నూటికి 90 శాతం ఇ-కార్లు, ఆ దేశానికి కొత్త ఇక్క‌ట్లు!

ఎలక్ట్రిక్ కార్ల‌ను కొంటామంటే చాలా దేశాలు కొనుగోలు దార్ల‌కు ప‌న్ను మిన‌హాయింపులు ఇస్తూ ఉన్నాయి. మ‌రి కొన్ని దేశాలు మ‌రో అడుగు ముందుకు వేసి, పెట్రోల్-డీజిల్ కార్లు కాకుండా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను న‌డిపితే అద‌న‌పు…

ఎలక్ట్రిక్ కార్ల‌ను కొంటామంటే చాలా దేశాలు కొనుగోలు దార్ల‌కు ప‌న్ను మిన‌హాయింపులు ఇస్తూ ఉన్నాయి. మ‌రి కొన్ని దేశాలు మ‌రో అడుగు ముందుకు వేసి, పెట్రోల్-డీజిల్ కార్లు కాకుండా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను న‌డిపితే అద‌న‌పు రాయితీలు కూడా ప్ర‌క‌టించాయి. వాతావ‌ర‌ణంలోకి విడుద‌ల‌వుతున్న క‌ర్బ‌న ఉద్గారాల్లో ప‌దో వంతు వాహ‌నాల వాటానే ఉంది. ఈ ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇ-వెహిక‌ల్స్ ను వివిధ దేశాలు ప్రోత్స‌హిస్తూ ఉన్నాయి.

అలాంటి వాటిల్లో నార్వే కూడా ఒక‌టి. ఆర్థికంగా స్థితిమంత‌మైన ప్ర‌భుత్వం ఉన్న దేశం ఇది. ప్ర‌పంచంలోనే హ్యూమ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ ఇండెక్స్ లో, ప్రశాంత‌త‌మైన ప‌రిస్థితులు ఉండే దేశాల్లో నార్వే కూడా ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ప‌న్నులు ఎక్కువే కానీ, ప్ర‌భుత్వం చాలా ర‌కాలుగా ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూసుకుంటుంది. మ‌నుషుల లైఫ్ స్పాన్ కూడా ఈ దేశంలో ఎక్కువే! ఇలా అన్ని ర‌కాలుగానూ ముందువ‌ర‌స‌లో ఉండే ఈ దేశంలో ఎల‌క్ట్రిక్ కార్ల విష‌యంలో కూడా ప్ర‌భుత్వం చాలా ప్రోత్స‌హించింది.

త‌మ రోడ్ల‌పై పొగ వ‌దులుతూ తిరిగే కార్ల క‌న్నా కాలుష్య ర‌హిత‌మైన ఎల‌క్ట్రిక్ కార్లు తిరిగితే మేలు అనుకుంది. గ‌త ప‌దేళ్ల‌లో భారీగా ప్రోత్సాహ‌కాలు ఇచ్చింది. ఎంత‌లా అంటే.. ఎలక్ట్రిక్ కార్లు కొనే వారికి ప్ర‌భుత్వం వైపు నుంచి ఆ కారుపై ఎలాంటి ట్యాక్స్ ఉండ‌దు. ఆర్థిక శ‌క్తి గ‌ట్టిగా ఉండి, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా ఫ‌ర్వాలేదు ఎలాంటి ప‌న్నులూ ఉండ‌వు! దీంతో జ‌నాలంతా కొనేదేదో ఎలక్ట్రిక్ కారును కొనే దిశ‌గా వెళ్లారు. ప‌న్నులు లేక‌పోవ‌డం, పెట్రోల్ మెయింటెయినెన్స్ కూడా ఉండ‌ద‌నే లెక్క‌ల‌తో అంతా అటు మొగ్గారు. దీంతో ప్ర‌స్తుతం అక్క‌డ నూటికి 90 శాతం వ‌ర‌కూ ఎలక్ట్రిక్ కార్సే ఉన్నాయ‌ట‌!

అమ్మ‌డువుతున్న ప్ర‌తి ప‌ది కార్ల‌లో తొమ్మిది ఎల‌క్ట్రిక్ కార్లే అని, రోడ్డు మీద చూస్తే 87 నుంచి 90 శాతం ఇ-కార్సే ఉన్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇది నార్వే కోరుకున్న‌దే కానీ, ఇప్పుడు వీటి పుణ్య‌మా అని వేరే ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ట‌! అందులో ఒక‌టి.. ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌టంతో.. వంద‌కు వంద‌శాతం ప్ర‌జ‌లు కార్ల‌ను కొనేశార‌ట‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కూడా ఇలా ఇ-కార్స్ ను కొనుగోలు చేసిందట‌. దీంతో ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వాడే వారు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయార‌ట‌!

కేవ‌లం ప‌న్ను మిన‌హాయింపే కాదు, ఇ-కార్ కొనండి మీకు రోడ్ టోల్ కూడా ఉండ‌దంటూ నార్వే ప్ర‌భుత్వం ఇంకో రాయితీని కూడా అమ‌లు పెట్టింది! ఇది ప్ర‌భుత్వానికి టోల్ ట్యాక్స్ కూడా రాకుండా చేసింద‌ట‌! అటు కార్ల కొనుగోలు మీదా ట్యాక్సులు పోయి, ఇటు రోడ్ టోల్ ట్యాక్స్ కూడా లేకుండా పోయింద‌ట‌! నూటికి 90 శాతం ఇ-కార్లే ఉన్న‌ప్పుడు ఇక టోల్ క‌ట్టేదెవ‌రు? మ‌రోవైపు కార్ల‌లో తిరిగే అవ‌కాశం ఉండ‌టంతో.. ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వాడుకునే వారు త‌గ్గిపోయార‌ట‌! దీంతో.. నార్వే రాజ‌ధాని ఓస్లో లో ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌, ప్ర‌జ‌లు బ‌స్సులు ఎక్క‌డం లేదు, మెట్రో వాడ‌టం లేదు.. సొంత కార్ల‌లో తిరుగుతూ సాగిపోతూ ఉన్నారు. అక్క‌డా టోల్ ట్యాక్స్ రాదు. దీంతో అన్ని దారులూ మూసుకుపోయిన‌ట్టుగా అయ్యింద‌ట ప‌రిస్థితి.

ఇది వాస్త‌వ‌మే అని, ర‌వాణా ప‌న్నుల ద్వారా రావాల్సిన ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డంతో.. తాము ర‌వాణాకు సంబంధించి ఏదైనా భారీ ప్రాజెక్టు చేప‌ట్టే ప‌రిస్థితుల్లో లేమ‌ని ఆ దేశ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రి కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడింద‌న్న‌ట్టుగా ఇప్పుడు నార్వే ఇ-కార్ల ప్ర‌భావం క‌నిపిస్తూ ఉంది. కాలుష్య ర‌హితం అనుకున్న ఇ-కార్లకు రెక్క‌లు వ‌చ్చినా, ఇచ్చిన ప్రోత్సాహ‌కాల ఫ‌లితంగా ర‌వాణా ద్వారా రావాల్సిన ఆదాయం అంతా త‌గ్గిపోవ‌డంతో.. మిగ‌తా దేశాలు ప్రోత్సాహ‌కాల గురించి ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితిని చాటి చెబుతూ ఉంది!

10 Replies to “నూటికి 90 శాతం ఇ-కార్లు, ఆ దేశానికి కొత్త ఇక్క‌ట్లు!”

  1. petrol business chese vallu labo dibo naa. lol! electricity free gaa vastada ra.. adi kooda gas or petrol mandisthene ga vacchedi. aa elon musk gaadu sollu cheppadam janaalu nammi electric cars meeda padatam.

  2. ప్రజల ఆరోగ్యంకంటే ఏది ఎక్కువ కాకూడదు. నార్వే ఆవిషయంలో ముందడుగు వేసింది. కాలుష్యం వల ఏటా లక్షలాది మంది రోగాల బారిన పడుతున్నారు

      1. 1. తురకల ఆయిల్ బలుపు తగ్గుతుంది

        2. కరెంట్ చాలా రకాలుగా తయారవుతుంది, స్కాండినేవియన్ దేశాలు వేవ్స్, విండ్ పవర్ వైపు వెళ్తున్నాయి.

Comments are closed.