సినిమా నిరాశపరిస్తే క్షమాపణ పత్రం రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, రామ్ చరణ్, అఖిల్ లాంటి చాలామంది హీరోలు ఇప్పటికే ఇలాంటి లెటర్లు విడుదల చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నిఖిల్ కూడా చేరాడు. అయితే అతడు, తన సినిమా ఫ్లాప్ అయిందని చెప్పడం లేదు. ప్రాపర్ గా రిలీజ్ చేయలేకపోయినందుకు బాధపడుతూ, ఆడియన్స్ ను క్షమాపణలు కోరాడు.
“ప్రేక్షకులు నాపై ఇంత నమ్మకం ఉంచినందుకు చాలా ఆనందంగా ఉంది. అయినప్పటికీ కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే, దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా ప్రాపర్ గా రిలీజ్ కాలేదు. కాంట్రాక్ట్/కంటెంట్ లో డిలే వల్ల ఓవర్సీస్ లో 350 తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి.”
ఇలా తన బాధను వ్యక్తం చేశాడు నిఖిల్. ఈ సందర్భంగా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం ప్రేక్షకులను క్షమాపణలు కోరాడు. త్వరలోనే తననుంచి రాబోతున్న 3 సినిమాలు వివిధ భాషల్లో ప్రాపర్ గా రిలీజ్ అవుతాయని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా, ఎలాంటి వత్తిళ్లు ఎదురైనప్పటికీ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వనని, సినిమా మొత్తం పూర్తిచేసి, చెక్ చేసిన తర్వాతే మంచి ప్రాడెక్ట్ ఇస్తానని వాగ్దానం చేశాడు.
తన స్టేట్ మెంట్ తో స్పై నిర్మాతను నిఖిల్ పరోక్షంగా ఇరుకున పెట్టినట్టయింది. స్పై నిరాశపరచడం వెనక తన ప్రమేయం లేదని, నిర్మాతలు ఫోర్స్ చేయడం వల్లనే అలాంటి ఔట్ పుట్ వచ్చిందనే అభిప్రాయాన్ని నిఖిల్ పరోక్షంగా వెల్లడించినట్టయింది. ఇకపై తను ఎలాంటి వత్తిళ్లకు తలొగ్గనని నిఖిల్ చెప్పడం వెనక ఆంతర్యం ఏంటనేది అందరికీ తెలిసిందే.