మ‌త్తు వ‌దులు జ‌గ‌న్‌!

రాజ‌కీయం అబ‌ద్ధం చెప్పినా, గ‌ణితం అబ‌ద్ధం చెప్ప‌దు. జ‌గ‌న్‌కి అర్జెంట్‌గా ట్యూష‌న్ మాస్ట‌ర్ కావాలి.

ఈ దీపావ‌ళి ఒక “పీపా”వ‌ళి. బుడ‌మేరు గేట్లు ఎత్తిన‌ట్లు చంద్ర‌బాబు మందు గేట్లు ఎత్తాడు. బ్రాండ్లు, ప‌ర్మిట్ రూంలు, బెల్ట్‌షాప్‌లు, తాగి వూగే జ‌నాల‌కి మూడు పెగ్గులు, ఆరు క్వార్ట‌ర్లు. దేవ‌త‌ల కాలం నుంచి వున్న ఈ సుర జోలికి మ‌నుషులు పోరాదు. తాగ‌డం వ‌ల్లే వాళ్లు దేవ‌త‌ల‌య్యారు. తాగ‌డం స‌రిగా తెలియ‌ని వాళ్ల‌ని రాక్ష‌సులన్నారు.

మాన‌వ ప‌రిణామక్ర‌మ‌మంతా మందు షాప్ ద‌గ్గ‌రే వుంది. డార్విన్ అన‌వ‌స‌రంగా ఎక్కువ ప‌రిశోధించాడు. కోతి నుంచి మ‌నిషి పుట్టాడ‌నేది సిద్ధాంతం. మ‌నిషి నుంచి ర‌క‌ర‌కాల జంతువులు, స‌రీసృపాలు ఉద్భ‌వించ‌డం వాస్త‌వ‌మ‌ని నిరూపించేదే వైన్‌షాప్‌. పులిలా, కుక్క‌లా, పాకుడు జంతువులా గుట‌క గుట‌క‌కి మారుతూ చివ‌రికి ఒక సొర చేప‌లా నేల‌మీద ఈదుతూ ఇల్లు చేర‌డ‌మే తాగుబోతు అంతిమ ల‌క్ష్యం. త‌లుపు త‌ట్టిన ప్ర‌తిదీ త‌న గృహం కాక‌పోవ‌చ్చు. అక్క‌డ శుద్ధి జ‌రిగినా జ‌ర‌గొచ్చు.

జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే ఎవ‌రి జోలికి వెళ్ల‌కూడ‌దో తెలియ‌క‌పోవ‌డం. ఎవ‌డు క‌న్ను తెరిస్తే రాజ‌కీయాలు మారిపోతాయో వాడి కంటికే కునుకు లేకుండా చేయ‌డం. ప్ర‌భుత్వాలు ఏ ప‌నీ స‌వ్యంగా చేయ‌లేవ‌నే జ్ఞానం ద‌శాబ్దాలుగా వెంటాడుతున్న‌ప్ప‌టికీ లెక్క చేయ‌కుండా మ‌ద్యాన్ని త‌ల‌కెత్తుకున్నాడు. మురికిప‌ట్టిన దుకాణాల్లో, పొగ‌రు ప‌ట్టిన సిబ్బందితో అమ్మించాడు. అయినా భ‌రించారు. కోరిన బ్రాండ్‌లేదు, ఇచ్చిందే తాగ‌మ‌న్నారు. భ‌రించారు. ప‌ర్మిట్ రూంలు లేవు, రోడ్డు మీద తాగితే పోలీసుల‌తో త‌న్నించారు. జ‌గ‌న్‌ని కోరి తెచ్చుకున్నారు కాబ‌ట్టి భ‌రించారు. రేట్లు పెంచారు, బార్డ‌ర్ల‌లో బ‌ట్ట‌లిప్పి చెక్ చేసారు. అవ‌మానాన్ని భ‌రించారు. ఎందుకంటే మెల్లిగా జ‌గ‌న్ మార‌తాడ‌ని ఆశించారు. మార్పు అనేది జ‌గ‌న్ డిక్ష‌న‌రీలోనే లేదు. మార్పు అంటే ఆయ‌న దృష్టిలో చంద్ర‌బాబు నుంచి అధికారం మారి, తాను ముఖ్య‌మంత్రి కావ‌డ‌మే.

జ‌గ‌న్ ఏదో చేస్తాడ‌నే మ‌త్తు, తాగ‌ని వాళ్ల‌కి కూడా దిగిపోయింది. తాగుబోతులు ర‌హ‌స్య స‌మావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ర‌మ్ము తాగేవాడు పాము కంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ప‌గ‌బ‌ట్టారు. కింగ్‌ఫిష‌ర్ లేకుండా చేసి బూంబూం తాగించిన జ‌గ‌న్‌కి సినిమా చూపించాల‌ని అనుకున్నారు. కిక్కు ఎక్కువైన క‌క్క‌వ‌లెను… ఇది మందు శాస్త్రంలోని తొలిపాఠం. కిక్కే ఎక్క‌క‌పోతే ఏం చేయాలి? క‌క్క‌లేక మింగ‌లేక ప‌డి వుండాలి.

ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి. జ‌గ‌న్‌కి రివ‌ర్స్ బ‌ట‌న్ నొక్కిన వాళ్ల‌లో తాగుబోతులు ప్ర‌ముఖులు. మంచిగా పాలించ‌మ‌ని ఐదేళ్లు ప‌గ్గాలిస్తే , తాగుబోతుల మూతికి చిక్కం క‌ట్టే ప‌ని నీకెందుక‌య్యా జ‌గ‌న్‌? మ‌ద్యం జోలికి పోతే మ‌సై పోతావ‌ని బాబుకి తెలియ‌ద‌నుకున్నావా? ఎన్టీఆర్ విధించిన మ‌ద్య‌నిషేధాన్ని ఎత్తేసి, రాష్ట్రాన్ని లిక్క‌ర్ సిండికేట్ చేసింది ప్ర‌జ‌ల కోస‌మే.

ప్ర‌జ‌లు మ‌త్తులోనూ, భ్రాంతిలోనూ, అర‌నిద్ర‌లోనూ వుంట‌నే పాలన స‌వ్యంగా సాగేది. క‌ళ్లు తెరిచి అన్ని చూస్తే తాను ఒక్క‌రోజు కూడా పాలించ‌లేన‌ని చంద్ర‌బాబుకి తెలుసు.

రాజ‌కీయ వార‌స‌త్వం ఇచ్చిన వైఎస్ నుంచి జ‌గ‌న్ ఏమీ నేర్చుకోలేదు. క‌నీసం రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబుని చూసైనా నేర్చుకోవాలి క‌దా! అదీ లేదు. ఎంత‌సేపూ నేను అబ‌ద్ధాలు చెప్ప‌లేను అని అరిగిపోయిన రికార్డ్‌. అస‌లు అదే పెద్ద అబ‌ద్ధం కాదా?

జ‌గ‌న్ చెప్పిన 3 అబ‌ద్ధాలు అశోకుడి సింహాల్లా కంటికి క‌నిపిస్తూనే వున్నాయి.

1.మెగా డీఎస్సీ

2.సీపీఎస్ ర‌ద్దు

3.ద‌శ‌లవారీగా మ‌ద్య నిషేధం

తాగితే తెల్లారేస‌రికి దిగిపోతుంది. చిత్త‌భ్రాంతికి గుర‌యితే అంత సుల‌భంగా దిగ‌దు. తాను మార‌కుండా , పార్టీ నిర్మాణాన్ని మార్చ‌కుండా All is right అంటే కుద‌ర‌దు. మ‌న దేశంలో లెప్ట్‌లో ప్ర‌యాణించ‌డ‌మే రూల్‌.

చంద్ర‌బాబు వైఫ‌ల్యాల మీద ఎవ‌రో రాసి ఇచ్చిన ఉప‌న్యాసాలు చ‌దువుతుంటే మీ కోరికే నెర‌వేరుతుంది. శాశ్వ‌తంగా ప్ర‌తిప‌క్షంలోనే వుంటారు. కాక‌పోతే 11 అనే నెంబ‌ర్ మారొచ్చు. త‌క్కువా ఎక్కువా చెప్ప‌లేం. మీకు గుణింతాల కంటే భాగ‌హారం అంటేనే మ‌క్కువ‌.

రాజ‌కీయం అబ‌ద్ధం చెప్పినా, గ‌ణితం అబ‌ద్ధం చెప్ప‌దు. జ‌గ‌న్‌కి అర్జెంట్‌గా ట్యూష‌న్ మాస్ట‌ర్ కావాలి. అయినా బెత్తం ప‌ట్టుకున్న విద్యార్థికి అయ్య‌వార్లు పాఠాలు చెప్ప‌గ‌ల‌రా?

52 Replies to “మ‌త్తు వ‌దులు జ‌గ‌న్‌!”

  1. సీబీఎన్ సూర్యుడు, రోజూ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతారు. కెసిఆర్, జగన లు ఆ సూరీడుని మాయం చేసే గ్రహణాలు, అతి తక్కువ కాలంలో ప్రజల జీవితాల్లో చీకటి నింపి మాయం అయిపోతారు. ఆంధ్ర కు పట్టిన గ్రహణాలు ఇక మాయం అయిపోయాయి, ఇక అన్నీ వెలుగులే.

  2. ఈ ఆర్టికల్ రివ్యూ చేసే పబ్లిష్ చేసాడా GA?? నమ్మశక్యంగా లేదు….

    పొరపాటున నిజాలు రాసేసాడేమో అనిపిస్తోంది..

    ఏదైనా, ఇన్నాళ్ళకి, తప్పుని తప్పుగాను, బూతుని బూతు గాను విమర్శించినందుకు, ( మారినందుకు) ధన్యవాదాలు

  3. ఈ ఆర్టికల్ రివ్యూ చేసే పబ్లిష్ చేసాడా GA?? నమ్మశక్యంగా లేదు….

    పొరపాటున నిజాలు రాసేసాడేమో అనిపిస్తోంది..

    ఏదైనా, ఇన్నాళ్ళకి, తప్పుని తప్పుగాను, బూతుని బూతు గాను విమర్శించినందుకు, ( మారినందుకు) ధన్యవాదాలు

  4. ఈ ఆర్టికల్ రివ్యూ చేసే పబ్లిష్ చేసాడా GA?? నమ్మశక్యంగా లేదు….

    పొరపాటున నిజాలు రాసేసాడేమో అనిపిస్తోంది..

    ఏదైనా, ఇన్నాళ్ళకి, తప్పుని తప్పుగాను, బూతుని బూతు గాను విమర్శించినందుకు, ( మారినందుకు) ధన్యవాదాలు

  5. ఈ ఆర్టికల్ రివ్యూ చేసే పబ్లిష్ చేసాడా GA?? నమ్మశక్యంగా లేదు.

    పొరపాటున నిజాలు రాసేసాడేమో అనిపిస్తోంది..

    ఏదైనా, ఇన్నాళ్ళకి, తప్పుని తప్పుగాను, బూతుని బూతు గాను విమర్శించినందుకు, ( మారినందుకు) ధన్యవాదాలు

  6. ఓ పక్క మెషిన్ ల వల్ల ఓడిపోయాం అంటారు, ఇంకో పక్క ఇలాంటి నిజాలు రాసి ఇలాంటి జగన్ కి ఓటు వేసేదెవడు అని కూడా మీరే రాస్తారు!

  7. 3 సింహాల కథ చెప్పి 4 వ సింహం ఎవరో పాఠకుల ఊహకే వదిలేస్తూ, మరలా సూచనప్రాయంగా శతకోటి సద్గుణాలు అంటూ ఆ 4 వ సింహం గురించి వర్ణనలు.

  8. 3 సింహాల కథ చెప్పి 4 వ సింహం ఎవరో పాఠకుల ఊహకే వదిలేస్తూ, మరలా సూచనప్రాయంగా శతకోటి సద్గుణాలు అంటూ ఆ 4 వ సింహం గురించి వర్ణనలు.

    లేదా ఆగడు సినిమాస్ గుర్తుతెచ్చుకొని సోనూసూద్ తనను తాను శిక్షించుకున్నట్లు శిక్షించుకోమనా?

  9. Oka nimisham title chusi idi great andhra ne na ani doubt vachi chadivanu…Chadivaka telisindi enti ante idi GA ne vedu inka maradu asalu alanti oka angle ledemo anipisthundi

  10. మనిషి అనేవాడు ఎవడు జగన్ నీ ఇంకా నమ్మడు.నువ్వు సినిమా గాసిప్పులు రాసుకోర ఇంక, కనీసం నువ్వైనా బాగుపడతవ్

  11. అంత అమాయకుడు కాదు ప్రభుత్వమే అమ్మిర్ణి లిక్కర్ .ధర డబుల్. ఏమయినా అంటే మీ కోసమే అన్నాడు. అన్ని డిస్తృష్టలరీస్ ని ఆక్రమించాడు లెక్క డొక్కా లేని ఆదాయం. బిల్ బుక్ ఉండదు సెల్ లెక్క ఉండదు డిజిటల్ పేమెంట్ ఉండదు ప్యూర్ కేశ్. ఇప్పుడు జెప్పు అయిదేళ్లలో ఎంత దోపిడీ అయిందో . అంత అమాయకుడు కాదు

  12. ప్రభుత్వం మే అమ్మింది . నచ్చిన ధరలు డిస్టీఆల్రీస్ అన్ని కొనేశాడు లేదా ఆకర్మించాడు. మంచి barnad లు లేకుండా స్వంత వి అమ్మారు .సెల్ లెక్క ఉండదు బిల్ బుక్ ఉండదు tax ఉండదు ఎంత వచ్చి అలుంటుంది లెక్క వే

  13. ఇప్పుడు ఈ పొటుగాడు అదికారం లొకి వచ్చి పికెదెముంది …పరదాలలొ పర్యటనలు తప్పా ?

    నువ్వొద్దుసామి

  14. అరే వెంకట్ రెడ్డి..

    ప్రజల్ని మత్తులో ఉంచితేనే పరిపాలన సాగించగలమని చంద్రబాబు కి తెలుసా..

    మరి.. అందుకేనా.. మధ్య నిషేధం అని చెప్పి.. కల్తీ మందు కి గేట్లు ఎత్తేసాడు జగన్ రెడ్డి..

    వాడు చేసింది కూడా ప్రజలని మత్తులో ఉంచే పరిపాలన చేసాడు..

    పైగా.. ఆ ఆదాయాన్ని సంక్షేమానికి వాడుకొంటున్నాను అని నిస్సిగ్గుగా చెప్పుకొన్నాడు..

    అదే ఆదాయాన్ని.. రాష్ట్ర ఖజానా ని నింపే వనరు గా చెప్పుకొన్నాడు..

    1. మీరు ఎన్ని తిట్టినా మీ కామెంట్ కు డిలీట్ చెయ్య డు. .అలానే మేము ఎంత నీట్ గా రాసిన మా కామెంట్ లు పోతున్నాయి .మీరు ఎనకటి కి బంధువేమో అని మాకు డౌట్ అనుమానం

  15. Babu GA నాసిరకం బ్రాండ్స్ రేట్స్ పెంచి గంజాయి వినియోగం పెరగడానికి కారణం అయ్యాడు మీ జగన్. ఇది నిజం. చాలా తప్పు చేశాడు. మళ్ళి నీతులు చెప్పకు

    1. అన్నాయి అన్ని ఇంటర్నేషనల్ డ్రగ్స్ వాడతారు. ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటాడు అని అంటారు.

  16. నోరా అశుద్దాల పుట్టా?

    మొన్నటి వరకు EVM టాంపరింగ్ అన్నావు కదా? ఇప్పుడు ఒక్కో వర్గం ఎలా దూరం అయ్యిందో రాస్తున్నావు. బహుశా ప్రభుత్వ ప్రకటనలు రావనా??

  17. ఈ వెకిలి వెధవకి బురద చల్లటం తప్ప వాడి అడ్మినిస్ట్రేషన్ లో ఏమీ జరిగిందో కూడా వాడికి తెలియదు శుంఠ కి !! ఈ క్రిమినల్ గాడిదను బొక్కా లో వేస్తేకాని ఆంధ్ర ప్రశాంతంగా ఉండదు!!

  18. ఏంటీ తాగుబోతులు కూడా జెగ్గులు గాడికి రివర్స్ బటన్ నొక్కి ఓడించారా?? మరి ఆడేమో ‘EVM లు ఓడించాయి అంటున్నాడు??

    ఇంతకీ ఏది రైట్??

  19. jaggu says in sakshi – “in our ruling, govt got more liquor revenue and this govt is trying to loot that”..

    its amazing how easily che ddi accuses others of what they plan or were doing…same strategy…i think thats how they became successfully in faction politics…keep your opponents busy with fake allegations..

    1. అన్నాయి అన్ని ఇంటర్నేషనల్ డ్రగ్స్ వాడతారు. ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటాడు అని అంటారు.

  20. వాడికి వున్నది నేనే గొప్పొడిని, మిగతా జనాలు అంత నా బానిసలు అనే విపరీత ఆలోచన.

    అది వున్నోడిని ఇప్పటికీ జాకీ లు వేసి గ్రేట్ ఆంద్ర లేపడానికి ట్రై చేస్తుంది అంటే , జగన్ కింద కట్టు బానిస బతుకు కి వెనకటి రెడ్డి ఇష్టం అనుకుంటా.

    1. అరె……L….K……నువ్వు …., నీ… పేరుతో …… ధైర్యముగా …….. కామెంట్…,..చేస్తావో చెప్పారా …చేతకాని చేవలేని…….K…..L…..KO……. కా

  21. హహహ. ….బహు బాగా రాసినారు.అసలు వాడు సీఎం మెటీరియల్ నే కాదు.. మహా మే..త..గాడు సీఎం కాక ముందు వరకు ఈడు అసలు ఎక్కడుండే వాడో..ఎం చదు వుకున్నాడో.. ఎక్కడ పెరిగాడో..ఎవడి పెంపకామో..అసలు ఈడికి తెలుగు సాంప్రదాయ లు..సంస్కృతి.. చరిత్ర..ఏమన్నా తెల్సారా..ఈడికి ఎలారా ఓట్లు ఏశారు.. ప్రతీ ఉద్యోగం లో అనుభవం చూస్తారు కదారా..ఈ ల…కొడుకు విషయంలో ఎందుకు మోసపోయామో …5 ఏళ్ళు పుణ్య కాలం ..హారతి కర్పూరం అయ్యింది.

  22. లఫుట్ లా ఉంది నీ విశ్లేషణ. . EVM లు తొ గెలిసినోడు కామెంట్, సింగల్ గా పోటీ చేయలేనివాడు జగన్ కి కామెంట్, , vp లు. . విద్య ఆంధ్ర ని మధ్యంధ్రప్రదేశ్ చేసాడు బొల్లిగాడు. . వెయిట్ and c

  23. జగన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు , రాజశేఖర రెడ్డి గారు పరువుతీసేసాడు , కోటరీ అంతా నీచులుతోనే నిండిపోయింది , నమ్మిన వాళ్లను నట్టేటిలో ముంచేసాడు డబ్బు సంపాదించుకోవాలనుకుంటే వ్యాపారం చేసుకోవాలి సిగ్గులేకుండా ఛీప్ గా ఛీప్ లిక్కర్ వ్యాపారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి అయినట్టున్నాడు

Comments are closed.