కొరటాల టాప్ స్క్రిప్ట్.. వీక్ స్క్రిప్ట్!

ఒక ఉత్కంఠ విషయంతో సినిమాను మొదలు పెట్టి, అది ఓ కొలిక్కి తేకుండానే సినిమాను ముగించడం అంటే రచయిత లేదా దర్శకుడి వైఫల్యం అనుకోవాలి.

దర్శకుడు కొరటాల శివ.. మిర్చి.. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. జ‌నతా గ్యారేజ్‌.. ఎలాంటి సినిమాలు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసినట్లే.. అచార్య సినిమాతో నేలకు దిగిపోయారు. సరే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పాయింట్ దగ్గర ఫెయిల్యూర్ ఎదురవుతుందిలే అని సరిపెట్టుకున్నారు అభిమానులు.

దేవర సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకున్నారు. అ రోజు రానే వచ్చింది. దేవర విడుదలయింది. రకరకాల కారణాల వల్ల ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. చాలా కాలం తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడాయి. భారీ రేట్లతో స్పెషల్ షోలు, భారీ ఓపెనింగ్.. ఇలా చాలా అంటే చాలా.

కానీ తీరా సినిమా చూస్తే మాత్రం నిరాశ. కొరటాల శివ నా? ఇలాంటి వీక్ సబ్జెక్ట్ నా? ఇలాంటి డైలాగులా? ఇలాంటి పాత్రల చిత్రీకరణ? ఇలాంటి సన్నివేశాలా? అనే కామెంట్లు సర్వత్రా వినిపించాయి. దేవర సినిమా చూసుకుంటే తొలిసగం వరకు జ‌నాలు ఓకె అనుకునే రేంజ్‌ కు వచ్చింది. కానీ రెండో సగం దగ్గర తప్పటడుగులు పడ్డాయి. ఈ రెండు కామెంట్లు చాలా విస్తారంగా వినిపిస్తున్నాయి.

కొరటాల అంటే మంచి పవర్ ఫుల్ సన్నివేశాలు. కొరటాల అంటే పదునైన సంభాషణలు. ఈ రెండింటి తరువాత హీరో ఎలివేషన్. కానీ దేవర సినిమాలో హీరో ఎలివేషన్ వరకు కొంత వర్కవుట్ అయింది. కానీ మిగిలిన రెండింటి విషయంలో మాత్రం కాదు. సినిమాను దేశంలో వరల్డ్ కప్ దగ్గర మొదలుపెట్టి, అసలు అదేమయింది అన్నది చూపకుండానే ముగించారు. రెండో భాగం వుంది కదా అని అనొచ్చు. కానీ దేవర కథ వరకు రెండో భాగం వుంటుంది. వుండాలి. కానీ ఒక ఉత్కంఠ విషయంతో సినిమాను మొదలు పెట్టి, అది ఓ కొలిక్కి తేకుండానే సినిమాను ముగించడం అంటే రచయిత లేదా దర్శకుడి వైఫల్యం అనుకోవాలి.

ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా మంచి పాటలు, వాటి ప్లేస్ మెంట్ ల విషయంలో పెర్ ఫెక్ట్ గా వుంటాయి కొరటాల సినిమాలు. మిర్చి నుంచి అచార్య వరకు కూడా ఇది. కనిపిస్తుంది. కానీ దేవర విషయంలో ఇది మిస్ అయింది.

దేవర సినిమాలో కూడా మంచి డైలాగులు వున్నాయి. కాదని అనలేము. కానీ మిగిలిన సినిమాలు వాటితే నిండిపోయాయి. ఇక్కడక్కడ అక్కడక్కడ మెరుపులు మెరిసాయి.

పడి పడి లేచా సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ..

దేవర అదిగినాదంటే చెప్పినాడు అని..

మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత కాదు

కళ్ళ లోకి చేపాల్సిన మాట కాళ్ళ కేసి చెప్తాండ

కొండకు గుండె జారినాది.

అంటే కొరటాలలో ఇంకా తడి వుంది. కానీ సరైన సబ్జెక్ట్ దొరకాలి. గతంలో ఈ సబ్జెక్ట్ ల విషయంలోనే కొరటాల మీద బోలెడు విమర్శలు వచ్చాయి. కేసులు నడిచాయి. చాలా మంది పెద్ద దర్శకులకు సబ్జెక్ట్‌ లే సమస్య. ఈ సమస్యను కొరటాల అధిగమించాల్సి వుంది.

కొరటాల వర్క్ ల్లో ఇదే బెస్ట్ నా…వేరేది అని అయన అనుకోవడం వరకు ఓకె.కానీ ఙనం దృష్టిలో మాత్రం దేవర కాదు..వేరేవే మంచి స్క్రిప్ట్ లు.

23 Replies to “కొరటాల టాప్ స్క్రిప్ట్.. వీక్ స్క్రిప్ట్!”

  1. Movie is bagundi manaki teliyani pani edaina chala easy ganey untadi chesteney kastam gaa untadii ,chepadaniki amundi chesteyney daani baruvu bada telisediii. Chepadam manesdam cheyadam f

  2. పాద ఘట్టం అయిపోయింది- ఇపుడు నిటి మట్టం – తరువాత నేల మట్టం..

    పార్ట్ 2 ఎవ్వడు అడిగారా నిన్ను కొరటాల శివ గా నమ్మి ఇచ్చిన సినిమా ను ప్యాన్స్ కు నచ్చేలా ఒక్క సారే పుల్ మిల్స్ లాగా తీసి సినిమా చూపించాలి కదా

Comments are closed.