ఆ శాఖకు మంత్రిగా గంటా

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని తెలియని వారు ఉండరు. ఆయనది పాతికేళ్ల రాజకీయం ఒక సారి ఎంపీగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన గంటా…

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని తెలియని వారు ఉండరు. ఆయనది పాతికేళ్ల రాజకీయం ఒక సారి ఎంపీగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన గంటా రాష్ట్ర రాజకీయ నేతలలో ఒకరిగా ముద్ర పడ్డారు

ఆయన గెలిచిన ప్రతీ సారీ మంత్రి అవుతూ వచ్చారు. ఈసారి మాత్రం ఆయనకు ఆ చాన్స్ దక్కలేదు. ఆయన సీనియర్ గా ఒక మాజీ మంత్రిగా ఉంటున్నారు. అయితే గంటా తరచూ మీడియా ముందుకు వచ్చి సందడి చేస్తూనే ఉన్నారు. రాజకీయ విమర్శలు వైసీపీ మీద చేస్తూ తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు

వైసీపీ మునిగిపోయే నావ అని ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ ఉండరని ఒకసారి సంచలన కామెంట్స్ చేసిన గంటా లేటెస్ట్ గా మరో సంచలన కామెంట్ చేశారు. జగన్ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అని, ఆయన పార్టీని రద్దు చేయమని ఎన్నికల సంఘాన్ని కోరుతామని గంటా అంటున్నారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతలో లోపాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బయటపడ్డాయని దానికి బాధ్యత వహించి నైతికంగా జగన్ తప్పుకోవాలని గంటా కోరారు. వైసీపీని రద్దు చేస్తే రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచిదని గంటా ఒక సూచన చేశారు.

గంటా ఈ తీరుగా మాట్లాడుతూ ప్రతీ రోజూ వైసీపీ మీద జగన్ మీద చేస్తున్న విమర్శలు చూసిన వారు ఆయనకు జగన్ ని తిట్టే మంత్రిత్వ శాఖను టీడీపీ అధినాయకత్వం ఇచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. గంటా వైసీపీని ఎంత తిడితే అంతలా ఆయనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందనే ఇలా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. గంటా మాత్రం వైసీపీని ఏ మాత్రం విడిచిపెట్టకుండా అవకాశం వస్తే చాలు హాట్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

9 Replies to “ఆ శాఖకు మంత్రిగా గంటా”

    1. అందుకే జనాలు 151 నుండి 11 కి పడేసారు.. దీన్నే “క్రెడిబిలిటీ” అంటారు..

        1. 23 వచ్చిన చంద్రబాబు కి క్రెడిబిలిటీ లేకపోతే.. 11 తెచ్చుకుని జనాల చేతే ఛీ కొట్టించుకున్న జగన్ రెడ్డి కి.. హయ్యో హయ్యో.. హయ్యయ్యో..

  1. సొంత శాఖల విషయాలు చెప్పకుండా .. ప్రెస్ మీట్ లు పెట్టి మరి బాబు ని తిట్టేవారు గత కాలపు ప్రస్తుత మాజీ మంత్రివర్యులు .. అప్పుడు నువ్వు రాసిన రాతలు ఒక సరి గుర్తు చేసుకో ..

  2. సరిగ్గా ఎలెక్షన్కి కి one ఇయర్ ముందు ఎలక బొక్క లోంచి వచ్చి గంట కొట్టింది, అంతకు ముందు నాలుగేళ్లు ఎక్కడో నిద్ర పోయింది. CBN కి ఈ విషయం తెలుసు అందుకే మినిస్ట్రీ ఇవ్వలేదు, ఐయినా వైజాగ్ కి గాని రాష్ట్రానికి గాని ఒరిగింది గంటాతో ఏమి లేదు నొల్లుకున్నది చాలు

    జాగా బొక్క

Comments are closed.