బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. దీంతో వాయుగండం గడిచినట్టే అని ప్రజానీకం ఊపిరి పీల్చుకుంటోంది. తుపాను ప్రభావంతో రెండుమూడు రోజులుగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అయితే అవసరం మేరకు మాత్రం వర్షం కురవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా వుండగా తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికతో జనం ఆందోళన చెందారు.
అయితే అలాంటిదేమీ జరగలేదు. తిరుపతి జిల్లాలోని తడ వద్ద వాయుగుండం ఇవాళ తెల్లవారుజామున తీరం దాటింది. అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడినట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా వుండగా బుధవారం మధ్యాహ్నం నుంచే వర్షం కురవడం లేదు.
తీరం దాటే సందర్భంలో భారీ వర్షం పడుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకపోవడం, మబ్బులు క్రమంగా కనిపించకుండా పోతుండడంతో ఇక వర్షానికి భయపడాల్సిన పనిలేదనే మాట వినిపిస్తోంది. ఈ సమయంలో వర్షం రైతాంగానికి చాలా ఉపయోగం.
శనగ, మినుము తదితర మెట్ట పంటల సాగుకు తుపాను అదునులో పదును చేసిందని రైతులు సంతోషిస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే విజయవాడ వరద ఎఫెక్ట్‌తో ప్రభుత్వ యంత్రాంగం ముందే మేల్కొని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది.
AP high court better realize authenticity of these weather reports . Once in hundred predictions become true
అయ్యయ్యో వాన దేవుడు కూడా పార్టీ మార్చేసాడా????
భారీ వర్షాలు కురిసి ఆస్థి అండ్ ప్రాణ నష్టం జరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, బాబు బురదలో దిగి కష్టపడుతుంటే చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇదేంద్రా మన అనుకున్న వాన దేవుడు కూడా ఇలా మోసం చేసాడు??
– బంకర్ రెడ్డి
అవినీతి మరియు అసభ్య రాజకీయాలు: బోరుగడ్డ అనిల్ అరెస్టుతో ప్రజల సమాధానం స్పష్టమైంది
బోరుగడ్డ అనిల్ ఈరోజు అరెస్టు కావడం, ప్రజలు జగన్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. అనిల్ వంటి వ్యక్తుల వల్లే పార్టీకి ప్రతిష్టహాని కలుగుతోంది. ఆయన అసభ్యమైన, తిడుతూ మాట్లాడే భాష ప్రజల నమ్మకాన్ని దూరం చేస్తుంది. జగన్‌ను నిజంగా మద్దతు ఇస్తున్నారా? అయితే, బోరుగడ్డ అనిల్ లాంటి వారిని అనుసరించకండి. ఆయన ఏ స్థితికి చేరుకున్నాడో, జగన్ నాయకత్వం కూడా ఇలాంటి నెగటివ్ వ్యక్తుల వల్ల ఇబ్బందుల్లో పడుతోంది.
రాజకీయాల్లో అసభ్యమైన భాషకు అవసరం ఏమిటి? సంస్కారం, మర్యాదతో మాట్లాడటం ప్రజల గౌరవాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనది. అనిల్ పరిస్థితి ప్రతి ఒక్కరికీ పాఠం కావాలి—అసభ్యమైన ప్రవర్తన, జలగట్టు భాష మనిషిని కేవలం కష్టాల్లోకి తీసుకెళ్లడం తప్ప, గౌరవం తీసుకురాదు.