బాబుకు థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్

హీరో ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పాడు. దేవర సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించి, ప్రత్యేక జీవో విడుదల చేసినందుకు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు…

హీరో ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పాడు. దేవర సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించి, ప్రత్యేక జీవో విడుదల చేసినందుకు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పాడు తారక్.

ఏపీలోని అన్ని థియేటర్లలో టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతినిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్స్ లో అప్పర్ క్లాస్ టికెట్లను 110 రూపాయల వరకు, దిగువ తరగతి టికెట్లను 60 రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇక మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లను గరిష్ఠంగా 135 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. ఇవన్నీ జీఎస్టీతో కలిపి వర్తిస్తాయని తెలిపింది.

ఇక ప్రత్యేక షోల విషయానికొస్తే.. విడుదల రోజున.. అంటే 27వ తేదీన అర్థరాత్రి 12 గంటల నుంచి ఆట మొదలుపెట్టుకోవచ్చని తెలిపింది. రిలీజ్ రోజున 6 ఆటలకు.. మరుసటి రోజు నుంచి రోజుకు 5 ఆటలు చొప్పున 9 రోజుల పాటు వేసుకోవచ్చని తెలిపింది. తాజా జీవోతో దేవర సినిమాకు పూర్తిస్థాయిలో వెసులుబాటు కల్పించినట్టయింది.

అనంతపురంలో రక్తాభిషేకం.. మరోవైపు దేవర క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది. దేవరపై ఓవైపు నెగెటివ్ ట్రోల్ నడుస్తున్నా.. అభిమానులు అదేం పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో దేవర క్రేజ్ మామూలుగా లేదు. ఆల్రెడీ ఏపీ,నైజాంలో వైబ్ మొదలైంది.వారం రోజుల ముందు నుంచే థియేటర్లలో సందడి మొదలైంది. ఆల్రెడీ చాలా చోట్ల ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టేశారు. అనంతపురం థియేటర్ వద్ద ఏకంగా రక్తాభిషేకం చేశారు ఎన్టీఆర్ అభిమానులు.

దేవర సినిమాలో రక్తం ఏరులై పారినట్టు చూపించారు. సముద్రం మొత్తం రక్తమయంగా మారినట్టు చూపించారు. ఈ సీన్ ను కటౌట్ల వద్ద రీ-క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

6 Replies to “బాబుకు థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్”

  1. అంటే.. వాళ్ళు వాళ్ళు ఒక్కటైపోయారు..

    మధ్యలో దూరి చలి కాచుకొందామనుకున్న జగన్ రెడ్డి మాత్రం.. లడ్డూ లో ఇరుక్కుపోయి.. అప్పడమైపోయాడు..

Comments are closed.