తిరుమ‌ల‌కు జాతీయ మీడియాకు అనుమ‌తి లేదు!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై తీవ్ర స్థాయిలో వివాదం నెల‌కుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌సాదంపై చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం రేపాయి. అయితే వాస్త‌వాలేంటి? అని తెలుసుకోడానికి చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, ఢిల్లీ న‌గ‌రాల…

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై తీవ్ర స్థాయిలో వివాదం నెల‌కుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌సాదంపై చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం రేపాయి. అయితే వాస్త‌వాలేంటి? అని తెలుసుకోడానికి చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, ఢిల్లీ న‌గ‌రాల నుంచి తిరుమ‌ల‌కు జాతీయ మీడియా ప్ర‌తినిధులు వెళ్లారు.

కానీ తిరుప‌తి అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద జాతీయ మీడియా ప్ర‌తినిధుల కెమెరాలు, ఇత‌ర‌త్రా సామ‌గ్రిని కొండ‌పైకి తీసుకెళ్ల‌డానికి విజిలెన్స్ సిబ్బంది అనుమ‌తించ‌లేదు. తిరుప‌తిలో త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుకు ఏవీఎస్‌వో కార‌ణ‌మ‌ని భావించి, ఆయ‌న‌పై జాతీయ మీడియా ప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు. వాస్త‌వాల్ని ప్ర‌పంచానికి చెప్పాల‌నే స‌దాశ‌యంతో తిరుమ‌ల‌కు వెళ్లాల‌ని వ‌స్తే, అడ్డుకోవ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

తిరుమ‌ల‌లో వాస్త‌వాల్ని దాచి పెట్టాల‌ని టీటీడీ అధికారులు అనుకుంటున్నార‌ని జాతీయ మీడియా ప్ర‌తినిధులు ఆరోపిస్తున్నారు. రాజ‌కీయంగా తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదాన్ని వాడుకుంటున్నార‌నో ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో నిజాల్ని బ‌య‌టికి రాకుండా చేయ‌డంపై మండిప‌డుతున్నారు.

హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా సాగుతున్న వ్య‌వ‌హారంపై ఫుల్ స్టాప్ పెట్ట‌డానికి జాతీయ మీడియా ప్ర‌య‌త్నిస్తుంటే, ఎందుకు కొండ‌పైకి వెళ్ల‌కుండా అడ్డుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

8 Replies to “తిరుమ‌ల‌కు జాతీయ మీడియాకు అనుమ‌తి లేదు!”

  1. అదేంటి…రిపబ్లిక్ లో అర్ణబ్, ఇండియా టుడే లో రాహుల్, రాజ్దీప్ వాయించారుగా

    1. వీడి కి జగన్ ఇంగ్లీష్ మాత్రమే అర్థం అవుతుంది అర్ణబ్ accent అర్థం అవదు బహుశా చూడలేదేమో

  2. తిరుమలకు జాతీయ మీడియాకు అనుమతి లేదు కాదురా మూర్ఖుడా తిరుమలలో జాతీయ మీడియాకు అనుమతి లేదు అని వ్రాయాలి

Comments are closed.