డెవిల్.. కళ్యాణ్ రామ్.. వచ్చేసాడు

అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంటాడు కానీ కళ్యాణ్ రామ్ ఎంచుకునే కథలు మాత్రం చాలా వరకు వైవిధ్యంగానే వుంటాయి. కెరీర్ మొదటి నుంచీ ఇలాగే చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్ సినిమా డెవిల్. ఈ సినిమా టీజర్…

అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంటాడు కానీ కళ్యాణ్ రామ్ ఎంచుకునే కథలు మాత్రం చాలా వరకు వైవిధ్యంగానే వుంటాయి. కెరీర్ మొదటి నుంచీ ఇలాగే చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్ సినిమా డెవిల్. ఈ సినిమా టీజర్ వచ్చేసింది. అభిషేక్ నామా నిర్మించే ఈ సినిమా టీజర్ కచ్చితంగా సినిమా మీద ఓ అంచనా ఏర్పాటు చేసేలా వుంది.

బ్రిటష్ టైమ్ కథ తీసుకున్నారు. అప్పట్లో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్, అతని ప్రియురాలిగా సంయుక్త మీనన్ కనిపించారు. వీరి లవ్ స్టోరీని లైట్ గా టచ్ చేసారు. అంతకు మించి ఓ సీక్రెట్ ఏజెంట్ వ్యవహారాలు, బ్రిటిష్ కాలం నాటి యాంబియన్స్, గెటప్స్ వీటి మీదే దృష్టి పెట్టారు.

టీజర్ కు హర్షవర్దన్ రామేశ్వర్ ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. సౌందర్ ఎస్ రాజన్ విజవల్స్ ను పెర్ ఫెక్ట్ గా అందించారు. సినిమా ఖర్చు విజువల్స్ లో కనిపిస్తోంది. బలమైన డైలాగు ఏదీ టీజర్ లో లేదు. అది చిన్న లోటే. అయితే ఇదేమీ మాస్ మసాలా సినిమా కాదు కనుక అలా జరిగి వుండొచ్చు.

ఈ ఏడాదిలోనే విడుదలయ్యే ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకుడు.