సేఫ్టీ జోన్ నుంచి బయటకు ‘వెంకీ’

దర్శకుడు వెంకీ అట్లూరి కి ఒక సేఫ్ జోన్ వుంది. లవ్.. ఫన్.. రొమాంటిక్ జోన్ అది. వెంకీ అట్లూరి డైలాగులు రాసినా, సినిమాలు చేసినా ఇప్పటి వరకు అదే జానర్. తొలిప్రేమ మంచి…

దర్శకుడు వెంకీ అట్లూరి కి ఒక సేఫ్ జోన్ వుంది. లవ్.. ఫన్.. రొమాంటిక్ జోన్ అది. వెంకీ అట్లూరి డైలాగులు రాసినా, సినిమాలు చేసినా ఇప్పటి వరకు అదే జానర్. తొలిప్రేమ మంచి హిట్. టైటిల్ నే చెబుతోంది ఏ తరహా సినిమా అన్నది. మజ్ఞు రెండో సినిమా, బాగానే వున్నట్లు అనిపించినా, అంతగా అడని సినిమా. అది కూడా టైటిల్ చూస్తేనే తెలుస్తుంది ఏ రకం సినిమా అన్నది.

ముచ్చటగా మూడో సినిమా రంగ్ దే. ఇది కూడా ఫన్, లవ్ జానర్ సినిమానే. కానీ ఎక్కడో చిన్న మిస్ ఫైర్. పూర్తిగా సంతృప్తినివ్వలేదు. అ తరువాత వచ్చిన సినిమా సర్. ఈ సినిమాతో వెంకీ అట్లూరి తన సేఫ్టీ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చే ప్రయత్నం చేసారు. ధనుష్ హీరో కనుక అలా వచ్చినా సరిపోయింది. అంతకు ముందు రెండు సినిమాలకు వెంకీ అట్లూరికి హీరోల వైపు నుంచి పుల్లింగ్ లేదు. సర్ సినిమాకు అ సమస్య తీరింది, జానర్ కు తగినట్లు ధనుష్ హీరోగా జాయిన్ కావడంతో ఓకె అయిపోయింది.

అదే ధైర్యంతో ఇప్పుడు మళ్లీ పూర్తిగ తన సేఫ్టీ జానర్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ అండర్ డాగ్ స్టోరీ నుంచి తన స్టయిల్ లో చెప్పబోతున్నారు. స్టాక్ మార్కెట్ లో ఎనభయ్యవ దశకంలో జ‌రిగిన కుంభకోణం నేపథ్యంలో జ‌రిగే కథ. ఓ ఫ్యామిలీమన్ చిన్నగా స్టార్ట్ చేసి, ఎత్తు పల్లాలు రెండూ చూసి, స్టాక్ మార్కెట్ లో ఎలా సక్సెస్ అయ్యాడు అన్నది స్థూలంగా కథ. దీనికి హస్పెండ్- వైఫ్ లవ్, ఎమోషన్లు జోడించారు.

ఇక్కడ కూడా వెంకీ అట్లూరి అదృష్టం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ హీరోగా రావడం. చాలా వరకు జ‌నాలు ప్రీ మైండ్ తో సినిమాకు రారు. వచ్చిన తరువాత దుల్కర్ ఏం చేసినా నచ్చుతుంది. కానీ అలా అని దుల్కర్ మరీ మాసీ గా చేసినా నచ్చదు, కాస్త క్లాస్ టచ్ వుండాల్సిందే. వెంకీ అట్లూరిది కూడా అదే స్టయిల్.

ఈ సినిమా కు పూర్తిగా జ‌నాలకు చేరువైతే ఇక వెంకీ అట్లూరి కథలు రాసుకోవడానికి చాలా పెద్ద ఎరీనా దొరుకుతుంది.

5 Replies to “సేఫ్టీ జోన్ నుంచి బయటకు ‘వెంకీ’”

Comments are closed.