పవన్ టైటిల్ వాడేస్తున్నారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు ఈ టైటిల్ తో వస్తున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. తొలి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు ఈ టైటిల్ తో వస్తున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. తొలి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో టీవీ షో లు తాను చేసుకుంటూ వచ్చాడు. సరైన కథ దొరకడంతో, సైలంట్ గా సినిమా ఫినిష్ చేసేసాడు. అ సినిమాకే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

జ‌బర్దస్త్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో షో లకు రూపకల్పన చేసిన నితిన్ భరత్ కలిసి ఈ సినిమాను అందిస్తున్నారు. అలాగే జ‌బర్దస్త్ తో వచ్చి, క్రేజీ యాంకర్ అనిపించుకున్న దీపిక పిల్లి ఈ సినిమాలో హీరోయిన్.

టోటల్ గా ఈ సినిమాలో కీలకం జ‌బర్దస్త్ హీరో.. హీరోయిన్.. దర్శకులు అనుకోవాలి. ఓ ఇంజ‌నీర్ పని మీద గ్రామానికి వచ్చి, అక్కడి అమ్మాయితో ప్రేమలో పడడం సినిమాలో మెయిన్ లైన్. దీనికి ట్విస్ట్ లు, టర్న్ లు, ఫన్, ఎమోషన్ అన్నీ పాడింగ్ చేసారు.

వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ కమెడియన్లు నటించారు. సందీప్ కథ మాటలు అందించిన ఈ సినిమాకు రాడాన్ సంగీతం. తొలి సినిమా హీరోగా చేసి నాట్ బ్యాడ్ అనిపించుకున్నాడు. సినిమా కూడా బాగానే అడింది. ఇప్పుడు ఇది రెండో ప్రయత్నం ప్రదీప్ కు.

3 Replies to “పవన్ టైటిల్ వాడేస్తున్నారు”

Comments are closed.