మా అనుభూతి పరిపూర్ణమైంది

కార్తికేయ-2 సినిమాకు జాతీయ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికకాగా, ఈరోజు ఆ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్…

కార్తికేయ-2 సినిమాకు జాతీయ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికకాగా, ఈరోజు ఆ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ అందుకున్నారు.

ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసిన హీరో నిఖిల్.. కార్తికేయ-2 సినిమాకు సంబంధించి తమ అనుభూతి ఈరోజుతో పరిపూర్ణమైందని వెల్లడించాడు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిఖిల్.. కార్తికేయ-2కు సంబంధించి షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఈరోజు షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజు నుంచి నిన్నటివరకు పొందిన అనిర్వచనీయమైన అనుభూతి ఇవాళ్టితో పరిపూర్ణమైందన్నాడు.

“మా యూనిట్ పడిన కష్టానికి ఓ మధురమైన బహుమతి ఇది. ఈ స్క్రిప్ట్ పై మొదటి రోజు నుంచి మాకున్న నమ్మకం, జాతీయ అవార్డు రూపంలో ప్రతిఫలించింది. చలి, వేడి, బురద, వర్షం, ఇసుక.. ఇలా ప్రతి వాతావరణ పరిస్థితిలో ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ప్రతి రోజూ మాకు సవాల్. అన్నింటికంటే కష్టమైన సవాల్, పరిమిత బడ్జెట్ లో క్వాలిటీగా సినిమా తీయడం.”

ఇలా ప్రతి సవాల్ ను అధిగమించి, ఇప్పుడు జాతీయ అవార్డ్ స్థాయికి రావడం ఆనందంగా ఉందన్నాడు. ఈరోజు తనకు జీవితమంతా గుర్తుంటుందని తెలిపాడు.

2 Replies to “మా అనుభూతి పరిపూర్ణమైంది”

Comments are closed.