సుప్రీంకోర్టులో హీరోయిన్ కు ఊరట

సుశాంత్ సింగ్ మరణం తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్న అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి, చిన్న ఊరట దొరికింది. రియాతో పాటు, ఆమె కుటుంబ సభ్యులపై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసును…

సుశాంత్ సింగ్ మరణం తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్న అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి, చిన్న ఊరట దొరికింది. రియాతో పాటు, ఆమె కుటుంబ సభ్యులపై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసును సుప్రీంకోర్టు కొట్టేసింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తిని కీలకంగా భావిస్తోంది సీబీఐ, ఈడీ. అందుకే ఆమెతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించింది రియా.

హైకోర్టు, రియాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంలో కూడా రియాకు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. హైకోర్టు తీర్పును పూర్తిగా సమర్థించిన సుప్రీంకోర్టు.. లుక్ అవుట్ నోటీసును పనికిమాలినదిగా అభివర్ణించింది. హై-ప్రొఫైల్ కేసు కాబట్టి లుక్ అవుట్ నోటీసిచ్చినట్టు అనిపిస్తోందని, అంతకుమించి బలమైన ఆధారాలు, కారణాలు ఏవీ కనిపించడం లేదని అభిప్రాయపడింది.

మూడున్నరేళ్లుగా ఈ కేసు పురోగతికి సహకరిస్తున్న రియాపై లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం సమంజసం కాదని, నోటీసు ఇవ్వడంతో హేతుబద్ధత కనిపించడం లేదని తెలిపింది. 2020 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేసుపై బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది.

2020 జూన్ లో బాంద్రాలోని తన అపార్ట్ మెంట్ లో సుశాంత్ సింగ్ చనిపోయాడు. మరణించే సమయానికి సుశాంత్-రియా ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. దీనికితోడు డ్రగ్స్ కేసు కూడా తెరపైకి రావడంతో.. రియాను అదుపులోకి తీసుకున్నారు. బాంబే హైకోర్టు నెల రోజుల తర్వాత రియాకు బెయిల్ మంజూరు చేసింది. సుశాంత్ మరణించిన ఆ ఫ్లాట్ ను తాజాగా అదా శర్మ కొనుగోలు చేసింది.

3 Replies to “సుప్రీంకోర్టులో హీరోయిన్ కు ఊరట”

  1. “ దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంలో కూడా రియాకు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. హైకోర్టు తీర్పును పూర్తిగా సమర్థించిన సుప్రీంకోర్టు.. లుక్ అవుట్ నోటీసును పనికిమాలినదిగా అభివర్ణించింది.”

    దీనిని బట్టి CBIx ఎంత దరిద్రంగా పనిచేస్తోందో అర్ధం అయింది.

Comments are closed.