ఈ వారం ట్రేడ్ టాక్

సంక్రాంతి సినిమాల సందడి ముగిసిన తర్వాత ఇక సినిమా థియేటర్లకు జనం తాకిడి తగ్గుతుందని, ఇంకా కరోనా భయం అలాగే వుంది కనుక మళ్లీ పెద్ద సినిమాలు వచ్చే వరకు ప్రేక్షకులు పెద్దగా రారని…

సంక్రాంతి సినిమాల సందడి ముగిసిన తర్వాత ఇక సినిమా థియేటర్లకు జనం తాకిడి తగ్గుతుందని, ఇంకా కరోనా భయం అలాగే వుంది కనుక మళ్లీ పెద్ద సినిమాలు వచ్చే వరకు ప్రేక్షకులు పెద్దగా రారని భావించారు. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

విడుదలకు ముందే అందులోని ఒక పాట వైరల్ అవడంతో అదే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. దానికి తోడు యాంకర్ ప్రదీప్ హీరో కావడం కూడా ఆ సినిమాకు కలిసొచ్చింది. 

టాక్ ఎంత వీక్ వచ్చినా కానీ కలక్షన్స్ రాబట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలో వచ్చిన హిట్ సినిమాల పక్కన చేరిపోయింది. క్రాక్ రవితేజ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకోగా ఈ వారం జాంబీ రెడ్డితో పాటు అనేక చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. 

మామూలుగా ఫిబ్రవరిలో సినిమాల తాకిడి తక్కువే వుంటుంది కానీ ఈసారి పరీక్షలు మేలో వుంటాయి కనుక ఫిబ్రవరిలోను బాక్సాఫీస్ బిజీగా వుండనుంది. దానికి తోడు సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో మరిన్ని సినిమాలు బారులు తీరుతున్నాయి. 

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్