‘చావు కబురు’ వేదాంతం

నిత్యం శవాల్ని చూసేవాడికి, వాటితోనే బతికేసేవాడికి రాను రాను వైరాగ్యం, వేదాంతం బాగా వంటబట్టేస్తుంది. బస్తీ బాలరాజు సంగతి కూడా ఇలాంటిదే.  Advertisement చావుకబురు చల్లగా సినిమాలో శవాల అంబులెన్స్ డ్రైవర్ ఇతగాడు. మరి…

నిత్యం శవాల్ని చూసేవాడికి, వాటితోనే బతికేసేవాడికి రాను రాను వైరాగ్యం, వేదాంతం బాగా వంటబట్టేస్తుంది. బస్తీ బాలరాజు సంగతి కూడా ఇలాంటిదే. 

చావుకబురు చల్లగా సినిమాలో శవాల అంబులెన్స్ డ్రైవర్ ఇతగాడు. మరి అలాంటి వాడి నోట వైరాగ్యం మాటలు కాక మరేం వస్తాయి. 

' మైనేమ్ ఈజ్ రాజు… చస్తే ఏటైపోతుంది' అంటూ పాట అందుకున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మించే చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయ హీరో.అతగాడే ఈ రాజు. 

సినిమా నుంచి టీజర్, డైలాగ్ టీజర్ వచ్చాయి. ఇప్పుడు సాంగ్ వచ్చింది. ఈ పాటను జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసారు. కరుణాకర్ సాహిత్యం అందించారు.

కౌశిక్ పెగళ్లపాటి డైరక్షన్ లో తయారయ్యే ఈ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఆసుపత్రి నర్సుగా నటిస్తోంది. చావుల వాహనం డ్రైవర్ కు, ఆసుపత్రి నర్సుకు మధ్య ప్రేమాయణం నేపథ్యంలో రాసుకున్న కథతో ఈ సినిమాతయారవుతోంది.