హీరో లేని కీలక సన్నివేశాలు!

ఈ మధ్య టాలీవుడ్ సినిమాల అప్ డేట్‌ల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా టాప్ హీరోలు, భారీ సినిమాల విషయంలో ఈ మాట ఎక్కువగా వాడుతున్నారు. ఫలానా సినిమా షూటింగ్ జ‌రుగుతోంది, హీరో…

ఈ మధ్య టాలీవుడ్ సినిమాల అప్ డేట్‌ల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా టాప్ హీరోలు, భారీ సినిమాల విషయంలో ఈ మాట ఎక్కువగా వాడుతున్నారు. ఫలానా సినిమా షూటింగ్ జ‌రుగుతోంది, హీరో లేని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అంటున్నారు. మరి హీరో వున్న సన్నివేశాలు ఎప్పుడు చిత్రీకరించారో, చిత్రీకరిస్తారో మాత్రం బయటకు రావడం లేదు.

నిజానికి మన పెద్ద హీరోల భారీ సినిమాల్లో హీరో లేని సన్నివేశాలు ఎన్ని వుంటాయి. దాదాపుగా ప్రతి ఫ్రేమ్ లో హీరో కనిపించాల్సిందే కదా. మహా అయితే అయిదో పదో సీన్లు వుంటాయి తప్ప అంతకన్నా ఎక్కువ వుండవు. కానీ ఈ హీరో లేని సీన్లు తీయడం అన్నది కొన్ని సినిమాలకు నిరంతరాయంగా జ‌రుగుతోంది.

ప్రభాస్- మారుతి రాజా సాబ్ కు ఈ హీరో లేని సీన్లు తీయడం అన్నది నిరంతరంగా జ‌రుగుతూనే వుంది. కొన్ని రోజుల క్రితం పవన్ హరి హర వీరమల్లు సినిమాకు ఇదే మాట వినిపించింది. పవన్ మరో సినిమా ఓజీ కి ఇప్పుడు అదే మాట వినిపిస్తోంది. ఇలా చేయడం వెనుక ఏదో సమ్ థింగ్.. సమ్ థింగ్.. అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల విఎఫ్ఎక్స్ వర్క్ పెరిగింది. బాడీ డబుల్స్ అనే మాట పెరిగింది. షూటింగ్ లకు ఎక్కువగా టైమ్ కేటాయించలేని హీరోల సినిమాలకు బాడీ డబుల్స్ ను వాడుతున్నారనే గ్యాసిప్ లు వున్నాయి. ఇది ఎలా అంటే, హీరో క్లోజ‌ప్ షాట్ లు మాత్రం తీసుకుని, మిగిలిన లాంగ్, మిడ్ షాట్ లు అన్నీ బాడీ డబుల్స్ తో కానిచ్చి, మిక్స్ చేసుకోవడం.

ఇలా చేయడం ఎందుకంటే హీరోలు బిజీగా వుండడం, డేట్ లు దొరక్కపోవడం మాత్రమే కాదు. ఇలా చేసే దర్శకులను హీరోలు మెచ్చుకుంటారు కూడా. తమకు శ్రమ తగ్గిస్తున్నందుకు. మరి అందులో భాగగానే ఈ ‘హీరో లేని సన్నివేళాలు’ అనే మాట వినిపిస్తోందా? లేక నిజంగానే సినిమాల్లో అన్ని సన్నివేశాలు హీరో లేకుండా వుంటాయా? రాజా సాబ్, ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు తెరమీదకు వచ్చాక కానీ తెలియదు.

11 Replies to “హీరో లేని కీలక సన్నివేశాలు!”

    1. నార్త్ నుంచి వచ్చే ఆ కొత్త గుమ్మలు, అసలు BODY DOUBLE ఏ హీరో అనుకున్నారేమో! లేకపోతె DOWN TO EARTH ETC సూట్ కావు ఓన్లీ superlative డిగ్రీస్ సూట్ అవుతాయి మన ఒరిజినల్ హీరోస్ కి

Comments are closed.