ఎట్టకేలకు విడాకులపై నాగబాబు కుమారై నిహారిక స్పందించారు. భర్త చైతన్యతో విడాకులను తీసుకున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూనే.. ఇలాంటి టైంలో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
'విడాకుల తర్వాత.. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నామని, దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం తమకు అండగా నిలిచిన కుటుంబం సభ్యులకు, సన్నిహితులకు థ్యాంక్స్' అంటూ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
కాగా 2020లో చైతన్య జొన్నలగడ్డ – నిహారికల వివాహం జరిగింది. కొంతకాలంగా వివాహ బంధానికి దూరంగా ఉంటున్న ఆమె… మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకున్నారు. హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరారు.
కాగా.. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే. మరోవైపు నిహారిక బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లిపై కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి.