ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉ. 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయల్ధేరి.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్-1 నివాసానికి చేరకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా, జేపీ నడ్డాలు జగన్ ప్రభుత్వంపై అవినీతి అరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలతో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు అమిత్ షా- చంద్రబాబు నాయుడు ఇప్పటికే పొత్తులపై చర్చలు జరిపారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలకు దారితీసినప్పటికీ, ఈ విషయంలో అంతకుమించి ఎలాంటి చర్చ జరగలేదు. పొత్తుపై చంద్రబాబు మౌనం వహిస్తుండగా, బీజేపీ నేతలు ఆయనపై ఎదురుదాడికి దిగారు. జగన్ సమావేశం తర్వాత బీజేపీ-టీడీపీ పొత్తుపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది.