మద్యపాన రహిత ఏపీని చేయలేరా?

ఏపీలో గంజాయిని నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. గంజాయి వల్లనే లా అండ్ ఆర్డర్ బాగా ఉండడం లేదని అన్నారు. గంజాయి సేవించిన వారికి విచక్షణ తెలియదు అని కూడా…

ఏపీలో గంజాయిని నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. గంజాయి వల్లనే లా అండ్ ఆర్డర్ బాగా ఉండడం లేదని అన్నారు. గంజాయి సేవించిన వారికి విచక్షణ తెలియదు అని కూడా ఆయన అన్నారు. అనేక రకాలైన నేరాలు పెరగడానికి గంజాయి ప్రధాన కారణం అని ఆయన అంటున్నారు. అందుకే ప్రభుత్వం గంజాయి ని నిరోధించడానికి చూస్తోందని దాని కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.

గంజాయి విషయంలో మంత్రి చెప్పినది నూరు శాతం నిజమే. గంజాయి మాదక ద్రవ్యం దానిని నియంత్రించాలి, వీలు అయితే నిర్మూలించాలి. అదే విధంగా మద్యపానం కూడా ఉంటుంది కదా. మద్యం తాగిన వారికి కూడా విచక్షణ తెలియదు, వారు కూడా ఏమి చేస్తున్నారో స్పృహలో ఉండరు. లా అండ్ ఆర్డర్ దాని వల్ల కూడా దెబ్బ తింటుంది కదా. అయితే ప్రభుత్వం నూతన మద్యం పాలసీని గొప్పగా చెప్పుకుంటోంది. నాణ్యమైన మద్యాన్ని 99 రూపాయలకే తాము ఇస్తున్నామని చెబుతోంది.

గతంలో ఎక్కువ ధరకు నాసిరకం మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం అమ్మిందని దాని వల్ల అనారోగ్యం పాలు అయ్యారు అని కూడా అంటున్నారు. మద్యం నాసిరకం అయితే తొందరగా పోతారు, నాణ్యతతో కూడినది అయితే లేటుగా పోతారు. అనారోగ్యం రావడం మాత్రం రెండింటి వల్లా జరిగేదే.

జనాల మీద వారి ఆరోగ్యం మీద ప్రేమ ఉంటే మద్యాన్ని కూడా నిరోధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మద్యం అంటే అది వ్యసనమే. అది ఆరోగ్యానికి హానికరమే. మంచి మద్యం చెడు మద్యం అన్నవి ఉండవని ప్రజా సంఘాల నేతలు కూడా అంటున్నారు.

గంజాయి విషయంలో ప్రభుత్వాలు చూపిస్తున్న శ్రద్ధ లిక్క‌ర్ విషయంలోనూ చూపిస్తే ఈ రోజుకు కాకపోయినా ఏదో నాటికి మద్య రహిత ఆంధ్రను చూడగలం, ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వమే చొరవ తీసుకుంటే బాగుంటుంది కదా అన్నదే జనాల నుంచి వస్తున్న సలహా, సూచన.

21 Replies to “మద్యపాన రహిత ఏపీని చేయలేరా?”

  1. నిషేధం చేస్తా అని కూసిన మనోడు ఏమి చేసాడు?? సొంత బట్టీలు పెట్టి 10 రూపాయల పిచ్చి మందుని 100 రూ క్యాష్ కి అమ్మి, వేల కోట్లు అక్రమంగా పోగేసాడు..

    డబ్బిచ్చినా కావాల్సింది దొరక్క, విదిలేక అదే తాగి యంగ్ స్టర్స్ అందరూ లివర్ అండ్ pancreas దెబ్బతిని జీవచ్చావాలుగా బతుకుతున్నారు.

    ఎన్నికల్లో “గురి చూసి ‘గుద్ద దె0గి” జగన్ రెడ్డి ని కాస్త లెవెన్ రెడ్డి ని చేశారు

  2. నిషేధం చెస్తా అన్నోడే మోసం చేసి, J బ్రాండ్స్ తో వాళ్ళ వ్యసనాన్ని క్యాష్ చేసుకుని కోట్లు పిండేసాడు.. ఇప్పుడు హామీ మేరకు బ్రాండెడ్ మందు సప్లై చేస్తూ తాగుబోతుల ప్రశంసలు పొందుతున్న చంద్రబాబు ని ఎలాగైనా defame చెయ్యాలని కుట్ర చేస్తున్నావా గుడ్డి ఆంధ్రా??

  3. తాగుబోతులు జెగ్గులు గాన్ని గురిచూసి ‘గుద్దదె0గి జగన్ రెడ్డి ని కాస్త లెవెన్ రెడ్డి గా మార్చారు.. J బ్రాండా మజాకా

  4. జగన్ మోహన్ రెడ్డి సత్య నిష్ఠ పతనం: కుటుంబానికి, ప్రజలకు ద్రోహం చేసే నాయకత్వం

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన స్వంత కుటుంబంతో వ్యవహరించిన తీరును చూస్తే, అది నిజంగా కలత కలిగించే విషయం. తల్లి, అక్కలతో జరిగిన వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు ఆయన గౌరవం, విశ్వాసం, న్యాయం వంటి ప్రాథమిక విలువలను గౌరవించడంలో విఫలమయ్యారని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు న్యాయంగా సేవ చేసే సామర్థ్యం ఎక్కడుంది?

    2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు మాత్రమే జగన్ పార్టీకి ఇచ్చారు, గతంలో సాధించిన 151 సీట్ల నుండి ఇది భారీ పతనం. ఈ ఘోర పరాజయం ప్రజలు ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారని స్పష్టంగా తెలియజేస్తుంది. స్వార్థపరమైన నాయకత్వం మరియు ద్రోహాన్ని ప్రజలు సహించరని గుర్తుంచుకోవాలి.

    “కుటుంబ విషయాలు వ్యక్తిగతం” అని కొట్టిపారేయడం సరికాదు. ప్రజా పదవిలో ఉన్నప్పుడు, వ్యక్తిగత విలువలు నాయకత్వంపై ప్రతిబింబిస్తాయి. జగన్ చేసిన ద్రోహం, ప్రజలు అతనిపై ఉంచిన విశ్వాసాన్ని ద్రోహం చేయడమే. ఇది నాయకుడిగా ఆయన సత్య నిష్ఠకు చేసిన అవమానం.

    మనందరికీ మేలుకొలుపు: ప్రజలు న్యాయం, నిజాయితీ గల నాయకులను మాత్రమే మద్దతు ఇవ్వాలి. కేవలం పదవిలో ఉండటం సరి కాదు; ప్రజలు విలువలకు గౌరవం ఇచ్చే నాయకులను కోరుకుంటున్నారు. నాయకులు కరుణ, న్యాయం, బాధ్యత వంటి విలువలను పాటించాలి, అప్పుడే సత్య నిష్ఠతో ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవచ్చు.

  5. అవినీతి, కాలుష్యం,మద్యపానం, తప్పుడు పత్రాలు, వ్యభిచారం, అబద్దాలు, బానిసత్వం, దగా, మోసం..వీటిని ఎవ్వడూ నిర్ములించలేడు

  6. ఇది కరెక్ట్ .గంజాయి ఎంత మత్తో, మద్యపానం కూడా మతత్ప. గంజాయి ఎక్కువ మతిస్తే మద్యపానం కొంచెం తక్కువ ఇస్తుంది కానీ రెండూ మత్య పదార్థాలు. కాన మద్యపానం నిషేధం చేస్తూ గంజాయి మీద గట్టి యాక్షన్ తీసుకొని రెండిటిని అదుపు చేస్తే పబ్లిక్ లో మత్తు పదార్థాన్ని నెమ్మదిగా వదులుకుంటారు. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది వాళ్ళ స్థితిగతులు కూడా బాగుపడతాయి గవర్నమెంట్ ఆలోచించేది మద్యపానం నుంచి వచ్చే ఆదాయము. కానివేరే విధంగా సమకూర్చుకోవచ్ఛ.దీనివల్ల కొట్లాటలు పాలిటిక్స్ అక్రమ అర్చన ఇవన్నీ మద్యపానం వల్ల వస్తున్నాయి అవి కూడా తగ్గుతాయి. కానీ గవర్నమెంట్ ఈ విధంగా ఆలోచన చెయ్యగలదు.

  7. Liquor is consumed just like bribes are consumed. Prohibition& Excise Dept means Govt prohibits country made liquor but excise means it generates revenue by selling liquor in legal manner. Who can stop it? Extra Revenue is generated. Bribes are collected for extra income only. Both act as catalyst in the mind. None can give up once addicted to it. If you visit courts or Govt offices, there are full of bribe addicts

  8. గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారికి, మద్యం తాగిన వారికి విచక్షణ ఉండదు అని మందుబాబులను అంటారు కానీ అసలు లంచాలు తీసుకున్న వారికి అంతకన్నా విచక్షణ ఉండదు. పోలీసులకు లంచాలిస్తే ఉల్టా కేసులు పెడతారని తెలియదా? జడ్జీలకు లంచాలిస్తే, నకిలీదళిత ప్రభుత్వ ఉద్యోగిని కలెక్టర్ పట్టుకున్నందుకు,తిరిగి పునః నియామకం చేయమని కోర్టు ధిక్కారo. చేసే అవినీతి అదేగా. దొంగలంతా ఐకమత్యంతో గుప్పిట్లో పెట్టుకున్నారు

Comments are closed.