తేనెతుట్ట కదిపిన కొరటాల

మెగాస్టార్ చిరు ఆచార్య కథను కెలికారని లేదంటే కొరటాల మంచి సినిమా అందించి వుండేవారని ఓ అభిప్రాయం వుంది.

దర్శకుడు కొరటాల ను ఆచార్య నీలి నీడలు ఇంకా వెంటాడుతున్నాయి. కానీ ఈ సారి కొరటాలనే అనుకోకుండా మరోసారి ఆచార్య ను గుర్తు చేసారు. దాంతో సోషల్ మీడియాలో రెండు వైపుల ఫ్యాన్స్ ఢీ అంటే ఢీ అంటున్నారు.

లేటెస్ట్ గా ఓ ఇంటర్వూలో మళ్లీ కొరటాల అన్యాపదేశంగా ఆచార్య ప్రస్తావన తెచ్చారు. ఎన్టీఆర్-విష్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో కొరటాల మాట్లాడుతున్నపుడు ‘ఫియర్’ ఫ్యాక్టర్ గురించి ప్రస్తావన వచ్చింది. ఎవరి పని వారు భయభక్తులతో చేస్తే ప్రపంచం ప్రశాంతంగా వుంటుంది అని కొరటాల అంటూ, పక్కవాడి పనిలో చేతులు పెట్టి కెలకకూడదు అనేలా కొంత కామెంట్ చేసారు.

ఇది వెళ్లి వెళ్లి ఆచార్య సినిమా విషయం వున్న పాత గాయాన్ని కెలికింది. మెగాస్టార్ చిరు ఆచార్య కథను కెలికారని లేదంటే కొరటాల మంచి సినిమా అందించి వుండేవారని ఓ అభిప్రాయం వుంది. ఇది కొరటాల అభిమానుల్లో వుంది. అందుకే వారు పాత సంగతి గుర్తు చేసుకుని మెగాస్టార్ ను కామెంట్లతో టార్గెట్ చేసారు. దానికి కౌంటర్ గా మెగా ఫ్యాన్స్ తమ స్టయిల్ కామెంట్లతో దాడి చేసారు.

అసలే దేవర విషయంలో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీలి సొషల్ మీడియాను రంజింప చేస్తున్నారు. ఇది దేవర సినిమా ఫలితం మీద ప్రభావం చూపిస్తుందనే భయం కూడా సినిమా ఇండస్ట్రీలో వుంది. ఇప్పుడు కొత్తగా కొరటాల కామెంట్ ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లు అయింది. మరొ రెండు మూడు రోజులు ఇది ఇలా రగులుతుంది.

20 Replies to “తేనెతుట్ట కదిపిన కొరటాల”

  1. Yevvaraina Gelakatam.. chala common,, flop ithe pannana valla mida toyadam common..gap ravadam kuda common.. apithe aagedi kaadu, apakunna continue ayyedi kaadu.. chiru, koratala know that.. we need not worry,, be happy.. let us try not to trouble others intentionally..

  2. ఎన్టీఆర్ ఫ్యాన్స్ , charan fans తిట్టుకోవడం అంత రంజింప చేస్తుందా GA నిన్ను…..ఈ లెక్కన మన అన్నయ్య మొఖం మీద దేశం మొత్తం UNANIMOUS గా వుమ్మేస్తుంటే ఇంకెంత రంజుగా ఫీల్ అయ్యావు GA…..

  3. Megastar kelikite Mari veedu em nammakam tho producers daggara movie ni wholesale ga konukunnadu😂..evadiki cheptadu sollu same saviour concept in all movies…Aacharya ki world building lo telipoyi addam ga dorikesadu…malli velu petti kelikadu anta…koratala all movies same template & same formula…except mirchi&Sri mantudu…rest all flat narrations… holidays valla JG,BAN gattekesay kaani…Aacharya ki ekanga mottham dorikesadu…total audience reject chesesaru…ippudu devara kooda same vibes…malli rotta saviour concept 🙏

  4. కొరటాల ఏ ఉద్దేశంతో అన్నారొ ఆ మాట తెలియదు గాని చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడితె అది తప్పు. ఆచార్య అసలు రామ్ చరణ్ తొ చేద్దామని రాసుకొన్న కద. సెకండ్ హిరొగ మరొకరిని అనుకొన్నారు. చరణ్ RRR లొ బిజిగా ఉండటం వలన గెస్ట్ పాత్రలొకి చరణ్, మెయిన్ పాత్రలొకి చిరు వచ్చారు . కానీ ఆ కథ చిరు కి సెట్ అవ్వలేదు. అక్కడ కద ఏమి ఉందని చిరు దూరి పాడు చెయ్యడానికి అరె దీన్ని ఇలా తీసుంటె బాగున్నురా అనేలా లేదు ఎప్పుడు బయటకు వెళ్లిపొదాం అనేలా ఉంది

    తారఖ్ సినిమా బ్లాక్ బష్టర్ అవ్వాలని కొరుకుంటున్నా.. పొరబాటున యావరేజ్ అయ్యింది అనుకొ అప్పుడు వేసుకొంటారు ట్రొలర్స్ కొరటాలను..అందుకే మాటలు ఆచి తూచి వాడాలి అనేది .

  5. కొరటాల ఏ ఉద్దేశంతో అన్నారొ ఆ మాట తెలియదు గాని చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడితె అది తప్పు. ఆచార్య అసలు రామ్ చరణ్ తొ చేద్దామని రాసుకొన్న కద. సెకండ్ హిరొగ మరొకరిని అనుకొన్నారు. చరణ్ RRR లొ బిజిగా ఉండటం వలన గెస్ట్ పాత్రలొకి చరణ్, మెయిన్ పాత్రలొకి చిరు వచ్చారు . కానీ ఆ కథ చిరు కి సెట్ అవ్వలేదు. అక్కడ కద ఏమి ఉందని చిరు దూరి పాడు చెయ్యడానికి అరె దీన్ని ఇలా తీసుంటె బాగున్నురా అనేలా లేదు ఎప్పుడు బయటకు వెళ్లిపొదాం అనేలా ఉంది

    తారఖ్ సినిమా బ్లాక్ బష్టర్ అవ్వాలని కొరుకుంటున్నా.. పొరబాటున యావరేజ్ అయ్యింది అనుకొ అప్పుడు వేసుకొంటారు ట్రొలర్స్ కొరటాలను..అందుకే మాటలు ఆచి తూచి వాడాలి అనేది .

  6. శ్రేమంతుడు సినిమా కాపి కొట్టాడు

    జనతా గారేజ్ – గాడ్ ఫాదర్ కతనే

    ఈడో కళాఖండాలు తీశాడని ఆటిట్యూడ్ ఎదవకు

Comments are closed.