కొండా దూకుడు పార్టీకి చేటు చేస్తుందా?

బయటి వాళ్లతో తగాదా పెట్టుకుంటే పార్టీ వాళ్లు అండగా ఉంటారు. పార్టీ వాళ్లతో తగాదా పెట్టుకుంటే సొంత ముఠా, సొంత అనుచరవర్గం మాత్రమే అండగా ఉంటారు. ఆ తర్వాత మళ్లీ బయటివాళ్లతో గొడవ వస్తే…

బయటి వాళ్లతో తగాదా పెట్టుకుంటే పార్టీ వాళ్లు అండగా ఉంటారు. పార్టీ వాళ్లతో తగాదా పెట్టుకుంటే సొంత ముఠా, సొంత అనుచరవర్గం మాత్రమే అండగా ఉంటారు. ఆ తర్వాత మళ్లీ బయటివాళ్లతో గొడవ వస్తే ఎవరు అండగా ఉంటారు? ఈ సింపుల్ లాజిక్ ను తెలంగాణ మంత్రి కొండా సురేఖ మర్చిపోతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యలతో కూడా ఆమె సున్నం పెట్టుకుంటున్నారు. ఆమె దూకుడు, ఆమె వ్యవహార సరళి పార్టీకి చేటు చేస్తున్నాయనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.

కొండా సురేఖ దూకుడైన మాట తీరుకు పెట్టింది పేరు. ఆమె తిడితే చాలా దారుణంగా ఉంటుందని తిట్టించుకున్న వాళ్లు అంటుంటారు. మొన్నటికి మొన్న కేటీఆర్ ను తిట్టడం కోసం.. ఇంకా ఎంతమందిని ఆమె బజారుకీడ్చిందో అందరూ గమనించారు.

తన మీద జరిగిన ట్రోలింగుకు సంబంధించి కేటీఆర్ మీద కోపం ఉంటే ఆయనను నిందించవచ్చు, సినిమా పరిశ్రమలోని ఎంతోమందిని బజారుకీడ్చారు. తన వ్యాఖ్యలు ఎంత హేయంగా ఉన్నాయో అర్థమయ్యాక సారీ కూడా చెప్పారు. ఇప్పుడు కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ రకమైన దూకుడు మాత్రమే కాదు. తన సొంత జిల్లాలో ఇతర సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు కూడా కునుకులేని పరిస్థితిని సృష్టిస్తూ కొండా సురేఖ వివాదాస్పదం అవుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తమ్మీద పెత్తనం చేయాలని అనుకోవడం వరకు ఓకే.. తన చేతిలో మంత్రి పదవి ఉన్నది గనుక.. తాను అందరికంటె పెద్ద నాయకురాలిగా గుర్తింపు కావాలని ఆమె కోరుకోవచ్చు. కానీ ఇతర నియోజకవర్గాల్లో లోకల్ గా తమ పార్టీ ఎమ్మెల్యేల అస్తిత్వానికే భంగం వాటిల్లేలా వ్యవహరిస్తే మాత్రం అది పార్టీకి నష్టమే. ఈ పోకడల మీదనే.. ఆ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మాజీ మేయరు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు హైదరాబాదులో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి మోర పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

వాళ్లకు సమాచారమే లేకుండా వాళ్ల నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాదు, కనీసం అక్కడ ఫ్లెక్సిల్లో లోకల్ ఎమ్మెల్యేల ఫోటో కూడా లేకుండా చేయడం.. కొండా సురేఖ ఒంటెత్తు పోకడలకు నిదర్శనంగానే ఉంటోంది. అయితే కార్యకర్తల అత్యుత్సాహం కారణంగానే ఇలాంటి పరిస్థితులు వస్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేల ఫోటో లేకుండా ఫ్లెక్సిలు లాంటివి కార్యకర్తల అత్యుత్సాహం అనేది ఆయన ఉద్దేశం.

కానీ.. ‘సేన చెడుగైన దండనాధుని తప్పు’ అనే నీతి ఆయనకు తెలుసో లేదో! కార్యకర్తలు ఇలా ప్రవర్తిస్తున్నారంటే.. ఆ లోపం వారి నాయకురాలైన కొండా సురేఖలో తప్పకుండా ఉంటుంది. కొండా సురేఖ ఒక్కసారైనా.. లోకల్ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోయినా, ఆయన రాకపోయినా, ఫ్లెక్సిలో ఆయన ఫోటో లేకపోయినా తాను రానేరాను అని చెబితే.. ఇలాంటి పార్టీకి చేటు చేసే పరిణామాలు జరగవు కదా.. అనేది పలువురి అభిప్రాయంగా ఉంటోంది.

5 Replies to “కొండా దూకుడు పార్టీకి చేటు చేస్తుందా?”

    1. అవినీతి మరియు అసభ్య రాజకీయాలు: బోరుగడ్డ అనిల్ అరెస్టుతో ప్రజల సమాధానం స్పష్టమైంది

      బోరుగడ్డ అనిల్ ఈరోజు అరెస్టు కావడం, ప్రజలు జగన్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. అనిల్ వంటి వ్యక్తుల వల్లే పార్టీకి ప్రతిష్టహాని కలుగుతోంది. ఆయన అసభ్యమైన, తిడుతూ మాట్లాడే భాష ప్రజల నమ్మకాన్ని దూరం చేస్తుంది. జగన్‌ను నిజంగా మద్దతు ఇస్తున్నారా? అయితే, బోరుగడ్డ అనిల్ లాంటి వారిని అనుసరించకండి. ఆయన ఏ స్థితికి చేరుకున్నాడో, జగన్ నాయకత్వం కూడా ఇలాంటి నెగటివ్ వ్యక్తుల వల్ల ఇబ్బందుల్లో పడుతోంది.

      రాజకీయాల్లో అసభ్యమైన భాషకు అవసరం ఏమిటి? సంస్కారం, మర్యాదతో మాట్లాడటం ప్రజల గౌరవాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనది. అనిల్ పరిస్థితి ప్రతి ఒక్కరికీ పాఠం కావాలి—అసభ్యమైన ప్రవర్తన, జలగట్టు భాష మనిషిని కేవలం కష్టాల్లోకి తీసుకెళ్లడం తప్ప, గౌరవం తీసుకురాదు.

Comments are closed.