప్ర‌భుత్వంతో పాటు టీటీడీని అప్ర‌తిష్ట‌పాలు చేసేలా ఉన్నాయని, విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో వైసీపీ త‌ర‌పున ఆ పార్టీ న్యాయ‌వాదులు పిటిష‌న్ వేశారు.

సీబీఐ లేదా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ త‌న పిటిష‌న్‌లో కోరారు. తిరుమ‌ల ప్ర‌సాదాల్లో క‌ల్తీ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన వివాదం కావ‌డం, కోట్లాది మంది హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు కావ‌డంతో వైసీపీ కూడా సీరియ‌స్‌గా తీసుకుంది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ వ్య‌వ‌హారాన్ని ఊరికే వ‌దిలి పెట్టొద్ద‌ని వైఎస్ జ‌గ‌న్ కూడా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే వెంట‌నే హైకోర్టును ఆశ్ర‌యించిన‌ట్టు వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ విష‌య‌మై బుధ‌వారం వాద‌న‌లు వింటామ‌ని హైకోర్టు పేర్కొంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు తిరుమ‌ల ప్ర‌సాదం చుట్టూ తిర‌గ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

17 Replies to “తిరుమ‌ల ప్ర‌సాదాల‌పై హైకోర్టుకు వైసీపీ!”

  1. వివేకా కేసు మొదట సిబిఐ కి ఇమ్మని కోర్ట్ కి వెళ్ళేరు సర్ అధికారం లోనికి రాగానే నేనే బద్దలు కొట్టేస్తానని సిబిఐ వద్దన్నాడు ఆ తర్వాత జడ్జి ల తోటి మోడీ ద్వారా సిబిఐ తోటి బాగా బేరం కుదిరింది ఇప్పుడు పాపం మల్లి సిబిఐ కానీ జడ్జి కానీ చేసేస్తే తప్పు కోవచ్చు నేరస్తుడే విచారణ ఎలాగా కావాలో నిర్ణయిస్తాడు జడ్జి లతో బాగా డీలింగ్ లు వున్నాయి కాబట్టే గాలి జనార్దనా రెడ్డి ఈయన గారి కేసు లు తేలవు మన చట్టాలు పల్లెటూర్ల లో ఆడుకొనే రికార్డింగ్ డాన్స్ లకు కోడిపందాలకు పనికి వస్తాయి

  2. వాళ్ళ బొంద!

    హై కొర్ట్ కి వెళ్ళి దీని మీద గ్యాగ్ ఆర్డర్ తెచ్చి… ఇక ఈ విషయం ఎవరూ మాట్లాడకుండా జనం నొరు మూయించాలి అన్నది YCP అలొచణ!!

  3. వాళ్ళ బొం.-.ద!

    హై కొర్ట్ కి వెళ్ళి దీని మీద గ్యాగ్ ఆర్డర్ తెచ్చి… ఇక ఈ విషయం ఎవరూ మాట్లాడకుండా జనం నొరు మూయించాలి అన్నది YCP అలొచణ!!

  4. హై కొర్ట్ కి వెళ్ళి దీని మీద గ్యాగ్ ఆర్డర్ తెచ్చి… ఇక ఈ విషయం ఎవరూ మాట్లాడకుండా జనం నొరు మూయించాలి అన్నది YCP అలొచణ!!

  5. వాళ్ళ బొం.-.ద!

    హై కొర్ట్ కి వెళ్ళి దీని మీద గ్యాగ్ ఆర్డర్ తెచ్చి… ఇక ఈ విషయం ఎవరూ మాట్లాడకుండా జనం నొరు మూయించాలి అన్నది Y.-.C.-.P అలొచణ!!

    1. ఇక ఈ లొపు హై కొర్ట్ జుర్ద్జ్ తొ విచారణ అని GA గాడి build up లు! ఎవరికి తెయదురా మీ నాటకాలు!

      .

      స్వమి వారి ప్రసాదం నుండి సారాయి బ్రండ్ల వరకూ అన్ని కల్తీనె! సన్నసుల్లరా!

  6. డబ్బుల కొసం రాష్త్రం లొ జె బ్రాండ్లు తెచ్చినట్టె నెయ్యి లొ కూడా కొత్త బ్రండ్లు తెచ్చారు అనుకుంటా!

  7. సజ్జల ఎక్కడ దాక్కున్నావయ్యా? అయిన దానికి కానీ దానికి ముందు ఉంటావ్ నీ నాయకుడు జగన్ కోసం?

  8. వైసీపీ మద్దతుదారులకు,

    మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

    తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

    హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

    వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

  9. బహుశా గాగ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు సర్ కి అందరితో లింక్ లు వున్నాయి కాబట్టి విచారణ జరగ కుండా స్టే తెచ్చుకోవచ్చు సిబిఐ కి ఇస్తే మోడీ గారి దయతో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేయొచ్చు

Comments are closed.