ఆచార్య అసలు రేటు ఎంత?

కరోనా నేపథ్యంలో అమెరికాలో అసలు సినిమాలు వేయడమే కష్టంగా వుంది. ఇంక దానికి కలెక్షన్లు, ఆపై కోట్లకు కోట్లు రేట్లు అంటే కాస్త నమ్మశక్యంగా వుండదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను కొనేవారు…

కరోనా నేపథ్యంలో అమెరికాలో అసలు సినిమాలు వేయడమే కష్టంగా వుంది. ఇంక దానికి కలెక్షన్లు, ఆపై కోట్లకు కోట్లు రేట్లు అంటే కాస్త నమ్మశక్యంగా వుండదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను కొనేవారు కనిపించడం లేదు. 

ఏ సినిమా అయినా వేసి పెట్టమంటే వేస్తాం కానీ అడ్వాన్స్ లు, రేట్లు అంటే వద్దు అంటున్నారు ఓవర్ సీస్ బయ్యర్లు.  అయితే ఆచార్య సినిమా విడుదల ఇంకా చాలా దూరంగా వుంది. మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా వున్నారు. కొరటాల శివ దర్శకత్వం. దాంతో క్రేజ్ వుంది.

ఈ క్రేజ్ చూసి ఓవర్ సీస్ రైట్స్ ను కొనడానికి ముందుకు వచ్చారు. డీల్ కూడా అయిపోయింది. 11 కోట్ల 30 లక్షలు అని ప్రచారం అయితే వుంది. కానీ అసలు విషయం వేరు అని కూడా వినిపిస్తోంది. అయిదు కోట్ల మినిమమ్ గ్యారంటీ, కోటి రూపాయల రిటర్న్ బుల్ అడ్వన్స్ కు ఓవర్ సీస్ హక్కులు ఇచ్చారని తెలుస్తోంది.

కరోనా లేనపుడే సైరా తదితర సినిమాలకు 11 కోట్ల పలకడం కష్టంగా వుండేది. అలాంటి కరోనా తో అమెరికా కుతకుతలాడుతోంది. ఇలాంటి టైమ్ లో ఇంత రేటు అన్నది కేవలం ప్రచారమే అని టాక్ వినిపిస్తోంది.

ఓవర్ సీస్ బయ్యర్లు కిందకు అమ్ముకోవడం కోసం ఎక్కువకు కొన్నామని చెప్పుకోవడం పరిపాటి. అయినా ఇండస్ట్రీలో రహస్యాలు దాగవు. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అసలు విషయాలు బయటకు వచ్చేస్తాయి.

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్